Bible

Proverbs 13 - ASV (Telugu)

1 A wise son `heareth' his father's instruction; But a scoffer heareth not rebuke.తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానముగలవాడగును. అపహాసకుడు గద్దింపునకు లోబడడు.

2 A man shall eat good by the fruit of his mouth; But the soul of the treacherous `shall eat' violence.నోటి ఫలముచేత మనుష్యుడు మేలు ననుభవించును విశ్వాసఘాతకులు బలాత్కారముచేత నశించుదురు.

3 He that guardeth his mouth keepeth his life; `But' he that openeth wide his lips shall have destruction.తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొనును ఊరకొనక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చు కొనును.

4 The soul of the sluggard desireth, and hath nothing; But the soul of the diligent shall be made fat.సోమరి ఆశపడును గాని వాని ప్రాణమున కేమియు దొరకదు శ్రద్ధగలవారి ప్రాణము పుష్టిగా నుండును.

5 A righteous man hateth lying; But a wicked man is loathsome, and cometh to shame.నీతిమంతునికి కల్ల మాట అసహ్యము భక్తిహీనుడు నిందించుచు అవమానపరచును.

6 Righteousness guardeth him that is upright in the way; But wickedness overthroweth the sinner.యథార్థవర్తనునికి నీతియే రక్షకము భక్తిహీనత పాపులను చెరిపివేయును.

7 There is that maketh himself rich, yet hath nothing: There is that maketh himself poor, yet hath great wealth.ధనవంతులమని చెప్పుకొనుచు లేమిడి గలవారు కలరు దరిద్రులమని చెప్పుకొనుచు బహు ధనముగలవారు కలరు.

8 The ransom of a man's life is his riches; But the poor heareth no threatening.ఒకని ప్రాణమునకు వాని ఐశ్వర్యముప్రాయశ్చిత్తము చేయును దరిద్రుడు బెదరింపు మాటలు వినడు.

9 The light of the righteous rejoiceth; But the lamp of the wicked shall be put out.నీతిమంతుల వెలుగు తేజరిల్లును భక్తిహీనుల దీపము ఆరిపోవును.

10 By pride cometh only contention; But with the well-advised is wisdom.గర్వమువలన జగడమే పుట్టును ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును.

11 Wealth gotten by vanity shall be diminished; But he that gathereth by labor shall have increase.మోసముచేత సంపాదించిన ధనము క్షీణించిపోవును కష్టము చేసి కూర్చుకొనువాడు తన ఆస్తిని వృద్ధిచేసి కొనును.

12 Hope deferred maketh the heart sick; But when the desire cometh, it is a tree of life.కోరిక సఫలము కాకుండుటచేత హృదయము నొచ్చును సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము.

13 Whoso despiseth the word bringeth destruction on himself; But he that feareth the commandment shall be rewarded.ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్షనొందును ఆజ్ఞవిషయమై భయభక్తులుగలవాడు లాభముపొందును.

14 The law of the wise is a fountain of life, That one may depart from the snares of death.జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట అది మరణపాశములలోనుండి విడిపించును.

15 Good understanding giveth favor; But the way of the transgressor is hard.సుబుద్ధి దయను సంపాదించును విశ్వాసఘాతకుల మార్గము కష్టము.

16 Every prudent man worketh with knowledge; But a fool flaunteth `his' folly.వివేకులందరు తెలివి గలిగి పని జరుపుకొందురు బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడిపరచును.

17 A wicked messenger falleth into evil; But a faithful ambassador is health.దుష్టుడైన దూత కీడునకు లోబడును. నమ్మకమైన రాయబారి ఔషధమువంటివాడు.

18 Poverty and shame `shall be to' him that refuseth correction; But he that regardeth reproof shall be honored.శిక్షను ఉపేక్షించువానికి అవమాన దారిద్ర్యతలు ప్రాప్తించును గద్దింపును లక్ష్యపెట్టువాడు ఘనతనొందును.

19 The desire accomplished is sweet to the soul; But it is an abomination to fools to depart from evil.ఆశ తీరుట ప్రాణమునకు తీపి చెడుతనమును విడుచుట మూర్ఖులకు అసహ్యము.

20 Walk with wise men, and thou shalt be wise; But the companion of fools shall smart for it.జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానముగలవా డగును. మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును.

21 Evil pursueth sinners; But the righteous shall be recompensed with good.కీడు పాపులను తరుమును నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును.

22 A good man leaveth an inheritance to his children's children; And the wealth of the sinner is laid up for the righteous.మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలనుగా చేయును పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును.

23 Much food `is in' the tillage of the poor; But there is that is destroyed by reason of injustice.బీదలు సేద్యపరచు క్రొత్త భూమి విస్తారముగా పండును అన్యాయమువలన నశించువారు కలరు.

24 He that spareth his rod hateth his son; But he that loveth him chasteneth him betimes.బెత్తము వాడనివాడు తన కుమారునికి విరోధి కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును.

25 The righteous eateth to the satisfying of his soul; But the belly of the wicked shall want.నీతిమంతుడు ఆకలితీర భోజనముచేయును భక్తిహీనుల కడుపునకు లేమి కలుగును.

Telugu Bible