Luke 11:40
అవివేకులారా, వెలుపలి భాగమును చేసినవాడు లోపటి భాగమును చేయలేదా?
Luke 11:40 in Other Translations
King James Version (KJV)
Ye fools, did not he that made that which is without make that which is within also?
American Standard Version (ASV)
Ye foolish ones, did not he that made the outside make the inside also?
Bible in Basic English (BBE)
O you foolish ones! did not he who made the outside in the same way make the inside?
Darby English Bible (DBY)
Fools, has not he who has made the outside made the inside also?
World English Bible (WEB)
You foolish ones, didn't he who made the outside make the inside also?
Young's Literal Translation (YLT)
unthinking! did not He who made the outside also the inside make?
| Ye fools, | ἄφρονες | aphrones | AH-froh-nase |
| did not | οὐχ | ouch | ook |
| he | ὁ | ho | oh |
| that made | ποιήσας | poiēsas | poo-A-sahs |
| that | τὸ | to | toh |
| without is which | ἔξωθεν | exōthen | AYKS-oh-thane |
| make | καὶ | kai | kay |
| that | τὸ | to | toh |
| which is within | ἔσωθεν | esōthen | A-soh-thane |
| also? | ἐποίησεν | epoiēsen | ay-POO-ay-sane |
Cross Reference
లూకా సువార్త 12:20
అయితే దేవుడువెఱ్ఱివాడా, యీ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నారు; నీవు సిద్ధపరచినవి ఎవని వగునని ఆతనితో చెప్పెను.
1 కొరింథీయులకు 15:36
ఓ అవివేకీ, నీవు విత్తునది చచ్చితేనే గాని బ్రదికింపబడదు గదా.
హెబ్రీయులకు 12:9
మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై యుండిరి. వారి యందు భయభక్తులు కలిగి యుంటిమి; అట్లయితే ఆత్మలకు తండ్రియైన వానికి మరి యెక్కువగా లోబడి బ్రదుక వలెనుగదా?
లూకా సువార్త 24:25
అందు కాయన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలనన్నిటిని నమ్మని మందమతులారా,
మత్తయి సువార్త 23:26
గ్రుడ్డిపరిసయ్యుడా, గిన్నెయు పళ్లెమును వెలుపల శుద్ధియగునట్టుగా ముందు వాటిలోపల శుద్ధిచేయుము.
మత్తయి సువార్త 23:17
అవివేకులారా, అంధులారా, ఏది గొప్పది? బంగారమా, బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా?
జెకర్యా 12:1
దేవోక్తి ఇశ్రాయేలీయులనుగూర్చి వచ్చిన యెహోవా వాక్కు. ఆకాశమండలమును విశాలపరచి భూమికి పునాదివేసి మనుష్యుల అంతరంగములో జీవాత్మను సృజించు యెహోవా సెలవిచ్చునదేమనగా
యిర్మీయా 5:21
కన్నులుండియు చూడకయు చెవులుండియు వినకయు నున్న వివేకములేని మూఢులారా, ఈ మాట వినుడి.
సామెతలు 8:5
జ్ఞానములేనివారలారా, జ్ఞానము ఎట్టిదైనది తెలిసి కొనుడి బుద్ధిహీనులారా,బుద్ధియెట్టిదైనది యోచించి చూడుడి.
సామెతలు 1:22
ఎట్లనగా, జ్ఞానములేనివారలారా, మీరెన్నాళ్లు జ్ఞానములేనివారుగా ఉండగోరుదురు? అపహాసకులారా, మీరెన్నాళ్లు అపహాస్యము చేయుచు ఆనందింతురు? బుద్ధిహీనులారా, మీరెన్నాళ్లు జ్ఞానమును అసహ్యించు కొందురు?
కీర్తనల గ్రంథము 94:8
జనులలో పశుప్రాయులారా దీనిని ఆలోచించుడి బుద్ధిహీనులారా, మీరెప్పుడు బుద్ధిమంతులవుదురు?
కీర్తనల గ్రంథము 75:4
అహంకారులై యుండకుడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను.
కీర్తనల గ్రంథము 33:15
ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించిన వాడు వారి క్రియలన్నియు విచారించువాడు వారిని దర్శించు వాడు.
కీర్తనల గ్రంథము 14:1
దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయ ములో అనుకొందురు.వారు చెడిపోయినవారు అసహ్యకార్యములుచేయుదురు.మేలుచేయు వాడొకడును లేడు.
సంఖ్యాకాండము 16:22
వారు సాగిలపడిసమస్త శరీరాత్మలకు దేవుడ వైన దేవా, యీ యొక్కడు పాపముచేసినందున ఈ సమస్త సమాజము మీద నీవు కోపపడుదువా? అని వేడు కొనిరి.
ఆదికాండము 2:7
దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను.
ఆదికాండము 1:26
దేవుడు మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము; వారుసముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమిమీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను.