Jude 1:19
అట్టివారు ప్రకృతి సంబంధులును ఆత్మ లేనివారునైయుండి భేదములు కలుగజేయుచున్నారు.
Jude 1:19 in Other Translations
King James Version (KJV)
These be they who separate themselves, sensual, having not the Spirit.
American Standard Version (ASV)
These are they who make separations, sensual, having not the Spirit.
Bible in Basic English (BBE)
These are the men who make divisions, natural men, not having the Spirit.
Darby English Bible (DBY)
These are they who set [themselves] apart, natural [men], not having [the] Spirit.
World English Bible (WEB)
These are they who cause divisions, and are sensual, not having the Spirit.
Young's Literal Translation (YLT)
these are those setting themselves apart, natural men, the Spirit not having.
| These | οὗτοί | houtoi | OO-TOO |
| be | εἰσιν | eisin | ees-een |
| they who | οἱ | hoi | oo |
| separate | ἀποδιορίζοντες, | apodiorizontes | ah-poh-thee-oh-REE-zone-tase |
| themselves, | ψυχικοί, | psychikoi | psyoo-hee-KOO |
| sensual, | πνεῦμα | pneuma | PNAVE-ma |
| having | μὴ | mē | may |
| not | ἔχοντες. | echontes | A-hone-tase |
Cross Reference
1 కొరింథీయులకు 2:14
ప్రకృతి సంబంధియైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయ ములను అంగీకరింపడు, అవి అతనికి వెఱ్ఱితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవముచేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు.
యాకోబు 3:15
ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చునదికాక భూసంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదియునై యున్నది.
హెబ్రీయులకు 10:25
ఆ దినము సమీపించుట మీరు చూచినకొలది మరి యెక్కువగా ఆలాగు చేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము.
రోమీయులకు 8:9
దేవుని ఆత్మ మీలో నివసించియున్నయెడల మీరు ఆత్మస్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయనవాడు కాడు.
హొషేయ 9:10
అరణ్యములో ద్రాక్షపండ్లు దొరికినట్లు ఇశ్రా యేలువారు నాకు దొరికిరి; చిగురుపెట్టు కాలమందు అంజూరపు చెట్టుమీద తొలి ఫలము దొరికినట్లు మీ పితరులు నాకు దొరికిరి. అయితే వారు బయల్పెయోరు నొద్దకు వచ్చి ఆ లజ్జాకరమైన దేవతకు తమ్మును తాము అప్పగించుకొనిరి; తాము మోహించినదానివలెనే వారు హేయులైరి.
1 కొరింథీయులకు 6:19
మీ దేహము దేవునివలన మీకు అనుగ్రహింపబడి, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై యున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు,
యోహాను సువార్త 3:5
యేసు ఇట్లనెనుఒకడు నీటిమూలముగాను ఆత్మమూలము గాను జన్మించితేనేగాని దేవుని రాజ్యములో ప్రవేశింప లేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
హొషేయ 4:14
జనులు తామే వ్యభిచారిణులను కూడుదురు, తామే వేశ్యలతో సాంగత్యముచేయుచు బలుల నర్పింతురు గనుక మీ కుమార్తెలు వేశ్యలగుటనుబట్టి నేను వారిని శిక్షింపను, మీ కోడండ్లు వ్యభిచరించుటను బట్టి నేను వారిని శిక్షింపను; వివేచనలేని జనము నిర్మూల మగును.
యెహెజ్కేలు 14:7
ఇశ్రా యేలీయులలోను వారి దేశములో నివసించు పరదేశుల లోను ఎవరైనను నన్ను అనుసరించక నాకు అన్యులై తమ మనస్సున విగ్రహములను నిలుపుకొని తమకు దోషము కలుగజేసికొని అభ్యంతరమును తమయెదుట పెట్టుకొని తమ నిమిత్తమై నాయొద్ద విచారణచేయవలెనని ప్రవక్త యొద్దకు వచ్చినయెడల యెహోవానగు నేనే స్వయముగా వారికి ప్రత్యుత్తరమిచ్చెదను.
యెషయా గ్రంథము 65:5
వారుమా దాపునకురావద్దు ఎడముగా ఉండుము నీకంటె మేము పరిశుద్ధులమని చెప్పుదురు; వీరు నా నాసికారంధ్రములకు పొగవలెను దినమంతయు మండుచుండు అగ్నివలెను ఉన్నారు.
సామెతలు 18:1
వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారముగా నడచువాడు అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. బుద్ధిహీనుడు వివేచనయందు సంతోషింపక