Psalm 89:29
శాశ్వతకాలమువరకు అతని సంతానమును ఆకాశమున్నంతవరకు అతని సింహాసనమును నేను నిలిపెదను.
Psalm 89:29 in Other Translations
King James Version (KJV)
His seed also will I make to endure for ever, and his throne as the days of heaven.
American Standard Version (ASV)
His seed also will I make to endure for ever, And his throne as the days of heaven.
Bible in Basic English (BBE)
His seed will keep their place for ever; his kingdom will be eternal, like the heavens.
Darby English Bible (DBY)
And I will establish his seed for ever, and his throne as the days of heaven.
Webster's Bible (WBT)
My mercy will I keep for him for evermore, and my covenant shall stand fast with him.
World English Bible (WEB)
I will also make his seed endure forever, And his throne as the days of heaven.
Young's Literal Translation (YLT)
And I have set his seed for ever, And his throne as the days of the heavens.
| His seed | וְשַׂמְתִּ֣י | wĕśamtî | veh-sahm-TEE |
| also will I make | לָעַ֣ד | lāʿad | la-AD |
| ever, for endure to | זַרְע֑וֹ | zarʿô | zahr-OH |
| and his throne | וְ֝כִסְא֗וֹ | wĕkisʾô | VEH-hees-OH |
| days the as | כִּימֵ֥י | kîmê | kee-MAY |
| of heaven. | שָׁמָֽיִם׃ | šāmāyim | sha-MA-yeem |
Cross Reference
కీర్తనల గ్రంథము 89:4
తరతరములకు నీ సింహాసనమును స్థాపించెదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణము చేసి యున్నాను. (సెలా.)
కీర్తనల గ్రంథము 89:36
చంద్రుడున్నంతకాలము అది నిలుచుననియు మింటనుండు సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిర పరచబడుననియు
ద్వితీయోపదేశకాండమ 11:21
ఆలాగు చేసిన యెడల యెహోవా మీ పితరులకిచ్చెదనని ప్రమాణము చేసిన దేశమున మీ దినములును మీ సంతతివారి దినము లును భూమికి పైగా ఆకాశము నిలుచునంతకాలము విస్తరించును.
యెషయా గ్రంథము 9:7
ఇది మొదలుకొని మితిలేకుండ దానికి వృద్ధియు క్షేమ మును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయమువలనను నీతివలనను రాజ్యమును స్థిరపరచు టకు అతడు సింహాసనాసీనుడై రాజ్యపరిపాలన చేయును. సైన్యములకధిపతియగు యెహోవా ఆసక్తికలిగి దీనిని నెరవేర్చును.
లూకా సువార్త 1:32
ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమా రుడనబడును; ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయన కిచ్చును.
దానియేలు 2:44
ఆ రాజుల కాల ములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపిం చును. దానికెన్నటికిని నాశనము కలుగదు, ఆ రాజ్యము దాని పొందినవారికి గాక మరెవరికిని చెందదు; అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగములవరకు నిలుచును.
యెహెజ్కేలు 37:24
నా సేవకుడైన దావీదు వారికి రాజవును, వారికందరికి కాపరి యొక్కడే యుండును, వారు నా విధులను అనుసరింతురు, నా కట్ట డలను గైకొని ఆచరింతురు.
యిర్మీయా 33:17
యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుఇశ్రాయేలువారి సింహా సనముమీద కూర్చుండువాడొకడు దావీదునకుండక మానడు.
యెషయా గ్రంథము 59:21
నేను వారితో చేయు నిబంధన యిది నీ మీదనున్న నా ఆత్మయు నేను నీ నోటనుంచిన మాటలును నీ నోటనుండియు నీ పిల్లల నోటనుండియు నీ పిల్లల పిల్లల నోటనుండియు ఈ కాలము మొదలుకొని యెల్లప్పుడును తొలగిపోవు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
కీర్తనల గ్రంథము 132:11
నీ గర్భఫలమును నీ రాజ్యముమీద నేను నియ మింతును. నీ కుమారులు నా నిబంధనను గైకొనినయెడల నేను వారికి బోధించు నా శాసనమును వారు అనుస రించినయెడల వారి కుమారులుకూడ నీ సింహాసనముమీద నిత్యము కూర్చుందురని
కీర్తనల గ్రంథము 45:6
దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును నీ రాజదండము న్యాయార్థమైన దండము.
కీర్తనల గ్రంథము 21:4
ఆయుస్సు నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దానిని అతని కనుగ్రహించి యున్నావుసదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసియున్నావు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 22:10
అతడు నా నామమునకు ఒక మందిరమును కట్టించును, అతడు నాకు కుమారుడై యుండును, నేనతనికి తండ్రినై యుందును, ఇశ్రాయేలీయులమీద అతని రాజ్య సింహాసనమును నిత్యము స్థిరపరచుదును.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 17:11
నీ జీవిత దినములు తీరి నీ పితరులయొద్దకు నీవు చేరునప్పుడు నీ కుమారులవలన కలుగు నీ సంతతిని నేను స్థాపనచేసి అతని రాజ్యమును స్థిరపరచెదను.