Jeremiah 13:9
యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఈ విధముగానే యూదావారి గర్వమును యెరూష లేము నివాసుల మహా గర్వమును నేను భంగపరచుదును.
Jeremiah 13:9 in Other Translations
King James Version (KJV)
Thus saith the LORD, After this manner will I mar the pride of Judah, and the great pride of Jerusalem.
American Standard Version (ASV)
Thus saith Jehovah, After this manner will I mar the pride of Judah, and the great pride of Jerusalem.
Bible in Basic English (BBE)
The Lord has said, In this way I will do damage to the pride of Judah and to the great pride of Jerusalem.
Darby English Bible (DBY)
Thus saith Jehovah: After this manner will I spoil the pride of Judah, and the great pride of Jerusalem.
World English Bible (WEB)
Thus says Yahweh, After this manner will I mar the pride of Judah, and the great pride of Jerusalem.
Young's Literal Translation (YLT)
Thus do I mar the excellency of Judah, And the great excellency of Jerusalem.
| Thus | כֹּ֖ה | kō | koh |
| saith | אָמַ֣ר | ʾāmar | ah-MAHR |
| the Lord, | יְהוָ֑ה | yĕhwâ | yeh-VA |
| manner this After | כָּ֠כָה | kākâ | KA-ha |
| will I mar | אַשְׁחִ֞ית | ʾašḥît | ash-HEET |
| pride the | אֶת | ʾet | et |
| of Judah, | גְּא֧וֹן | gĕʾôn | ɡeh-ONE |
| and the great | יְהוּדָ֛ה | yĕhûdâ | yeh-hoo-DA |
| pride | וְאֶת | wĕʾet | veh-ET |
| of Jerusalem. | גְּא֥וֹן | gĕʾôn | ɡeh-ONE |
| יְרוּשָׁלִַ֖ם | yĕrûšālaim | yeh-roo-sha-la-EEM | |
| הָרָֽב׃ | hārāb | ha-RAHV |
Cross Reference
లేవీయకాండము 26:19
మీ బల గర్వమును భంగపరచి, ఆకాశము ఇనుమువలెను భూమి ఇత్తడివలెను ఉండచేసెదను.
జెఫన్యా 3:11
ఆ దినమున నీ గర్వమునుబట్టి సంతో షించువారిని నీలోనుండి నేను వెళ్లగొట్టుదును గనుక నా పరిశుద్ధమైన కొండయందు నీవిక గర్వము చూపవు, నామీద తిరుగబడి నీవుచేసిన క్రియలవిషయమై నీకు సిగ్గు కలుగదు
యిర్మీయా 13:15
చెవి యొగ్గి వినుడి; యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, గర్వపడకుడి.
యెషయా గ్రంథము 23:9
సర్వసౌందర్య గర్వాతిశయమును అపవిత్రపరచుట కును భూమిమీదనున్న సర్వఘనులను అవమానపరచుటకును సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు చేయ నుద్దేశించెను.
యెషయా గ్రంథము 2:10
యెహోవా భీకరసన్నిధినుండియు ఆయన ప్రభావ మహాత్మ్యమునుండియు బండ బీటలోనికి దూరుము మంటిలో దాగి యుండుము.
1 పేతురు 5:5
చిన్నలారా, మీరు పెద్దలకు లోబడియుండుడి; మీరందరు ఎదుటివాని యెడల దీనమనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి; దేవుడు అహంకారు లను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును.
యాకోబు 4:6
కాదుగాని, ఆయన ఎక్కువ కృప నిచ్చును; అందుచేతదేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్ర హించును అని లేఖనము చెప్పుచున్నది.
లూకా సువార్త 18:14
అతనికంటె ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన యింటికి వెళ్లెనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడుననియు తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడ
నహూము 2:2
దోచు కొనువారు వారిని దోపుడుసొమ్ముగా పట్టుకొనినను, వారి ద్రాక్షావల్లులను నరికివేసినను, అతిశయాస్పదముగా ఇశ్రా యేలీయులకువలె యెహోవా యాకోబు సంతతికి మరల అతిశయాస్పదముగా అనుగ్రహించును.
యెహెజ్కేలు 16:56
నీ చుట్టు ఉండి నిన్ను తృణీకరించిన ఫిలిష్తీయుల కుమార్తె లును సిరియా కుమార్తెలును నిన్ను అవమానపరచగా
యెహెజ్కేలు 16:50
వారు అహంకరించి నా దృష్టికి హేయక్రియలు చేసిరి గనుక నేను దాని చూచి వారిని వెళ్లగొట్టితిని.
విలాపవాక్యములు 5:5
మమ్మును తురుమువారు మా మెడలమీదికి ఎక్కి యున్నారు మేము అలసట చెందియున్నాము, విశ్రాంతి యనునది మాకు లేదు.
యిర్మీయా 48:29
మోయోబీయుల గర్వమునుగూర్చి వింటిమి, వారు బహు గర్వపోతులు వారి అతిశయమునుగూర్చియు గర్వమునుగూర్చియు
యిర్మీయా 18:4
కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరల తీసికొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరియొక కుండ చేసెను.
యెషయా గ్రంథము 16:6
మోయాబీయులు బహు గర్వముగలవారని మేము విని యున్నాము వారి గర్వమును గూర్చియు వారి అహంకార గర్వక్రోధములను గూర్చియు విని యున్నాము. వారు వదరుట వ్యర్థము.
సామెతలు 16:18
నాశనమునకు ముందు గర్వము నడచును. పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడచును
యోబు గ్రంథము 40:10
ఆడంబర మహాత్మ్యములతో నిన్ను నీవు అలంకరించు కొనుము గౌరవప్రభావములను ధరించుకొనుము.