Jeremiah 17:2
యూదా పాపము ఇనుపగంట ముతో వ్రాయబడియున్నది; అది వజ్రపు మొనతో లిఖింపబడియున్నది; అది వారి హృదయ ములనెడి పలకల మీదను చెక్కబడియున్నది. మీ బలిపీఠముల కొమ్ముల మీదను చెక్కబడియున్నది.
Jeremiah 17:2 in Other Translations
King James Version (KJV)
Whilst their children remember their altars and their groves by the green trees upon the high hills.
American Standard Version (ASV)
whilst their children remember their altars and their Asherim by the green trees upon the high hills.
Bible in Basic English (BBE)
Their altars and their wood pillars under every branching tree, on the high hills and the mountains in the field.
Darby English Bible (DBY)
whilst their children remember their altars and their Asherahs, by the green trees, upon the high hills.
World English Bible (WEB)
while their children remember their altars and their Asherim by the green trees on the high hills.
Young's Literal Translation (YLT)
As their sons remember their altars and their shrines, By the green tree, by the high hills.
| Whilst their children | כִּזְכֹּ֤ר | kizkōr | keez-KORE |
| remember | בְּנֵיהֶם֙ | bĕnêhem | beh-nay-HEM |
| their altars | מִזְבְּחוֹתָ֔ם | mizbĕḥôtām | meez-beh-hoh-TAHM |
| groves their and | וַאֲשֵׁרֵיהֶ֖ם | waʾăšērêhem | va-uh-shay-ray-HEM |
| by | עַל | ʿal | al |
| the green | עֵ֣ץ | ʿēṣ | ayts |
| trees | רַֽעֲנָ֑ן | raʿănān | ra-uh-NAHN |
| upon | עַ֖ל | ʿal | al |
| the high | גְּבָע֥וֹת | gĕbāʿôt | ɡeh-va-OTE |
| hills. | הַגְּבֹהֽוֹת׃ | haggĕbōhôt | ha-ɡeh-voh-HOTE |
Cross Reference
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 24:18
జనులు తమ పితరుల దేవుడైన యెహోవా మందిరమును విడచి, దేవతాస్తంభములకును విగ్రహములకును పూజచేసిరి; వారు, చేసిన యీ యప రాధము నిమిత్తము యూదావారిమీదికిని యెరూషలేము కాపురస్థులమీదికిని కోపము వచ్చెను.
యిర్మీయా 2:20
పూర్వ కాలమునుండి నేను నీ కాడిని విరుగగొట్టి నీ బంధకములను తెంపివేసితినినేను సేవచేయ నని చెప్పుచున్నావు; ఎత్తయిన ప్రతి కొండమీదను పచ్చని ప్రతి చెట్టుక్రిందను వేశ్యవలె క్రీడించుచున్నావు.
యిర్మీయా 7:18
నాకు కోపము పుట్టించునట్లు ఆకాశరాణి దేవతకు పిండివంటలు చేయవలెననియు, అన్య దేవతలకు పానార్పణ ములు పోయవలెననియు పిల్లలు కట్టెలు ఏరుచున్నారు తండ్రులు అగ్ని రాజ బెట్టుచున్నారు స్త్రీలు పిండి పిసుకుచున్నారు.
యెషయా గ్రంథము 17:8
మానవులు తమ్మును సృష్టించినవానివైపు చూతురు వారి కన్నులు ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధ దేవుని లక్ష్యపెట్టును
యెషయా గ్రంథము 1:29
మీరు ఇచ్ఛయించిన మస్తకివృక్షమునుగూర్చి వారు సిగ్గుపడుదురు మీకు సంతోషకరములైన తోటలనుగూర్చి మీ ముఖ ములు ఎఱ్ఱబారును
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 33:3
ఇతడు తన తండ్రియైన హిజ్కియా పడగొట్టిన ఉన్నతస్థలములను తిరిగి కట్టించి, బయలు దేవతకు బలిపీఠములను నిలిపి, దేవతాస్తంభములను చేయించి, ఆకాశనక్షత్రము లన్నిటిని పూజించి కొలిచెను.
న్యాయాధిపతులు 3:7
అట్లు ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని దోషులై, తమ దేవుడైన యెహోవాను మరచి బయలుదేవతలను దేవతా స్తంభములను పూజించిరి.
హొషేయ 4:13
పర్వతముల శిఖరములమీద బలులనర్పింతురు, కొండలమీద ధూపము వేయుదురు, సింధూరవృక్షముల క్రిందను చినారువృక్షముల క్రిందను మస్తకివృక్షముల క్రిందను నీడ మంచిదని అచటనే ధూపము వేయుదురు; అందువలననే మీ కుమార్తెలు వేశ్యలైరి, మీ కోడండ్లును వ్యభిచారిణులైరి.
యెహెజ్కేలు 20:28
వారికిచ్చెదనని నేను ప్రమాణ పూర్వక ముగా చెప్పిన దేశములోనికి నేను వారిని రప్పించిన తరు వాత, ఎత్తయిన యొక కొండనేగాని, దట్టమైన యొక వృక్షమునేగాని తాము చూచినప్పుడెల్లను బలులు అర్పిం చుచు, అర్పణలను అర్పించుచు, అక్కడ పరిమళ ధూపము ప్రతిష్ఠించుచు, పానార్పణములు చేయుచు నాకు కోపము పుట్టించిరి.
కీర్తనల గ్రంథము 78:58
వారు ఉన్నతస్థలములను కట్టి ఆయనకు కోపము పుట్టించిరి విగ్రహములను పెట్టుకొని ఆయనకు రోషము కలుగ జేసిరి.
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 33:19
అతడు చేసిన ప్రార్థనను గూర్చియు, అతని మనవి వినబడుటను గూర్చియు, అతడు చేసిన పాపద్రోహములన్నిటిని గూర్చియు, తాను గుణ పడకముందు ఉన్నత స్థలములను కట్టించి దేవతాస్తంభములను చెక్కిన విగ్రహములను అచ్చట నిలుపుటను గూర్చియు, దీర్ఘదర్శులు రచించిన గ్రంథములలో వ్రాయ బడియున్నది.