Hosea 9:1
ఇశ్రాయేలూ, అన్యజనులు సంతోషించునట్లు నీవు సంభ్రమపడి సంతోషింపవద్దు; నీవు నీ దేవుని విసర్జించి వ్యభిచరించితివి, నీ కళ్లములన్నిటిమీదనున్న ధాన్యమును బట్టి నీవు పడుపుకూలిని ఆశించితివి.
Hosea 9:1 in Other Translations
King James Version (KJV)
Rejoice not, O Israel, for joy, as other people: for thou hast gone a whoring from thy God, thou hast loved a reward upon every cornfloor.
American Standard Version (ASV)
Rejoice not, O Israel, for joy, like the peoples; for thou hast played the harlot, `departing' from thy God; thou hast loved hire upon every grain-floor.
Bible in Basic English (BBE)
Have no joy, O Israel, and do not be glad like the nations; for you have been untrue to your God; your desire has been for the loose woman's reward on every grain-floor.
Darby English Bible (DBY)
Rejoice not, Israel, exultingly, as the peoples; for thou hast gone a whoring from thy God, thou hast loved harlot's hire upon every corn-floor.
World English Bible (WEB)
Don't rejoice, Israel, to jubilation like the nations; For you were unfaithful to your God. You love the wages of a prostitute at every grain threshing floor.
Young's Literal Translation (YLT)
`Rejoice not, O Israel, be not joyful like the peoples, For thou hast gone a-whoring from thy God, Thou hast loved a gift near all floors of corn.
| Rejoice | אַל | ʾal | al |
| not, | תִּשְׂמַ֨ח | tiśmaḥ | tees-MAHK |
| O Israel, | יִשְׂרָאֵ֤ל׀ | yiśrāʾēl | yees-ra-ALE |
| for | אֶל | ʾel | el |
| joy, | גִּיל֙ | gîl | ɡeel |
| people: other as | כָּֽעַמִּ֔ים | kāʿammîm | ka-ah-MEEM |
| for | כִּ֥י | kî | kee |
| whoring a gone hast thou | זָנִ֖יתָ | zānîtā | za-NEE-ta |
| from | מֵעַ֣ל | mēʿal | may-AL |
| thy God, | אֱלֹהֶ֑יךָ | ʾĕlōhêkā | ay-loh-HAY-ha |
| loved hast thou | אָהַ֣בְתָּ | ʾāhabtā | ah-HAHV-ta |
| a reward | אֶתְנָ֔ן | ʾetnān | et-NAHN |
| upon | עַ֖ל | ʿal | al |
| every | כָּל | kāl | kahl |
| cornfloor. | גָּרְנ֥וֹת | gornôt | ɡore-NOTE |
| דָּגָֽן׃ | dāgān | da-ɡAHN |
Cross Reference
హొషేయ 10:5
బేతావెనులోనున్న దూడవిషయమై షోమ్రోను నివాసులు భయపడుదురు, దాని ప్రభావము పోయెనని ప్రజలును, సంతోషించుచుండిన దాని అర్చకులును దుఃఖింతురు.
హొషేయ 4:12
నా జనులు తాము పెట్టు కొనిన కఱ్ఱయొద్ద విచారణచేయుదురు, తమ చేతికఱ్ఱ వారికి సంగతి తెలియజేయును, వ్యభిచారమనస్సు వారిని త్రోవ తప్పింపగా వారు తమ దేవుని విసర్జించి వ్యభిచ రింతురు.
యిర్మీయా 44:17
మేము నీతో చెప్పిన సంగతులన్నిటిని నిశ్చయముగా నెరవేర్చ బోవుచున్నాము; మేమును మా పితరులును మా రాజులును మా యధిపతు లును యూదా పట్టణములలోను యెరూషలేము వీధుల లోను చేసినట్లే ఆకాశరాణికి ధూపము వేయుదుము, ఆమెకు పానార్పణములు అర్పింతుము; ఏలయనగా మేము ఆలాగు చేసినప్పుడు మాకు ఆహారము సమృద్ధిగా దొరికెను, మేము క్షేమముగానే యుంటిమి, యే కీడును మాకు కలుగలేదు.
యాకోబు 5:1
ఇదిగో ధనవంతులారా, మీమీదికి వచ్చెడి ఉపద్రవ ములను గూర్చి ప్రలాపించి యేడువుడి.
యాకోబు 4:16
ఇప్పుడైతే మీరు మీ డంబములయందు అతిశయపడుచున్నారు. ఇట్టి అతిశయమంతయు చెడ్డది.
