Psalm 18:37
నా శత్రువులను తరిమి పట్టుకొందును వారిని నశింపజేయువరకు నేను తిరుగను.
Psalm 18:37 in Other Translations
King James Version (KJV)
I have pursued mine enemies, and overtaken them: neither did I turn again till they were consumed.
American Standard Version (ASV)
I will pursue mine enemies, and overtake them; Neither will I turn again till they are consumed.
Bible in Basic English (BBE)
I go after my haters and overtake them; not turning back till they are all overcome.
Darby English Bible (DBY)
I pursued mine enemies, and overtook them; and I turned not again till they were consumed.
Webster's Bible (WBT)
Thou hast enlarged my steps under me, that my feet did not slip.
World English Bible (WEB)
I will pursue my enemies, and overtake them. Neither will I turn again until they are consumed.
Young's Literal Translation (YLT)
I pursue mine enemies, and overtake them, And turn back not till they are consumed.
| I have pursued | אֶרְדּ֣וֹף | ʾerdôp | er-DOFE |
| mine enemies, | א֭וֹיְבַי | ʾôybay | OY-vai |
| and overtaken | וְאַשִּׂיגֵ֑ם | wĕʾaśśîgēm | veh-ah-see-ɡAME |
| neither them: | וְלֹֽא | wĕlōʾ | veh-LOH |
| did I turn again | אָ֝שׁוּב | ʾāšûb | AH-shoov |
| till | עַד | ʿad | ad |
| they were consumed. | כַּלּוֹתָֽם׃ | kallôtām | ka-loh-TAHM |
Cross Reference
సంఖ్యాకాండము 24:17
ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతమున నున్నట్టు కాదు ఆయనను చూచుచున్నాను గాని సమీపమున నున్నట్టు కాదు నక్షత్రము యాకోబులో ఉదయించును రాజదండము ఇశ్రాయేలులోనుండి లేచును అది మోయాబు ప్రాంతములను కొట్టును కలహవీరులనందరిని నాశనము చేయును.
ప్రకటన గ్రంథము 6:2
మరియు నేను చూడగా, ఇదిగో ఒక తెల్లనిగుఱ్ఱము కనబడెను; దానిమీద ఒకడు విల్లుపట్టుకొని కూర్చుండి యుండెను. అతనికి ఒక కిరీట మియ్యబడెను; అతడు జయించుచు, జయించుటకు బయలు వెళ్లెను.
యెషయా గ్రంథము 63:1
రక్తవర్ణ వస్త్రములు ధరించి ఎదోమునుండి వచ్చు చున్న యితడెవడు? శోభితవస్త్రము ధరించినవాడై గంభీరముగా నడచుచు బొస్రానుండి బలాతిశయముతో వచ్చుచున్న యిత డెవడు? నీతినిబట్టి మాటలాడుచున్న నేనే రక్షించుటకు బలాఢ్యుడనైన నేనే.
యెషయా గ్రంథము 53:10
అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్నుతానే అపరాధపరిహారార్థబలిచేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతనివలన సఫలమగును.
కీర్తనల గ్రంథము 118:11
నలుదిశలను వారు నన్ను చుట్టుకొనియున్నారు యెహోవా నామమునుబట్టి నేను వారిని నిర్మూలము చేసెదను.
కీర్తనల గ్రంథము 44:5
నీవలన మా విరోధులను అణచివేయుదుము నీ నామమువలననే, మామీదికి లేచువారిని మేము త్రొక్కి వేయుదుము.
కీర్తనల గ్రంథము 37:20
భక్తిహీనులు నశించిపోవుదురు యెహోవా విరోధులు మేతభూముల సొగసును పోలి యుందురు అది కనబడకపోవునట్లు వారు పొగవలె కనబడకపోవుదురు.
కీర్తనల గ్రంథము 35:5
యెహోవా దూత వారిని పారదోలును గాక వారు గాలికి కొట్టుకొనిపోవు పొట్టువలె నుందురు గాక.
కీర్తనల గ్రంథము 35:2
కేడెమును డాలును పట్టుకొని నా సహాయమునకై లేచి నిలువుము.
కీర్తనల గ్రంథము 9:3
నీవు నా పక్షమున వ్యాజ్యెమాడి నాకు న్యాయము తీర్చుచున్నావునీవు సింహాసనాసీనుడవై న్యాయమునుబట్టి తీర్పుతీర్చుచున్నావు
కీర్తనల గ్రంథము 3:7
యెహోవా, లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుమునా శత్రువులనందరిని దవడ యెముకమీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్లు విరుగగొట్టువాడవునీవే.
ప్రకటన గ్రంథము 19:19
మరియు ఆ గుఱ్ఱముమీద కూర్చున్నవానితోను ఆయన సేనతోను యుద్ధముచేయుటకై ఆ క్రూరమృగమును భూరాజులును వారి సేనలును కూడియుండగా చూచితిని.