1తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానముగలవాడగును. అపహాసకుడు గద్దింపునకు లోబడడు.A wise son heareth his father's instruction: but a scorner heareth not rebuke.
2నోటి ఫలముచేత మనుష్యుడు మేలు ననుభవించును విశ్వాసఘాతకులు బలాత్కారముచేత నశించుదురు.A man shall eat good by the fruit of his mouth: but the soul of the transgressors shall eat violence.
3తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొనును ఊరకొనక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చు కొనును.He that keepeth his mouth keepeth his life: but he that openeth wide his lips shall have destruction.
4సోమరి ఆశపడును గాని వాని ప్రాణమున కేమియు దొరకదు శ్రద్ధగలవారి ప్రాణము పుష్టిగా నుండును.The soul of the sluggard desireth, and hath nothing: but the soul of the diligent shall be made fat.
5నీతిమంతునికి కల్ల మాట అసహ్యము భక్తిహీనుడు నిందించుచు అవమానపరచును.A righteous man hateth lying: but a wicked man is loathsome, and cometh to shame.
6యథార్థవర్తనునికి నీతియే రక్షకము భక్తిహీనత పాపులను చెరిపివేయును.Righteousness keepeth him that is upright in the way: but wickedness overthroweth the sinner.
7ధనవంతులమని చెప్పుకొనుచు లేమిడి గలవారు కలరు దరిద్రులమని చెప్పుకొనుచు బహు ధనముగలవారు కలరు.There is that maketh himself rich, yet hath nothing: there is that maketh himself poor, yet hath great riches.
8ఒకని ప్రాణమునకు వాని ఐశ్వర్యముప్రాయశ్చిత్తము చేయును దరిద్రుడు బెదరింపు మాటలు వినడు.The ransom of a man's life are his riches: but the poor heareth not rebuke.
9నీతిమంతుల వెలుగు తేజరిల్లును భక్తిహీనుల దీపము ఆరిపోవును.The light of the righteous rejoiceth: but the lamp of the wicked shall be put out.
10గర్వమువలన జగడమే పుట్టును ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును.Only by pride cometh contention: but with the well advised is wisdom.
11మోసముచేత సంపాదించిన ధనము క్షీణించిపోవును కష్టము చేసి కూర్చుకొనువాడు తన ఆస్తిని వృద్ధిచేసి కొనును.Wealth gotten by vanity shall be diminished: but he that gathereth by labour shall increase.
12కోరిక సఫలము కాకుండుటచేత హృదయము నొచ్చును సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము.Hope deferred maketh the heart sick: but when the desire cometh, it is a tree of life.
13ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్షనొందును ఆజ్ఞవిషయమై భయభక్తులుగలవాడు లాభముపొందును.Whoso despiseth the word shall be destroyed: but he that feareth the commandment shall be rewarded.
14జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట అది మరణపాశములలోనుండి విడిపించును.The law of the wise is a fountain of life, to depart from the snares of death.
15సుబుద్ధి దయను సంపాదించును విశ్వాసఘాతకుల మార్గము కష్టము.Good understanding giveth favour: but the way of transgressors is hard.
16వివేకులందరు తెలివి గలిగి పని జరుపుకొందురు బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడిపరచును.Every prudent man dealeth with knowledge: but a fool layeth open his folly.
17దుష్టుడైన దూత కీడునకు లోబడును. నమ్మకమైన రాయబారి ఔషధమువంటివాడు.A wicked messenger falleth into mischief: but a faithful ambassador is health.
18శిక్షను ఉపేక్షించువానికి అవమాన దారిద్ర్యతలు ప్రాప్తించును గద్దింపును లక్ష్యపెట్టువాడు ఘనతనొందును.Poverty and shame shall be to him that refuseth instruction: but he that regardeth reproof shall be honoured.
19ఆశ తీరుట ప్రాణమునకు తీపి చెడుతనమును విడుచుట మూర్ఖులకు అసహ్యము.The desire accomplished is sweet to the soul: but it is abomination to fools to depart from evil.
20జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానముగలవా డగును. మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును.He that walketh with wise men shall be wise: but a companion of fools shall be destroyed.
21కీడు పాపులను తరుమును నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును.Evil pursueth sinners: but to the righteous good shall be repayed.
22మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలనుగా చేయును పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును.A good man leaveth an inheritance to his children's children: and the wealth of the sinner is laid up for the just.
23బీదలు సేద్యపరచు క్రొత్త భూమి విస్తారముగా పండును అన్యాయమువలన నశించువారు కలరు.Much food is in the tillage of the poor: but there is that is destroyed for want of judgment.
24బెత్తము వాడనివాడు తన కుమారునికి విరోధి కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును.He that spareth his rod hateth his son: but he that loveth him chasteneth him betimes.
25నీతిమంతుడు ఆకలితీర భోజనముచేయును భక్తిహీనుల కడుపునకు లేమి కలుగును.The righteous eateth to the satisfying of his soul: but the belly of the wicked shall want.