Bible

Proverbs 13 - KJV (Telugu)

1 A wise son heareth his father's instruction: but a scorner heareth not rebuke.తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానముగలవాడగును. అపహాసకుడు గద్దింపునకు లోబడడు.

2 A man shall eat good by the fruit of his mouth: but the soul of the transgressors shall eat violence.నోటి ఫలముచేత మనుష్యుడు మేలు ననుభవించును విశ్వాసఘాతకులు బలాత్కారముచేత నశించుదురు.

3 He that keepeth his mouth keepeth his life: but he that openeth wide his lips shall have destruction.తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొనును ఊరకొనక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చు కొనును.

4 The soul of the sluggard desireth, and hath nothing: but the soul of the diligent shall be made fat.సోమరి ఆశపడును గాని వాని ప్రాణమున కేమియు దొరకదు శ్రద్ధగలవారి ప్రాణము పుష్టిగా నుండును.

5 A righteous man hateth lying: but a wicked man is loathsome, and cometh to shame.నీతిమంతునికి కల్ల మాట అసహ్యము భక్తిహీనుడు నిందించుచు అవమానపరచును.

6 Righteousness keepeth him that is upright in the way: but wickedness overthroweth the sinner.యథార్థవర్తనునికి నీతియే రక్షకము భక్తిహీనత పాపులను చెరిపివేయును.

7 There is that maketh himself rich, yet hath nothing: there is that maketh himself poor, yet hath great riches.ధనవంతులమని చెప్పుకొనుచు లేమిడి గలవారు కలరు దరిద్రులమని చెప్పుకొనుచు బహు ధనముగలవారు కలరు.

8 The ransom of a man's life are his riches: but the poor heareth not rebuke.ఒకని ప్రాణమునకు వాని ఐశ్వర్యముప్రాయశ్చిత్తము చేయును దరిద్రుడు బెదరింపు మాటలు వినడు.

9 The light of the righteous rejoiceth: but the lamp of the wicked shall be put out.నీతిమంతుల వెలుగు తేజరిల్లును భక్తిహీనుల దీపము ఆరిపోవును.

10 Only by pride cometh contention: but with the well advised is wisdom.గర్వమువలన జగడమే పుట్టును ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును.

11 Wealth gotten by vanity shall be diminished: but he that gathereth by labour shall increase.మోసముచేత సంపాదించిన ధనము క్షీణించిపోవును కష్టము చేసి కూర్చుకొనువాడు తన ఆస్తిని వృద్ధిచేసి కొనును.

12 Hope deferred maketh the heart sick: but when the desire cometh, it is a tree of life.కోరిక సఫలము కాకుండుటచేత హృదయము నొచ్చును సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము.

13 Whoso despiseth the word shall be destroyed: but he that feareth the commandment shall be rewarded.ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్షనొందును ఆజ్ఞవిషయమై భయభక్తులుగలవాడు లాభముపొందును.

14 The law of the wise is a fountain of life, to depart from the snares of death.జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట అది మరణపాశములలోనుండి విడిపించును.

15 Good understanding giveth favour: but the way of transgressors is hard.సుబుద్ధి దయను సంపాదించును విశ్వాసఘాతకుల మార్గము కష్టము.

16 Every prudent man dealeth with knowledge: but a fool layeth open his folly.వివేకులందరు తెలివి గలిగి పని జరుపుకొందురు బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడిపరచును.

17 A wicked messenger falleth into mischief: but a faithful ambassador is health.దుష్టుడైన దూత కీడునకు లోబడును. నమ్మకమైన రాయబారి ఔషధమువంటివాడు.

18 Poverty and shame shall be to him that refuseth instruction: but he that regardeth reproof shall be honoured.శిక్షను ఉపేక్షించువానికి అవమాన దారిద్ర్యతలు ప్రాప్తించును గద్దింపును లక్ష్యపెట్టువాడు ఘనతనొందును.

19 The desire accomplished is sweet to the soul: but it is abomination to fools to depart from evil.ఆశ తీరుట ప్రాణమునకు తీపి చెడుతనమును విడుచుట మూర్ఖులకు అసహ్యము.

20 He that walketh with wise men shall be wise: but a companion of fools shall be destroyed.జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానముగలవా డగును. మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును.

21 Evil pursueth sinners: but to the righteous good shall be repayed.కీడు పాపులను తరుమును నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును.

22 A good man leaveth an inheritance to his children's children: and the wealth of the sinner is laid up for the just.మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలనుగా చేయును పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును.

23 Much food is in the tillage of the poor: but there is that is destroyed for want of judgment.బీదలు సేద్యపరచు క్రొత్త భూమి విస్తారముగా పండును అన్యాయమువలన నశించువారు కలరు.

24 He that spareth his rod hateth his son: but he that loveth him chasteneth him betimes.బెత్తము వాడనివాడు తన కుమారునికి విరోధి కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును.

25 The righteous eateth to the satisfying of his soul: but the belly of the wicked shall want.నీతిమంతుడు ఆకలితీర భోజనముచేయును భక్తిహీనుల కడుపునకు లేమి కలుగును.

Telugu Bible