Romans 14:2
ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ము చున్నాడు, మరియొకడు బలహీనుడై యుండి, కూర గాయలనే తినుచున్నాడు.
Romans 14:2 in Other Translations
King James Version (KJV)
For one believeth that he may eat all things: another, who is weak, eateth herbs.
American Standard Version (ASV)
One man hath faith to eat all things: but he that is weak eateth herbs.
Bible in Basic English (BBE)
One man has faith to take all things as food: another who is feeble in faith takes only green food.
Darby English Bible (DBY)
One man is assured that he may eat all things; but the weak eats herbs.
World English Bible (WEB)
One man has faith to eat all things, but he who is weak eats only vegetables.
Young's Literal Translation (YLT)
one doth believe that he may eat all things -- and he who is weak doth eat herbs;
| For one | ὃς | hos | ose |
| μὲν | men | mane | |
| believeth | πιστεύει | pisteuei | pee-STAVE-ee |
| that he may eat | φαγεῖν | phagein | fa-GEEN |
| things: all | πάντα | panta | PAHN-ta |
another, | ὁ | ho | oh |
| δὲ | de | thay | |
| who is weak, | ἀσθενῶν | asthenōn | ah-sthay-NONE |
| eateth | λάχανα | lachana | LA-ha-na |
| herbs. | ἐσθίει | esthiei | ay-STHEE-ee |
Cross Reference
రోమీయులకు 14:14
సహజముగా ఏదియు నిషిద్ధము కాదని నేను ప్రభువైన యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను. అయితే ఏదైనను నిషిద్ధమని యెంచుకొనువానికి అది నిషిద్ధమే.
1 తిమోతికి 4:4
దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొనినయెడల ఏదియు నిషేధింపతగినది కాదు;
ఆదికాండము 9:3
ప్రాణముగల సమస్త చరములు మీకు ఆహారమగును; పచ్చని కూర మొక్కల నిచ్చినట్లు వాటిని మీకిచ్చియున్నాను.
హెబ్రీయులకు 13:9
నానా విధములైన అన్య బోధలచేత త్రిప్పబడకుడి. భోజనపదార్థములనుబట్టి కాక, కృపను బట్టియే హృదయము స్థిరపరచుకొనుట మంచిది; భోజనము లనుబట్టి ప్రవర్తించినవారికి ఏమియు ప్రయోజనము కలుగ లేదు.
హెబ్రీయులకు 9:10
ఇవి దిద్దు బాటు జరుగుకాలము వచ్చువరకు విధింపబడి, అన్నపాన ములతోను నానావిధములైన ప్రక్షాళనములతోను సంబం ధించిన శరీరాచారములు మాత్రమైయున్నవి.
తీతుకు 1:15
పవిత్రులకు అన్నియు పవిత్రములే గాని అపవిత్రులకును అవిశ్వా సులకును ఏదియు పవిత్రమైనది కాదు; వారి మనస్సును వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి యున్నవి.
గలతీయులకు 2:12
ఏలయనగా యాకోబు నొద్దనుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనము చేయుచుండెను గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుకతీసి వేరై పోయెను.
1 కొరింథీయులకు 10:25
మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక కటికవాని అంగడిలో అమ్మునదేదో దానిని తినవచ్చును.
రోమీయులకు 14:22
నీకున్న విశ్వా సము దేవుని యెదుట నీమట్టుకు నీవే యుంచుకొనుము; తాను సమ్మతించిన విషయములో తనకుతానే తీర్పు తీర్చు కొననివాడు ధన్యుడు.
దానియేలు 1:16
రాజు వారికి నియమించిన భోజనమును పానముకొరకైన ద్రాక్షా రసమును ఆ నియామకుడు తీసివేసి, వారికి శాకధాన్యా దుల నిచ్చెను.
దానియేలు 1:12
భోజనమునకు శాకధాన్యా దులను పానమునకు నీళ్లును నీ దాసులమగు మాకిప్పించి, దయచేసి పది దినములవరకు మమ్మును పరీక్షింపుము.
సామెతలు 15:17
పగవాని యింట క్రొవ్వినయెద్దు మాంసము తినుట కంటె ప్రేమగలచోట ఆకుకూరల భోజనము తినుట మేలు.
ఆదికాండము 1:29
దేవుడు ఇదిగో భూమిమీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్షఫలముగల ప్రతి వృక్ష మును మీ కిచ్చి యున్నాను; అవి మీ కాహారమగును.