Genesis 2:1 in Telugu

Telugu Telugu Bible Genesis Genesis 2 Genesis 2:1

Genesis 2:1
ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూ హమును సంపూర్తి చేయబడెను.

Genesis 2Genesis 2:2

Genesis 2:1 in Other Translations

King James Version (KJV)
Thus the heavens and the earth were finished, and all the host of them.

American Standard Version (ASV)
And the heavens and the earth were finished, and all the host of them.

Bible in Basic English (BBE)
And the heaven and the earth and all things in them were complete.

Darby English Bible (DBY)
And the heavens and the earth and all their host were finished.

Webster's Bible (WBT)
Thus the heavens and the earth were finished, and all the host of them.

World English Bible (WEB)
The heavens and the earth were finished, and all the host of them.

Young's Literal Translation (YLT)
And the heavens and the earth are completed, and all their host;

Thus
the
heavens
וַיְכֻלּ֛וּwaykullûvai-HOO-loo
and
the
earth
הַשָּׁמַ֥יִםhaššāmayimha-sha-MA-yeem
finished,
were
וְהָאָ֖רֶץwĕhāʾāreṣveh-ha-AH-rets
and
all
וְכָלwĕkālveh-HAHL
the
host
of
them.
צְבָאָֽם׃ṣĕbāʾāmtseh-va-AM

Cross Reference

కీర్తనల గ్రంథము 33:6
యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను ఆయన నోటి ఊపిరిచేత వాటి సర్వసమూహము కలిగెను.

రాజులు రెండవ గ్రంథము 19:15
​యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థనచేసెనుయెహోవా, కెరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలీయుల దేవా, భూమ్యా కాశములను కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు లోక మందున్న సకల రాజ్యములకు దేవుడవైయున్నావు.

ద్వితీయోపదేశకాండమ 4:19
సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరలుకొల్పబడి, నీ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజలకొరకు పంచి పెట్టినవాటికి నమస్కరించి వాటిని పూజింపకుండునట్లును మీరు బహు జాగ్రత్త పడుడి.

నిర్గమకాండము 31:17
నాకును ఇశ్రాయేలీయులకును అది ఎల్లప్పుడును గురుతైయుండును; ఏలయనగా ఆరుదినములు యెహోవా భూమ్యాకాశములను సృజించి యేడవదినమున పని మాని విశ్రమించెనని చెప్పుము.

ఆదికాండము 1:1
ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను.

నిర్గమకాండము 20:11
ఆరు దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి, యేడవ దినమున విశ్ర మించెను; అందుచేత యెహోవా విశ్రాంతిదినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధపరచెను.

ద్వితీయోపదేశకాండమ 17:3
అది నీకు తెలుపబడిన తరువాత నీవు విని బాగుగా విచారణ చేయవలెను. అది నిజమైనయెడల, అనగా అట్టి హేయక్రియ ఇశ్రాయేలీ యులలో జరిగియుండుట వాస్తవమైనయెడల

హెబ్రీయులకు 4:3
కాగా జగత్పునాది వేయబడినప్పుడే ఆయన కార్యము లన్నియు సంపూర్తియైయున్నను ఈ విశ్రాంతినిగూర్చినేను కోపముతో ప్రమాణముచేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి, విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము.

యెషయా గ్రంథము 65:17
ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను మునుపటివి మరువబడును జ్ఞాపకమునకురావు.

యిర్మీయా 8:2
వారు ప్రేమించుచు పూజించుచు అనుసరించుచు విచారణచేయుచు నమస్కరించుచు వచ్చిన ఆ సూర్య చంద్ర నక్షత్రముల యెదుట వాటిని పరచెదరు; అవి కూర్చబడకయు పాతిపెట్టబడకయు భూమిమీద పెంట వలె పడియుండును.

యిర్మీయా 10:12
ఆయన తన బలముచేత భూమిని సృష్టించెను, తన జ్ఞానముచేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞచేత ఆకాశమును విశాలపరచెను.

