Proverbs 13 - YLT (Telugu)
1 A wise son -- the instruction of a father, And a scorner -- he hath not heard rebuke.తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానముగలవాడగును. అపహాసకుడు గద్దింపునకు లోబడడు.
2 From the fruit of the mouth a man eateth good, And the soul of the treacherous -- violence.నోటి ఫలముచేత మనుష్యుడు మేలు ననుభవించును విశ్వాసఘాతకులు బలాత్కారముచేత నశించుదురు.
3 Whoso is keeping his mouth, is keeping his soul, Whoso is opening wide his lips -- ruin to him!తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొనును ఊరకొనక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చు కొనును.
4 The soul of the slothful is desiring, and hath not. And the soul of the diligent is made fat.సోమరి ఆశపడును గాని వాని ప్రాణమున కేమియు దొరకదు శ్రద్ధగలవారి ప్రాణము పుష్టిగా నుండును.
5 A false word the righteous hateth, And the wicked causeth abhorrence, and is confounded.నీతిమంతునికి కల్ల మాట అసహ్యము భక్తిహీనుడు నిందించుచు అవమానపరచును.
6 Righteousness keepeth him who is perfect in the way, And wickedness overthroweth a sin offering.యథార్థవర్తనునికి నీతియే రక్షకము భక్తిహీనత పాపులను చెరిపివేయును.
7 There is who is making himself rich, and hath nothing, Who is making himself poor, and wealth `is' abundant.ధనవంతులమని చెప్పుకొనుచు లేమిడి గలవారు కలరు దరిద్రులమని చెప్పుకొనుచు బహు ధనముగలవారు కలరు.
8 The ransom of a man's life `are' his riches, And the poor hath not heard rebuke.ఒకని ప్రాణమునకు వాని ఐశ్వర్యముప్రాయశ్చిత్తము చేయును దరిద్రుడు బెదరింపు మాటలు వినడు.
9 The light of the righteous rejoiceth, And the lamp of the wicked is extinguished.నీతిమంతుల వెలుగు తేజరిల్లును భక్తిహీనుల దీపము ఆరిపోవును.
10 A vain man through pride causeth debate, And with the counselled `is' wisdom.గర్వమువలన జగడమే పుట్టును ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును.
11 Wealth from vanity becometh little, And whoso is gathering by the hand becometh great.మోసముచేత సంపాదించిన ధనము క్షీణించిపోవును కష్టము చేసి కూర్చుకొనువాడు తన ఆస్తిని వృద్ధిచేసి కొనును.
12 Hope prolonged is making the heart sick, And a tree of life `is' the coming desire.కోరిక సఫలము కాకుండుటచేత హృదయము నొచ్చును సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము.
13 Whoso is despising the Word is destroyed for it, And whoso is fearing the Command is repayed.ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్షనొందును ఆజ్ఞవిషయమై భయభక్తులుగలవాడు లాభముపొందును.
14 The law of the wise `is' a fountain of life, To turn aside from snares of death.జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట అది మరణపాశములలోనుండి విడిపించును.
15 Good understanding giveth grace, And the way of the treacherous `is' hard.సుబుద్ధి దయను సంపాదించును విశ్వాసఘాతకుల మార్గము కష్టము.
16 Every prudent one dealeth with knowledge, And a fool spreadeth out folly.వివేకులందరు తెలివి గలిగి పని జరుపుకొందురు బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడిపరచును.
17 A wicked messenger falleth into evil, And a faithful ambassador is healing.దుష్టుడైన దూత కీడునకు లోబడును. నమ్మకమైన రాయబారి ఔషధమువంటివాడు.
18 Whoso is refusing instruction -- poverty and shame, And whoso is observing reproof is honoured.శిక్షను ఉపేక్షించువానికి అవమాన దారిద్ర్యతలు ప్రాప్తించును గద్దింపును లక్ష్యపెట్టువాడు ఘనతనొందును.
19 A desire accomplished is sweet to the soul, And an abomination to fools `is': Turn from evil.ఆశ తీరుట ప్రాణమునకు తీపి చెడుతనమును విడుచుట మూర్ఖులకు అసహ్యము.
20 Whoso is walking with wise men is wise, And a companion of fools suffereth evil.జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానముగలవా డగును. మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును.
21 Evil pursueth sinners, And good recompenseth the righteous.కీడు పాపులను తరుమును నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును.
22 A good man causeth sons' sons to inherit, And laid up for the righteous `is' the sinner's wealth.మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలనుగా చేయును పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును.
23 Abundance of food -- the tillage of the poor, And substance is consumed without judgment.బీదలు సేద్యపరచు క్రొత్త భూమి విస్తారముగా పండును అన్యాయమువలన నశించువారు కలరు.
24 Whoso is sparing his rod is hating his son, And whoso is loving him hath hastened him chastisement.బెత్తము వాడనివాడు తన కుమారునికి విరోధి కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును.
25 The righteous is eating to the satiety of his soul, And the belly of the wicked lacketh!నీతిమంతుడు ఆకలితీర భోజనముచేయును భక్తిహీనుల కడుపునకు లేమి కలుగును.
Telugu Bible