Bible

Psalm 103 - WEB (Telugu)

1 > Praise Yahweh, my soul! All that is within me, praise his holy name!నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. నా అంతరంగముననున్న సమస్తమా, ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము.

2 Praise Yahweh, my soul, And don't forget all his benefits;నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము

3 Who forgives all your sins; Who heals all your diseases;ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు.

4 Who redeems your life from destruction; Who crowns you with loving kindness and tender mercies;సమాధిలోనుండి నీ ప్రాణమును విమోచించు చున్నాడు కరుణాకటాక్షములను నీకు కిరీటముగా ఉంచు చున్నాడు

5 Who satisfies your desire with good things, So that your youth is renewed like the eagle's.పక్షిరాజు ¸°వనమువలె నీ ¸°వనము క్రొత్తదగు చుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు

6 Yahweh executes righteous acts, And justice for all who are oppressed.యెహోవా నీతిక్రియలను జరిగించుచు బాధింపబడు వారికందరికి న్యాయము తీర్చును

7 He made known his ways to Moses, His deeds to the children of Israel.ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనుపరచెను

8 Yahweh is merciful and gracious, Slow to anger, and abundant in loving kindness.యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు దీర్ఘశాంతుడు కృపాసమృద్ధిగలవాడు.

9 He will not always accuse; Neither will he stay angry forever.ఆయన ఎల్లప్పుడు వ్యాజ్యెమాడువాడు కాడు ఆయన నిత్యము కోపించువాడు కాడు.

10 He has not dealt with us according to our sins, Nor repaid us for our iniquities.మన పాపములనుబట్టి మనకు ప్రతికారము చేయలేదు మన దోషములనుబట్టి మనకు ప్రతిఫలమియ్యలేదు.

11 For as the heavens are high above the earth, So great is his loving kindness toward those who fear him.భూమికంటె ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయనయందు భయభక్తులు గలవారియెడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది.

12 As far as the east is from the west, So far has he removed our transgressions from us.పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూర పరచి యున్నాడు.

13 Like a father has compassion on his children, So Yahweh has compassion on those who fear him.తండ్రి తన కుమారులయెడల జాలిపడునట్లు యెహోవా తనయందు భయభక్తులు గలవారి యెడల జాలిపడును.

14 For he knows how we are made. He remembers that we are dust.మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసేయున్నది మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసికొను చున్నాడు.

15 As for man, his days are like grass. As a flower of the field, so he flourishes.నరుని ఆయువు గడ్డివలె నున్నది అడవి పువ్వు పూయునట్లు వాడు పూయును.

16 For the wind passes over it, and it is gone. Its place remembers it no more.దానిమీద గాలి వీచగా అది లేకపోవును ఆ మీదట దాని చోటు దాని నెరుగదు.

17 But Yahweh's loving kindness is from everlasting to everlasting with those who fear him, His righteousness to children's children;ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడల ననుస రించి నడచుకొను వారిమీద యెహోవాయందు భయభక్తులు గలవారిమీద

18 To those who keep his covenant, To those who remember to obey his precepts.ఆయన కృప యుగయుగములు నిలుచును ఆయన నీతి వారికి పిల్లపిల్ల తరమున నిలుచును.

19 Yahweh has established his throne in the heavens. His kingdom rules over all.యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిర పరచియున్నాడు. ఆయన అన్నిటిమీదరాజ్యపరిపాలనచేయుచున్నాడు.

20 Praise Yahweh, you angels of his, Who are mighty in strength, who fulfill his word, Obeying the voice of his word.యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకులోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా, ఆయనను సన్నుతించుడి.

21 Praise Yahweh, all you hosts of his, You servants of his, who do his pleasure.యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా, మీరందరు ఆయనను సన్నుతించుడి.

22 Praise Yahweh, all you works of his, In all places of his dominion. Praise Yahweh, my soul.యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలో నున్న ఆయన సర్వకార్యములారా, ఆయనను స్తుతిం చుడి. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము.

Telugu Bible