Hosea 8:8
ఇశ్రాయేలువారు తినివేయబడుదురు; ఎవరికిని ఇష్టముకాని ఘటమువంటివారై అన్యజనులలో నుందురు.
Hosea 8:8 in Other Translations
King James Version (KJV)
Israel is swallowed up: now shall they be among the Gentiles as a vessel wherein is no pleasure.
American Standard Version (ASV)
Israel is swallowed up: now are they among the nations as a vessel wherein none delighteth.
Bible in Basic English (BBE)
Israel has come to destruction; now they are among the nations like a cup in which there is no pleasure.
Darby English Bible (DBY)
Israel is swallowed up: now are they become among the nations as a vessel wherein is no pleasure.
World English Bible (WEB)
Israel is swallowed up. Now they are among the nations like a worthless thing.
Young's Literal Translation (YLT)
Israel hath been swallowed up, Now they have been among nations, As a vessel in which is no delight.
| Israel | נִבְלַ֖ע | niblaʿ | neev-LA |
| is swallowed up: | יִשְׂרָאֵ֑ל | yiśrāʾēl | yees-ra-ALE |
| now | עַתָּה֙ | ʿattāh | ah-TA |
| shall they be | הָי֣וּ | hāyû | ha-YOO |
| Gentiles the among | בַגּוֹיִ֔ם | baggôyim | va-ɡoh-YEEM |
| as a vessel | כִּכְלִ֖י | kiklî | keek-LEE |
| wherein is no | אֵֽין | ʾên | ane |
| pleasure. | חֵ֥פֶץ | ḥēpeṣ | HAY-fets |
| בּֽוֹ׃ | bô | boh |
Cross Reference
యిర్మీయా 22:28
కొన్యా అను ఇతడు హేయమైన ఓటికుండ వంటివాడా? పనికిమాలిన ఘటమా? అతడును అతని సంతానమును విసరివేయబడి, తామెరుగని దేశములోనికి ఏల త్రోయబడిరి?
యిర్మీయా 51:34
బబులోనురాజైన నెబుకద్రెజరు మమ్మును మింగివేసెను మమ్మును నుగ్గుచేసెను, మమ్మును వట్టికుండవలె ఉంచి యున్నాడు భుజంగము మింగునట్లు మమ్మును మింగెను మా శ్రేష్ఠపదార్థములతో తన పొట్ట నింపుకొని మమ్మును పారవేసియున్నాడు.
2 తిమోతికి 2:20
గొప్పయింటిలో వెండి పాత్రలును బంగారు పాత్రలును మాత్రమే గాక కఱ్ఱవియు మంటివియు కూడ ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింప బడును.
రోమీయులకు 9:22
ఆలాగు దేవుడు తన ఉగ్రతను అగపరచుటకును, తన ప్రభావమును చూపుటకును, ఇచ్చ éయించినవాడై, నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములను ఆయన బహు ధీర్ఘశాంతముతో సహించిన నేమి?
యెహెజ్కేలు 36:3
వచనమెత్తి ఈలాగు ప్రవచింపుముప్రభువగు యెహోవా సెల విచ్చునదేమ నగాశేషించిన అన్యజనులకు మీరు స్వాధీనులగునట్లు గాను, నిందించువారిచేత జనుల దృష్టికి మీరు అపహాస్యా స్పదమగునట్లుగాను, నలుదిక్కుల మీ శత్రువులు మిమ్మను పట్టుకొన నాశించి మిమ్మును పాడుచేసియున్నారు.
విలాపవాక్యములు 2:16
నీ శత్రువులందరు నిన్ను చూచి నోరు తెరచెదరు వారు ఎగతాళిచేసి పండ్లు కొరుకుచు దాని మింగివేసియున్నాము ఇదేగదా మనము కనిపెట్టినదినము అది తటస్థించెను, దాని మనము చూచియున్నాము అని యనుకొనెదరు.
విలాపవాక్యములు 2:5
ప్రభువు శత్రువాయెను ఆయన ఇశ్రాయేలును నిర్మూలము చేసియున్నాడు దాని నగరులన్నిటిని నాశనముచేసియున్నాడు దాని కోటలను పాడుచేసియున్నాడు యూదా కుమారికి అధిక దుఃఖప్రలాపములను ఆయన కలుగజేసియున్నాడు.
విలాపవాక్యములు 2:2
ఒకటియు విడువక ప్రభువు యాకోబు నివాస స్థలములన్నిటిని నాశనముచేసి యున్నాడు మహోగ్రుడై యూదా కుమార్తె కోటలను పడగొట్టి యున్నాడు వాటిని నేలకు కూల్చివేసియున్నాడు ఆ రాజ్యమును దాని యధిపతులను ఆయన అపవిత్ర పరచియున్నాడు.
యిర్మీయా 50:17
ఇశ్రాయేలువారు చెదిరిపోయిన గొఱ్ఱలు సింహములు వారిని తొలగగొట్టెను మొదట అష్షూరురాజు వారిని భక్షించెను కడపట బబులోను రాజైన యీ నెబుకద్రెజరు వారి యెముకలను నలుగగొట్టుచున్నాడు.
యిర్మీయా 48:38
మోయాబు ఇంటి పైకప్పులన్నిటిమీదను దాని వీధులలోను అంగలార్పు వినబడుచున్నది ఒకడు పనికిమాలిన ఘటమును పగులగొట్టునట్లు నేను మోయాబును పగులగొట్టుచున్నాను ఇదే యెహోవా వాక్కు.
యెషయా గ్రంథము 30:14
కుమ్మరి కుండ పగులగొట్టబడునట్లు ఆయన ఏమియు విడిచిపెట్టక దాని పగులగొట్టును పొయిలోనుండి నిప్పు తీయుటకు గాని గుంటలోనుండి నీళ్లు తీయుటకు గాని దానిలో ఒక్క పెంకైనను దొరకదు.
రాజులు రెండవ గ్రంథము 18:11
తమ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట విననివారై ఆయన నిబంధనకును ఆయన సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన దానంతటికిని లోబడక అతిక్రమించి యుండిరి.
రాజులు రెండవ గ్రంథము 17:1
యూదారాజైన ఆహాజు ఏలుబడిలో పండ్రెండవసంవత్సరమందు ఏలా కుమారుడైన హోషేయ షోమ్రోనులో ఇశ్రాయేలును ఏలనారంభించి తొమి్మది సంవత్సర ములు ఏలెను.
ద్వితీయోపదేశకాండమ 28:64
దేశముయొక్క యీ కొనమొదలు కొని ఆ కొనవరకును సమస్తజనములలోనికి యెహోవా నిన్ను చెదరగొట్టును. అక్కడ నీవైనను నీ పితరులైనను ఎరుగని కొయ్యవియు రాతివియునైన అన్యదేవతలను పూజింతువు.
ద్వితీయోపదేశకాండమ 28:25
యెహోవా నీ శత్రువుల యెదుట నిన్ను ఓడించును. ఒక్కమార్గ మున వారి యెదుటికి బయలుదేరి నీవు యేడు మార్గముల వారి యెదుటనుండి పారిపోయి, భూరాజ్యములన్నిటి లోనికి యిటు అటు చెదరగొట్ట బడుదువు.
లేవీయకాండము 26:33
జనములలోనికి మిమ్మును చెదరగొట్టి మీవెంట కత్తి దూసెదను, మీ దేశము పాడైపోవును, మీ పట్టములు పాడుపడును.