Proverbs 13 - WEB (Telugu)
1 A wise son listens to his father's instruction, But a scoffer doesn't listen to rebuke.తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానముగలవాడగును. అపహాసకుడు గద్దింపునకు లోబడడు.
2 By the fruit of his lips, a man enjoys good things; But the unfaithful crave violence.నోటి ఫలముచేత మనుష్యుడు మేలు ననుభవించును విశ్వాసఘాతకులు బలాత్కారముచేత నశించుదురు.
3 He who guards his mouth guards his soul. One who opens wide his lips comes to ruin.తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొనును ఊరకొనక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చు కొనును.
4 The soul of the sluggard desires, and has nothing, But the desire of the diligent shall be fully satisfied.సోమరి ఆశపడును గాని వాని ప్రాణమున కేమియు దొరకదు శ్రద్ధగలవారి ప్రాణము పుష్టిగా నుండును.
5 A righteous man hates lies, But a wicked man brings shame and disgrace.నీతిమంతునికి కల్ల మాట అసహ్యము భక్తిహీనుడు నిందించుచు అవమానపరచును.
6 Righteousness guards the way of integrity, But wickedness overthrows the sinner.యథార్థవర్తనునికి నీతియే రక్షకము భక్తిహీనత పాపులను చెరిపివేయును.
7 There are some who pretend to be rich, yet have nothing. There are some who pretend to be poor, yet have great wealth.ధనవంతులమని చెప్పుకొనుచు లేమిడి గలవారు కలరు దరిద్రులమని చెప్పుకొనుచు బహు ధనముగలవారు కలరు.
8 The ransom of a man's life is his riches, But the poor hear no threats.ఒకని ప్రాణమునకు వాని ఐశ్వర్యముప్రాయశ్చిత్తము చేయును దరిద్రుడు బెదరింపు మాటలు వినడు.
9 The light of the righteous shines brightly, But the lamp of the wicked is snuffed out.నీతిమంతుల వెలుగు తేజరిల్లును భక్తిహీనుల దీపము ఆరిపోవును.
10 Pride only breeds quarrels, But with ones who take advice is wisdom.గర్వమువలన జగడమే పుట్టును ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును.
11 Wealth gained dishonestly dwindles away, But he who gathers by hand makes it grow.మోసముచేత సంపాదించిన ధనము క్షీణించిపోవును కష్టము చేసి కూర్చుకొనువాడు తన ఆస్తిని వృద్ధిచేసి కొనును.
12 Hope deferred makes the heart sick, But when longing is fulfilled, it is a tree of life.కోరిక సఫలము కాకుండుటచేత హృదయము నొచ్చును సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము.
13 Whoever despises instruction will pay for it, But he who respects a command will be rewarded.ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్షనొందును ఆజ్ఞవిషయమై భయభక్తులుగలవాడు లాభముపొందును.
14 The teaching of the wise is a spring of life, To turn from the snares of death.జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట అది మరణపాశములలోనుండి విడిపించును.
15 Good understanding wins favor; But the way of the unfaithful is hard.సుబుద్ధి దయను సంపాదించును విశ్వాసఘాతకుల మార్గము కష్టము.
16 Every prudent man acts from knowledge, But a fool exposes folly.వివేకులందరు తెలివి గలిగి పని జరుపుకొందురు బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడిపరచును.
17 A wicked messenger falls into trouble, But a trustworthy envoy gains healing.దుష్టుడైన దూత కీడునకు లోబడును. నమ్మకమైన రాయబారి ఔషధమువంటివాడు.
18 Poverty and shame come to him who refuses discipline, But he who heeds correction shall be honored.శిక్షను ఉపేక్షించువానికి అవమాన దారిద్ర్యతలు ప్రాప్తించును గద్దింపును లక్ష్యపెట్టువాడు ఘనతనొందును.
19 Longing fulfilled is sweet to the soul, But fools detest turning from evil.ఆశ తీరుట ప్రాణమునకు తీపి చెడుతనమును విడుచుట మూర్ఖులకు అసహ్యము.
20 One who walks with wise men grows wise, But a companion of fools suffers harm.జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానముగలవా డగును. మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును.
21 Misfortune pursues sinners, But prosperity rewards the righteous.కీడు పాపులను తరుమును నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును.
22 A good man leaves an inheritance to his children's children, But the wealth of the sinner is stored for the righteous.మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలనుగా చేయును పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును.
23 An abundance of food is in poor people's fields, But injustice sweeps it away.బీదలు సేద్యపరచు క్రొత్త భూమి విస్తారముగా పండును అన్యాయమువలన నశించువారు కలరు.
24 One who spares the rod hates his son, But one who loves him is careful to discipline him.బెత్తము వాడనివాడు తన కుమారునికి విరోధి కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును.
25 The righteous one eats to the satisfying of his soul, But the belly of the wicked goes hungry.నీతిమంతుడు ఆకలితీర భోజనముచేయును భక్తిహీనుల కడుపునకు లేమి కలుగును.
Telugu Bible