Psalm 92:3
పది తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వనిగల సితారాతోను ప్రచురించుట మంచిది.
Psalm 92:3 in Other Translations
King James Version (KJV)
Upon an instrument of ten strings, and upon the psaltery; upon the harp with a solemn sound.
American Standard Version (ASV)
With an instrument of ten strings, and with the psaltery; With a solemn sound upon the harp.
Bible in Basic English (BBE)
On a ten-corded instrument, and on an instrument of music with a quiet sound.
Darby English Bible (DBY)
Upon an instrument of ten strings and upon the lute; upon the Higgaion with the harp.
Webster's Bible (WBT)
To show forth thy loving-kindness in the morning, and thy faithfulness every night.
World English Bible (WEB)
With the ten-stringed lute, with the harp, And with the melody of the lyre.
Young's Literal Translation (YLT)
On ten strings and on psaltery, On higgaion, with harp.
| Upon | עֲֽלֵי | ʿălê | UH-lay |
| an instrument of ten strings, | עָ֭שׂוֹר | ʿāśôr | AH-sore |
| and upon | וַעֲלֵי | waʿălê | va-uh-LAY |
| psaltery; the | נָ֑בֶל | nābel | NA-vel |
| upon the harp | עֲלֵ֖י | ʿălê | uh-LAY |
| with | הִגָּי֣וֹן | higgāyôn | hee-ɡa-YONE |
| a solemn sound. | בְּכִנּֽוֹר׃ | bĕkinnôr | beh-hee-nore |
Cross Reference
కీర్తనల గ్రంథము 33:2
సితారాతో యెహోవాను స్తుతించుడి పది తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి
నెహెమ్యా 12:27
యెరూషలేము ప్రాకారమును ప్రతిష్ఠించు కాల ములో వారు ఆ ప్రతిష్ఠాచారమును స్తోత్రగీతములతోను పాటలతోను స్వరమండల సితారా చేయి తాళములతోను సంతోషముగా జరిగించునట్లు లేవీయులను తమ సకల స్థలములలోనుండి యెరూషలేమునకు రప్పించుటకు పూను కొనిరి
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 13:8
దావీదును ఇశ్రాయేలీయులందరును తమ పూర్ణ శక్తితో దేవుని సన్నిధిని పాటలు పాడుచు, సితారాలను స్వరమండలములను తంబురలను తాళములను వాయించుచు బూరలు ఊదుచుండిరి.
సమూయేలు మొదటి గ్రంథము 10:5
ఈలాగున పోవుచు ఫిలిష్తీయుల దండు కాపువారుండు దేవుని కొండకు చేరుదువు, అచ్చట ఊరిదగ్గరకు నీవు రాగానే, స్వరమండలము తంబుర సన్నాయి సితారా వాయించువారి వెనుక ఉన్నతమైన స్థలమునుండి దిగివచ్చు ప్రవక్తల సమూహము నీకు కనబడును, వారు ప్రకటనచేయుచు వత్తురు;
కీర్తనల గ్రంథము 150:3
బూరధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండలముతోను సితారాతోను ఆయనను స్తుతించుడి.
కీర్తనల గ్రంథము 149:3
నాట్యముతో వారు ఆయన నామమును స్తుతించు దురు గాక తంబురతోను సితారాతోను ఆయననుగూర్చి గానము చేయుదురు గాక.
కీర్తనల గ్రంథము 81:2
కీర్తన యెత్తుడి గిలకతప్పెట పట్టుకొనుడి స్వరమండలమును మనోహరమైన సితారాను వాయిం చుడి.
కీర్తనల గ్రంథము 68:25
కీర్తనలు పాడువారు ముందర నడచిరి. తంతివాద్యములు వాయించువారు వెనుక వచ్చెదరు.
కీర్తనల గ్రంథము 57:8
నా ప్రాణమా, మేలుకొనుము స్వరమండలమా సితారా, మేలుకొనుడి నేను వేకువనే లేచెదను.
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 29:25
మరియు దావీదును దావీదు రాజుకు దీర్ఘదర్శియైన గాదును ప్రవక్తయైన నాతా నును చేసిన నిర్ణయముచొప్పున యెహోవా మందిరములో తాళములను స్వరమండలములను సితారాలను వాయించుటకై అతడు లేవీయులను ఏర్పాటుచేసెను. ఆలాగు జరుగవలెనని యెహోవా తన ప్రవక్తలద్వారా ఆజ్ఞాపించి యుండెను.
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 23:5
ఒక భాగము రాజనగరునొద్ద ఉండవలెను. ఒక భాగము పునాది గుమ్మము నొద్ద ఉండవలెను, జనులందరు యెహోవా మందిరపు ఆవరణములలో ఉండవలెను.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 25:6
వీరందరు ఆసాపునకును యెదూ తూనునకును హేమానునకును రాజు చేసియున్న కట్టడ ప్రకారము యెహోవా యింటిలో తాళములు స్వర మండలములు సితారాలు వాయించుచు గానము చేయుచు, తమ తండ్రి చేతిక్రింద దేవుని మందిరపు సేవ జరిగించు చుండిరి.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 15:16
అంతట దావీదుమీరు మీ బంధువులగు పాటకులను పిలిచి, స్వరమండలములు సితారాలు తాళములు లోనగు వాద్యవిశేషములతో గంభీర ధ్వని చేయుచు, సంతోషముతో స్వరములెత్తి పాడునట్లు ఏర్పాటుచేయుడని లేవీయుల అధిపతులకు ఆజ్ఞ ఇచ్చెను.
కీర్తనల గ్రంథము 9:16
యెహోవా ప్రత్యక్షమాయెను, ఆయన తీర్పు తీర్చియున్నాడు.దుష్టులు తాముచేసికొనినదానిలో చిక్కియున్నారు(హిగ్గాయోన్ సెలా.)