Proverbs 6:14
వాని హృదయము అతిమూర్ఖ స్వభావముగలది వాడెల్లప్పుడు కీడు కల్పించుచు జగడములు పుట్టించును.
Proverbs 6:14 in Other Translations
King James Version (KJV)
Frowardness is in his heart, he deviseth mischief continually; he soweth discord.
American Standard Version (ASV)
In whose heart is perverseness, Who deviseth evil continually, Who soweth discord.
Bible in Basic English (BBE)
His mind is ever designing evil: he lets loose violent acts.
Darby English Bible (DBY)
deceits are in his heart; he deviseth mischief at all times, he soweth discords.
World English Bible (WEB)
In whose heart is perverseness, Who devises evil continually, Who always sows discord.
Young's Literal Translation (YLT)
Frowardness `is' in his heart, devising evil at all times, Contentions he sendeth forth.
| Frowardness | תַּֽהְפֻּכ֨וֹת׀ | tahpukôt | ta-poo-HOTE |
| is in his heart, | בְּלִבּ֗וֹ | bĕlibbô | beh-LEE-boh |
| deviseth he | חֹרֵ֣שׁ | ḥōrēš | hoh-RAYSH |
| mischief | רָ֣ע | rāʿ | ra |
| continually; | בְּכָל | bĕkāl | beh-HAHL |
| עֵ֑ת | ʿēt | ate | |
| he soweth | מִדְָנִ֥ים | midonîm | mee-doh-NEEM |
| discord. | יְשַׁלֵּֽחַ׃ | yĕšallēaḥ | yeh-sha-LAY-ak |
Cross Reference
మీకా 2:1
మంచములమీద పరుండి మోసపు క్రియలు యోచిం చుచు దుష్కార్యములు చేయువారికి శ్రమ; ఆలాగు చేయుట వారి స్వాధీనములో నున్నది గనుక వారు ప్రొద్దు పొడవగానే చేయుదురు.
సామెతలు 6:18
దుర్యోచనలు యోచించు హృదయమును కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములును
గలతీయులకు 6:7
మోస పోకుడి, దేవుడు వెక్కిరింపబడడు; మనుష్యుడు ఏమివిత్తునో ఆ పంటనే కోయును.
రోమీయులకు 16:17
సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతి రేకముగా భేదములను ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టియుండుడని మిమ్మును బతిమాలుకొను చున్నాను. వారిలోనుండి తొలగిపోవుడి.
హొషేయ 8:7
వారు గాలిని విత్తియున్నారు గనుక ప్రళయవాయువు వారికి కోతయగును; విత్తినది పైరుకాదు, మొలక కాదు, పంట యెత్తినది అది పంటకు వచ్చినయెడల అన్యులు దాని తినివేతురు.
యెహెజ్కేలు 11:2
అప్పుడాయన నాకీలాగు సెలవిచ్చెనునరపుత్రుడా యీ పట్టణము పచనపాత్రయనియు, మనము మాంస మనియు, ఇండ్లు కట్టుకొన అవసరములేదనియు చెప్పు కొనుచు
యెషయా గ్రంథము 57:20
భక్తిహీనులు కదలుచున్న సముద్రమువంటివారు అది నిమ్మళింపనేరదు దాని జలములు బురదను మైలను పైకివేయును.
యెషయా గ్రంథము 32:7
మోసకారి సాధనములును చెడ్డవి నిరుపేదలు న్యాయవాదన చేసినను కల్లమాటలతో దీనులను నాశనముచేయుటకు వారు దురాలోచనలు చేయుదురు.
సామెతలు 26:17
తనకు పట్టని జగడమునుబట్టి రేగువాడు దాటిపోవుచున్న కుక్క చెవులు పట్టుకొనువానితో సమానుడు.
సామెతలు 22:8
దౌష్ట్యమును విత్తువాడు కీడును కోయును వాని క్రోధమను దండము కాలిపోవును.
సామెతలు 21:8
దోషభరితుని మార్గము మిక్కిలి వంకరమార్గము పవిత్రుల కార్యము యథార్థము.
సామెతలు 16:28
మూర్ఖుడు కలహము పుట్టించును కొండెగాడు మిత్రభేదము చేయును.
సామెతలు 3:29
నీ పొరుగువాడు నీయొద్ద నిర్భయముగా నివసించు నపుడు వానికి అపకారము కల్పింపవద్దు.
సామెతలు 2:14
కీడుచేయ సంతోషించుదురు అతిమూర్ఖుల ప్రవర్తనయందు ఉల్లసించుదురు.
కీర్తనల గ్రంథము 36:4
వాడు మంచముమీదనే పాపయోచనను యోచిం చును వాడు కానినడతలు నడచువాడు చెడుతనము వానికి అసహ్యము కాదు.