దానియేలు 5:8
రాజు నియమించిన జ్ఞానులందరు అతని సముఖము నకు వచ్చిరి గాని ఆ వ్రాత చదువుటయైనను దాని భావము తెలియజెప్పుట యైనను వారివల్ల కాకపోయెను.
Then | אֱדַ֙יִן֙ | ʾĕdayin | ay-DA-YEEN |
came in | עָֽלִּ֔לין | ʿāllilyn | ah-LEEL-y-n |
all | כֹּ֖ל | kōl | kole |
the king's | חַכִּימֵ֣י | ḥakkîmê | ha-kee-MAY |
wise | מַלְכָּ֑א | malkāʾ | mahl-KA |
men: but they could | וְלָֽא | wĕlāʾ | veh-LA |
not | כָהֲלִ֤ין | kāhălîn | ha-huh-LEEN |
read | כְּתָבָא֙ | kĕtābāʾ | keh-ta-VA |
the writing, | לְמִקְרֵ֔א | lĕmiqrēʾ | leh-meek-RAY |
nor make known | וּפִשְׁרֵ֖אּ | ûpišrēʾ | oo-feesh-RAY |
king the to | לְהוֹדָעָ֥ה | lĕhôdāʿâ | leh-hoh-da-AH |
the interpretation | לְמַלְכָּֽא׃ | lĕmalkāʾ | leh-mahl-KA |
Cross Reference
దానియేలు 2:27
దానియేలు రాజుసముఖములో ఈలాగు ప్రత్యుత్తర మిచ్చెనురాజడిగిన యీ మర్మము జ్ఞానులైనను గారడీవిద్య గలవారైనను శకున గాండ్రయినను, జ్యోతిష్కులైనను తెలియజెప్పజాలరు.
ఆదికాండము 41:8
తెల్లవారినప్పుడు అతని మనస్సు కలవరపడెను గనుక అతడు ఐగుప్తు శకున గాండ్ర నందరిని అక్కడి విద్వాంసులనందరిని పిలువనంపి ఫరో తన కలలను వివరించి వారితో చెప్పెను గాని ఫరోకు వాటి భావము తెలుపగల వాడెవడును లేక పోయెను.
దానియేలు 4:7
శకున గాండ్రును గారడీవిద్యగలవారును కల్దీయులును జ్యోతి ష్యులును నా సన్నిధికి రాగా నేను కనిన కలను వారితో చెప్పితిని గాని వారు దాని భావమును నాకు తెలుపలేక పోయిరి.
యెషయా గ్రంథము 47:9
ఒక్క దినములోగా ఒక్క నిమిషముననే పుత్ర శోకమును వైధవ్యమును ఈ రెండును నీకు సంభ వించును. నీవు అధికముగా శకునము చూచినను అత్యధికమైన కర్ణపిశాచ తంత్రములను నీవు ఆధార ముగా చేసికొనినను ఆ యపాయములు నీమీదికి సంపూర్తిగా వచ్చును.
యెషయా గ్రంథము 47:12
నీ బాల్యమునుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణపిశాచ తంత్రములను నీ విస్తారమైన శకునములను చూపుటకు నిలువుము ఒకవేళ అవి నీకు ప్రయోజనములగునేమో ఒకవేళ నీవు మనుష్యులను బెదరింతువేమో
దానియేలు 5:15
ఈ వ్రాత చదివి దాని భావము తెలియజెప్పవలెనని జ్ఞానులను గారడీవిద్యగల వారిని పిలి పించితిని గాని వారు ఈ సంగతియొక్క భావమును తెలుపలేక పోయిరి.