Index
Full Screen ?
 

అపొస్తలుల కార్యములు 26:24

Acts 26:24 తెలుగు బైబిల్ అపొస్తలుల కార్యములు అపొస్తలుల కార్యములు 26

అపొస్తలుల కార్యములు 26:24
అతడు ఈలాగు సమాధానము చెప్పుకొనుచుండగా ఫేస్తుపౌలా, నీవు వెఱ్ఱివాడవు, అతి విద్యవలన నీకు వెఱ్ఱిపట్టినదని గొప్ప శబ్దముతో చెప్పెను.

And
ΤαῦταtautaTAF-ta
as
he
δὲdethay
thus
αὐτοῦautouaf-TOO
spake
for
himself,
ἀπολογουμένουapologoumenouah-poh-loh-goo-MAY-noo

hooh
Festus
ΦῆστοςphēstosFAY-stose
said
μεγάλῃmegalēmay-GA-lay
with
a
loud
τῇtay

φωνῇphōnēfoh-NAY
voice,
ἔφηephēA-fay
Paul,
ΜαίνῃmainēMAY-nay
thou
art
beside
thyself;
Παῦλε·paulePA-lay

τὰtata
much
πολλάpollapole-LA
learning
σεsesay
doth
make
γράμματαgrammataGRAHM-ma-ta
thee
εἰςeisees

μανίανmanianma-NEE-an
mad.
περιτρέπειperitrepeipay-ree-TRAY-pee

Cross Reference

1 కొరింథీయులకు 4:10
మేముక్రీస్తు నిమిత్తము వెఱ్ఱివారము, మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు; మేము బలహీనులము, మీరు బలవంతులు; మీరు ఘనులు, మేము ఘనహీనులము.

మార్కు సువార్త 3:21
ఆయన ఇంటివారు సంగతి విని, ఆయన మతి చలించియున్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి.

2 కొరింథీయులకు 5:13
ఏలయనగా మేము వెఱ్రివారమైతిమా దేవుని నిమిత్తమే; స్వస్థబుద్ధిగలవారమైతిమా మీ నిమిత్తమే.

1 కొరింథీయులకు 1:23
అయితే మేము సిలువవేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము.

అపొస్తలుల కార్యములు 17:32
మృతుల పునరుత్థానమునుగూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యముచేసిరి; మరికొందరుదీనిగూర్చి నీవు చెప్పునది ఇంకొకసారి విందుమని చెప్పిరి.

యిర్మీయా 29:26
​వెఱ్ఱి వారై తమ్మును తాము ప్రవక్తలనుగా ఏర్పరచుకొనువారిని నీవు సంకెళ్లచేత బంధించి బొండలో వేయించినట్లుగా, యాజకుడైన యెహోయాదాకు ప్రతిగా యెహోవా మందిర విషయములలో పై విచారణకర్తయగు యాజకునిగా యెహోవా నిన్ను నియమించెనని యెరూషలేములో నున్న ప్రజలకందరికిని యాజకుడగు మయశేయా కుమారుడగు జెఫన్యాకును యాజకులకందరికిని నీవు నీ పేరటనే పత్రిక లను పంపితివే.

రాజులు రెండవ గ్రంథము 9:11
​యెహూ బయలుదేరి తన యజమానుని సేవకులయొద్దకు రాగా ఒకడుఏమి సంభ వించినది? ఆ వెఱ్ఱివాడు నీయొద్దకు వచ్చిన హేతువేమని అతని నడుగగా, అతడువానిని వాని మాటలు మీరెరిగెయున్నారని చెప్పెను.

1 కొరింథీయులకు 2:13
మనుష్యజ్ఞానము నేర్పుమాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు, ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము.

అపొస్తలుల కార్యములు 26:11
అనేకపర్యాయములు సమాజమందిరములన్నిటిలో వారిని దండించి వారు దేవదూషణచేయునట్లు బలవంతపెట్ట చూచితిని. మరియు వారిమీద మిక్కిలి క్రోధము గలవాడనై యితర పట్టణములక

అపొస్తలుల కార్యములు 25:19
అయితే తమ మతమును గూర్చియు, చనిపోయిన యేసు అను ఒకనిగూర్చియు ఇతనితో వారికి కొన్ని వివాదములున్నట్టు కనబడెను;

అపొస్తలుల కార్యములు 24:25
అప్పుడతడు నీతిని గూర్చియు ఆశానిగ్రహమును గూర్చియు రాబోవు విమర్శనుగూర్చియు ప్రసంగించు చుండగా ఫేలిక్సు మిగుల భయపడిఇప్పటికి వెళ్లుము, నాకు సమయమైన నిన్ను పిలువన

అపొస్తలుల కార్యములు 22:1
సహోదరులారా, తండ్రులారా, నేనిప్పుడు మీ యెదుట చెప్పు సమాధానము నాలకించుడి.

యోహాను సువార్త 10:20
వారిలో అనేకులువాడు దయ్యము పట్టిన వాడు, వెఱ్ఱివాడు; వాని మాట ఎందుకు వినుచున్నారనిరి.

యోహాను సువార్త 8:52
అందుకు యూదులునీవు దయ్యము పట్టినవాడవని యిప్పుడెరుగు దుము; అబ్రాహామును ప్రవక్తలును చనిపోయిరి; అయినను ఒకడు నా మాట గైకొనినయెడల వాడు ఎన్నడును మరణము రుచిచూడ

యోహాను సువార్త 8:48
అందుకు యూదులు నీవు సమరయు డవును దయ్యముపట్టినవాడవును అని మేము చెప్పుమాట సరియేగదా అని ఆయనతో చెప్పగా

యోహాను సువార్త 7:15
యూదులు అందుకు ఆశ్చర్య పడిచదువుకొనని ఇతనికి ఈ పాండిత్యమెట్లు వచ్చెనని చెప్పుకొనిరి.

హొషేయ 9:7
శిక్షా దినములు వచ్చేయున్నవి; ప్రతికార దినములు వచ్చేయున్నవి; తాము చేసిన విస్తార మైన దోషమును తాము చూపిన విశేషమైన పగను ఎరిగిన వారై తమ ప్రవక్తలు అవివేకులనియు, దురాత్మ ననుసరించిన వారు వెఱ్ఱివారనియు ఇశ్రాయేలువారు తెలిసికొందురు.

Chords Index for Keyboard Guitar