Isaiah 30:7
ఐగుప్తువలని సహాయము పనికిమాలినది,నిష్ప్రయోజన మైనది అందుచేతనుఏమియు చేయక ఊరకుండు గప్పాల మారి అని దానికి పేరు పెట్టుచున్నాను.
Isaiah 30:7 in Other Translations
King James Version (KJV)
For the Egyptians shall help in vain, and to no purpose: therefore have I cried concerning this, Their strength is to sit still.
American Standard Version (ASV)
For Egypt helpeth in vain, and to no purpose: therefore have I called her Rahab that sitteth still.
Bible in Basic English (BBE)
For there is no use or purpose in the help of Egypt: so I have said about her, She is Rahab, who has come to an end.
Darby English Bible (DBY)
For Egypt shall help in vain, and to no purpose; therefore have I named her, Arrogance, that doeth nothing.
World English Bible (WEB)
For Egypt helps in vain, and to no purpose: therefore have I called her Rahab who sits still.
Young's Literal Translation (YLT)
Yea, Egyptians `are' vanity, and in vain do help, Therefore I have cried concerning this: `Their strength `is' to sit still.'
| For the Egyptians | וּמִצְרַ֕יִם | ûmiṣrayim | oo-meets-RA-yeem |
| shall help | הֶ֥בֶל | hebel | HEH-vel |
| vain, in | וָרִ֖יק | wārîq | va-REEK |
| and to no purpose: | יַעְזֹ֑רוּ | yaʿzōrû | ya-ZOH-roo |
| therefore | לָכֵן֙ | lākēn | la-HANE |
| have I cried | קָרָ֣אתִי | qārāʾtî | ka-RA-tee |
| concerning this, | לָזֹ֔את | lāzōt | la-ZOTE |
| Their | רַ֥הַב | rahab | RA-hahv |
| strength | הֵ֖ם | hēm | hame |
| is to sit still. | שָֽׁבֶת׃ | šābet | SHA-vet |
Cross Reference
నిర్గమకాండము 14:13
అందుకు మోషేభయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి; మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇకమీదట మరి ఎన్నడును చూడరు.
విలాపవాక్యములు 3:26
నరులు ఆశకలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది.
యిర్మీయా 37:7
ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగానాయొద్ద విచారించుడని నిన్ను నా యొద్దకు పంపిన యూదారాజుతో నీ వీలాగు చెప్పవలెనుమీకు సహాయము చేయుటకై బయలుదేరి వచ్చు చున్న ఫరోదండు తమ స్వదేశమైన ఐగుప్తులోనికి తిరిగి వెళ్లును.
యెషయా గ్రంథము 51:9
యెహోవా బాహువా, లెమ్ము లెమ్ము బలము తొడుగు కొమ్ము పూర్వపుకాలములలోను పురాతన తరములలోను లేచి నట్లు లెమ్ము రాహాబును తుత్తునియలుగా నరికివేసినవాడవు నీవే గదా? మకరమును పొడిచినవాడవు నీవే గదా?
యెషయా గ్రంథము 31:1
ఇశ్రాయేలు పరిశుద్ధదేవుని లక్ష్యపెట్టకయు యెహోవాయొద్ద విచారింపకయు సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్లుచు గుఱ్ఱములను ఆధారము చేసికొని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యు లనియు వారిని ఆశ్రయించువారికి శ్రమ.
యెషయా గ్రంథము 30:15
ప్రభువును ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధ దేవుడునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు మీరు మరలి వచ్చి ఊరకుండుటవలన రక్షింప బడెదరు మీరు ఊరకుండి నమ్ముకొనుటవలన మీకు బలము కలుగును.
యెషయా గ్రంథము 28:12
అయినను వారు విననొల్లరైరి. కావున వారు వెళ్లి వెనుకకు మొగ్గి విరుగబడి చిక్కు బడి పట్టబడునట్లు
యెషయా గ్రంథము 7:4
భద్రముసుమీ, నిమ్మళించుము; పొగ రాజుచున్న యీ రెండు కొరకంచు కొనలకు, అనగా రెజీనును, సిరియనులు, రెమల్యా కుమారుడును అనువారి కోపాగ్నికి జడియకుము, నీ గుండె అవియ నీయకుము.
యెషయా గ్రంథము 2:22
తన నాసికారంధ్రములలో ప్రాణముకలిగిన నరుని లక్ష్యపెట్టకుము; వానిని ఏవిషయములో ఎన్నిక చేయవచ్చును?
కీర్తనల గ్రంథము 118:8
మనుష్యులను నమ్ముకొనుటకంటె యెహోవాను ఆశ్రయించుట మేలు.
కీర్తనల గ్రంథము 76:8
నీవు తీర్చిన తీర్పు ఆకాశములోనుండి వినబడజేసితివి
హొషేయ 5:13
తాను రోగి యవుట ఎఫ్రాయిము చూచెను, తనకు పుండు కలుగుట యూదా చూచెను అప్పుడు ఎఫ్రాయిము అష్షూరీయులయొద్దకు పోయెను, రాజైన యారేబును పిలుచుకొనెను. అయితే అతడు నిన్ను స్వస్థపరచజాలడు, నీ పుండు బాగు చేయజాలడు.