Zechariah 1:20
యెహోవా నలుగురు కంసాలులను నాకు కనుపరచగా
Zechariah 1:20 in Other Translations
King James Version (KJV)
And the LORD shewed me four carpenters.
American Standard Version (ASV)
And Jehovah showed me four smiths.
Darby English Bible (DBY)
And Jehovah shewed me four craftsmen.
World English Bible (WEB)
Yahweh showed me four craftsmen.
Young's Literal Translation (YLT)
And Jehovah doth shew me four artizans.
| And the Lord | וַיַּרְאֵ֣נִי | wayyarʾēnî | va-yahr-A-nee |
| shewed | יְהוָ֔ה | yĕhwâ | yeh-VA |
| me four | אַרְבָּעָ֖ה | ʾarbāʿâ | ar-ba-AH |
| carpenters. | חָרָשִֽׁים׃ | ḥārāšîm | ha-ra-SHEEM |
Cross Reference
ద్వితీయోపదేశకాండమ 33:25
నీ కమ్ములు ఇనుపవియు ఇత్తడివియునై యుండును.నీవు బ్రదుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును.
జెకర్యా 10:3
నా కోపాగ్ని మండుచు కాపరులమీద పడును, మేకలను నేను శిక్షించెదను, సైన్యములకు అధిపతియగు యెహోవా తన మందయగు యూదావారిని దర్శించి వారిని తనకు రాజకీయములగు అశ్వములవంటివారినిగా చేయును.
జెకర్యా 9:12
బంధకములలో పడియుండియు నిరీక్షణగలవారలారా, మీ కోటను మరల ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసెదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను.
మీకా 5:8
యాకోబు సంతతిలో శేషించినవారు అన్యజనులమధ్యను అనేక జనములలోను అడవిమృగములలో సింహమువలెను, ఎవడును విడిపింపకుండ లోపలికి చొచ్చి గొఱ్ఱలమందలను త్రొక్కి చీల్చు కొదమసింహమువలెను ఉందురు.
మీకా 5:5
ఆయన సమాధానమునకు కారకుడగును, అష్షూరు మన దేశములో చొరబడి మన నగరులలో ప్రవేశింపగా వాని నెదిరించు టకు మేము ఏడుగురు గొఱ్ఱలకాపరులను ఎనమండుగురు ప్రధానులను నియమింతుము.
ఓబద్యా 1:21
మరియు ఏశావుయొక్క కొండకు తీర్పుతీర్చుటకై సీయోను కొండమీద రక్షకులు పుట్టుదురు; అప్పుడు రాజ్యము యెహోవాది యగును.
యెషయా గ్రంథము 54:15
జనులు గుంపుకూడినను వారు నావలన కూడరు నీకు విరోధముగా గుంపుకూడువారు నీ పక్షపు వారగు దురు.
నెహెమ్యా 9:27
అందుచేత నీవు వారిని వారి శత్రువులచేతికి అప్పగించితివి. ఆ శత్రువులు వారిని బాధింపగా శ్రమకాలమందు వారు నీకు మొఱ్ఱపెట్టినప్పుడు ఆకాశమందుండు నీవు ఆలకించి, వారి శత్రువుల చేతిలోనుండి వారిని తప్పించుటకై నీ కృపాసంపత్తిని బట్టి వారికి రక్షకులను దయచేసితివి.
సమూయేలు మొదటి గ్రంథము 12:11
యెహోవా యెరు బ్బయలును బెదానును యెఫ్తాను సమూయేలును పంపి, నలుదిశల మీ శత్రువుల చేతిలోనుండి మిమ్మును విడిపించి నందున మీరు నిర్భయముగా కాపురము చేయుచున్నారు.
న్యాయాధిపతులు 11:18
తరువాత వారు అరణ్యప్రయాణముచేయుచు ఎదోమీయులయొక్కయు మోయాబీయులయొక్కయు దేశముల చుట్టు తిరిగి, మోయాబునకు తూర్పు దిక్కున కనాను దేశమందు ప్రవేశించి అర్నోను అద్దరిని దిగిరి. వారు మోయాబు సరి హద్దు లోపలికి పోలేదు. అర్నోను మోయాబునకు సరి హద్దు గదా.
న్యాయాధిపతులు 11:16
ఇశ్రాయేలీయులు ఐగుప్తులోనుండి వచ్చుచుండగా వారు ఎఱ్ఱసముద్రము వరకు అరణ్యములో నడిచి కాదేషునకు వచ్చిరి.
జెకర్యా 12:2
నేను యెరూషలేము చుట్టునున్న జనులకందరికి మత్తు పుట్టించు పాత్రగా చేయబోవుచున్నాను; శత్రు వులు యెరూషలేమునకు ముట్టడివేయగా అది యూదా మీదికిని వచ్చును.