ఆమోసు 8:10
మీ పండుగ దినములను దుఃఖదినములుగాను మీ పాటలను ప్రలాపములుగాను మార్చుదును, అందరిని మొలలమీద గోనెపట్ట కట్టుకొనజేయుదును, అందరి తలలు బోడిచేసెదను, ఒకనికి కలుగు ఏకపుత్ర శోకము వంటి ప్రలాపము నేను పుట్టింతును; దాని అంత్యదినము ఘోరమైన శ్రమ దినముగా ఉండును.
ఆమోసు 6:13
న్యాయమును ఘోరమైన అన్యా యముగాను, నీతిఫలమును ఘోరదుర్మార్గముగాను మార్చి తిరి.
ఆమోసు 6:6
పాత్రలలో ద్రాక్షారసముపోసి పానము చేయుచు పరిమళ తైలము పూసికొనుచుందురు గాని యోసేపు సంతతివారికి కలిగిన ఉపద్రవమును గురించి చింతపడరు.
ఆమోసు 3:2
అదేమనగా భూమిమీది సకల వంశములలోను మిమ్మును మాత్రమే నేను ఎరిగియున్నాను గనుక మీరు చేసిన దోషక్రియలన్నిటినిబట్టి మిమ్మును శిక్షింతును.
హొషేయ 5:7
యెహోవాకు విశ్వాసఘాతకులై వారు అన్యులైన పిల్లలను కనిరి; ఇంకొక నెల అయిన తర్వాత వారు వారి స్వాస్థ్యములతో కూడ లయమగుదురు.
హొషేయ 5:4
తమ క్రియలచేత అభ్యంతరపరచబడినవారై వారు తమ దేవునియొద్దకు తిరిగి రాలేకపోవుదురు. వారిలో వ్యభిచార మనస్సుండుటవలన వారు యెహోవాను ఎరుగక యుందురు.
హొషేయ 2:12
ఇవి నా విటకాండ్రు నాకిచ్చినజీతమని అది తన ద్రాక్ష చెట్లను గూర్చియు అంజూరపుచెట్లనుగూర్చియు చెప్పినది గదా. నేను వాటిని లయపరతును, అడవిజంతువులు వాటిని భక్షించునట్లు వాటిని అడవివలె చేతును.
యెహెజ్కేలు 21:10
అది గొప్ప వధ చేయుటకై పదును పెట్టియున్నది, తళతళలాడునట్లు అది మెరుగుపెట్టియున్నది; ఇట్లుండగా నా కుమారుని దండము ఇతర దండములన్నిటిని తృణీకరించునది అని చెప్పి మనము సంతోషించెదమా?
యెహెజ్కేలు 20:32
అన్యజనులేమి భూమిమీది యే జనులేమి చేయునట్లు మేమును కొయ్యలకును రాళ్లకును పూజచేతు మని మీరనుకొనుచున్నారే. మీరు ఇచ్ఛయించినదాని ప్రకారమెన్నటికిని జరుగదు.
యెహెజ్కేలు 16:47
అయితే వారి ప్రవర్తన ననుసరించుటయు, వారు చేయు హేయక్రియలు చేయుటయు స్వల్పకార్యమని యెంచి, వారి నడతలను మించునట్లుగా నీవు చెడుమార్గములయందు ప్రవర్తించితివి.
విలాపవాక్యములు 4:21
అతని నీడక్రిందను అన్యజనుల మధ్యను బ్రదికెదమని మేమనుకొన్నవాడు పట్టబడెను. ఊజు దేశములో నివసించు ఎదోము కుమారీ, సంతోషించుము ఉత్సహించుము ఈ గిన్నెలోనిది త్రాగుట నీ పాలవును నీవు దానిలోనిది త్రాగి మత్తిల్లి నిన్ను దిగంబరినిగా చేసికొందువు
యెషయా గ్రంథము 22:12
ఆ దినమున ఏడ్చుటకును అంగలార్చుటకును తలబోడి చేసికొనుటకును గోనెపట్ట కట్టుకొనుటకును సైన్యములకధిపతియు ప్రభువునగు యెహోవా మిమ్మును పిలువగా
యెషయా గ్రంథము 17:11
నీవు నాటిన దినమున దాని చుట్టు కంచె వేసితివి ప్రొద్దుననే నీవు వేసిన విత్తనములను పుష్పింప జేసితివి గొప్ప గాయములును మిక్కుటమైన బాధయు కలుగు దినమున పంట కుప్పలుగా కూర్చబడును.