మార్కు సువార్త 12:13
వారు మాటలలో ఆయనను చిక్కుపరచవలెనని, పరిసయ్యులను హేరోదీయులను కొందరిని ఆయన యొద్దకు పంపిరి.
And | Καὶ | kai | kay |
they send | ἀποστέλλουσιν | apostellousin | ah-poh-STALE-loo-seen |
unto | πρὸς | pros | prose |
him | αὐτόν | auton | af-TONE |
certain | τινας | tinas | tee-nahs |
of the | τῶν | tōn | tone |
Pharisees | Φαρισαίων | pharisaiōn | fa-ree-SAY-one |
and | καὶ | kai | kay |
of the | τῶν | tōn | tone |
Herodians, | Ἡρῳδιανῶν | hērōdianōn | ay-roh-thee-ah-NONE |
to | ἵνα | hina | EE-na |
catch | αὐτὸν | auton | af-TONE |
him | ἀγρεύσωσιν | agreusōsin | ah-GRAYF-soh-seen |
in his words. | λόγῳ | logō | LOH-goh |
Cross Reference
లూకా సువార్త 20:20
వారాయనను కనిపెట్టుచు, అధిపతి వశమునకును అధికారమునకును ఆయనను అప్పగించుటకై ఆయన మాటలయందు తప్పు పట్టవలెనని, తాము నీతిమంతులని అనిపించుకొను వేగుల వారిని ఆయనయొద్దకు పంపిరి.
లూకా సువార్త 11:54
వదకుచు చాల సంగతులనుగూర్చి ఆయనను మాట లాడింపసాగిరి.
మార్కు సువార్త 3:6
పరిసయ్యులు వెలుపలికి పోయి వెంటనే హేరోదీయులతో కలిసికొని, ఆయన నేలాగు సంహరింతుమా యని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి.
మార్కు సువార్త 8:15
ఆయనచూచుకొనుడి; పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చియు హేరోదు పులిసిన పిండినిగూర్చియు జాగ్రత్త పడుడని వారిని హెచ్చరింపగా
మత్తయి సువార్త 22:15
అప్పుడు పరిసయ్యులు వెళ్లి, మాటలలో ఆయనను చిక్కుపరచవలెనని ఆలోచనచేయుచు
మత్తయి సువార్త 16:6
అప్పుడు యేసుచూచుకొనుడి, పరిసయ్యులు సద్దూకయ్యులు అను వారి పులిసిన పిండినిగూర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పెను.
యిర్మీయా 18:18
అప్పుడు జనులుయిర్మీయా విషయమై యుక్తిగల యోచన చేతము రండి, యాజకుడు ధర్మశాస్త్రము విని పించక మానడు, జ్ఞాని యోచనలేకుండ నుండడు, ప్రవక్త వాక్యము చెప్పక మానడు, వాని మాటలలో దేనిని విన కుండ మాటలతో వాని కొట్టుదము రండి అని చెప్పు కొనుచుండిరి.
యెషయా గ్రంథము 29:21
కీడుచేయ యత్నించుచు ఒక్క వ్యాజ్యెమును బట్టి యితరులను పాపులనుగా చేయుచు గుమ్మములో తమ్మును గద్దించువానిని పట్టుకొనవలెనని ఉరి నొడ్డుచు మాయమాటలచేత నీతిమంతుని పడద్రోయువారు నరకబడుదురు.
కీర్తనల గ్రంథము 140:5
గర్విష్ఠులు నాకొరకు ఉరిని త్రాళ్లను చాటుగా ఒడ్డి యున్నారు వారు త్రోవప్రక్కను వల పరచియున్నారు. నన్ను పట్టుకొనుటకై ఉచ్చుల నొగ్గియున్నారు. (సెలా.)
కీర్తనల గ్రంథము 56:5
దినమెల్ల వారు నా మాటలు అపార్థము చేయుదురు నాకు హాని చేయవలెనన్న తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నవి.
కీర్తనల గ్రంథము 38:12
నా ప్రాణము తీయజూచువారు ఉరులు ఒడ్డు చున్నారు నాకు కీడుచేయజూచువారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్ల కపటోపాయములు పన్ను చున్నారు.