యిర్మీయా 10:16
యాకోబునకు స్వాస్థ్యమగువాడు వాటివంటి వాడు కాడు; ఆయన సమస్తమును నిర్మించువాడు, ఇశ్రా యేలు ఆయనకు స్వాస్థ్యముగానున్న గోత్రము; సైన్య ములకధిపతియగు యెహోవాయని ఆయనకు పేరు.

జెకర్యా 12:1
దేవోక్తి ఇశ్రాయేలీయులనుగూర్చి వచ్చిన యెహోవా వాక్కు. ఆకాశమండలమును విశాలపరచి భూమికి పునాదివేసి మనుష్యుల అంతరంగములో జీవాత్మను సృజించు యెహోవా సెలవిచ్చునదేమనగా

లూకా సువార్త 2:13
వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడనుండి

అపొస్తలుల కార్యములు 4:24
వారు విని, యేక మనస్సుతో దేవునికిట్లు బిగ్గరగా మొఱపెట్టిరి. నాథా, నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగజేసినవాడవు.

అపొస్తలుల కార్యములు 7:42
అందుకు దేవుడు వారికి విము ఖుడై ఆకాశసైన్యమును సేవించుటకు వారిని విడిచిపెట్టెను. ఇందుకు ప్రమాణముగా ప్రవక్తల గ్రంథమందు ఈలాగు వ్రాయబడియున్నది.ఇశ్రాయేలు ఇంటివారలారామీర

యెషయా గ్రంథము 55:9
ఆకాశములు భూమికిపైన ఎంత యెత్తుగా ఉన్నవో మీ మార్గములకంటె నా మార్గములు మీ తలంపులకంటె నా తలంపులు అంత యెత్తుగా ఉన్నవి.

యెషయా గ్రంథము 48:13
నా హస్తము భూమి పునాదివేసెను నా కుడిచెయ్యి ఆకాశవైశాల్యములను వ్యాపింపజేసెను నేను వాటిని పిలువగా ఒకటి తప్పకుండ అవన్నియు నిలుచును.

ఆదికాండము 2:4
దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమ్యాకాశములు సృజించబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తిక్రమము ఇదే.

రాజులు రెండవ గ్రంథము 21:3
తన తండ్రియైన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను అతడు తిరిగి కట్టించి, బయలు దేవతకు బలిపీఠములను కట్టించి ఇశ్రా యేలురాజైన అహాబు చేసినట్లు దేవతాస్తంభములను చేయించి, నక్షత్రములకు మ్రొక్కి వాటిని పూజించు చుండెను.

దినవృత్తాంతములు రెండవ గ్రంథము 2:12
​యెహోవాఘనతకొరకు ఒక మందిరమును నీ రాజ్యఘనతకొరకు ఒక నగరును కట్టించుటకు తగిన జ్ఞానమును తెలివియుగల బుద్ధి మంతుడైన కుమారుని రాజైన దావీదునకు దయచేసిన, భూమ్యాకాశములకు సృష్టికర్తయగు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా స్తుతి నొందునుగాక.

నెహెమ్యా 9:6
నీవే, అద్వితీయుడవైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును, భూమిని దానిలో ఉండునది అంతటిని, సముద్రములను వాటిలో ఉండునది అంతటిని సృజించి వాటినన్నిటిని కాపాడువాడవు. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నది.

యోబు గ్రంథము 12:9
వీటి అన్నిటినిబట్టి యోచించుకొనినయెడలయెహోవా హస్తము వీటిని కలుగజేసెనని తెలిసికొనలేనివాడెవడు?

కీర్తనల గ్రంథము 33:9
ఆయన మాట సెలవియ్యగా దాని ప్రకారమాయెను ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను.

కీర్తనల గ్రంథము 89:11
ఆకాశము నీదే భూమి నీదే లోకమును దాని పరిపూర్ణతను నీవే స్థాపించితివి.

కీర్తనల గ్రంథము 104:2
వస్త్రమువలె వెలుగును నీవు కప్పుకొనియున్నావు. తెరను పరచినట్టు ఆకాశవిశాలమును నీవు పరచి యున్నావు.

కీర్తనల గ్రంథము 136:5
తన జ్ఞానముచేత ఆయన ఆకాశమును కలుగజేసెను ఆయన కృప నిరంతరముండును.

కీర్తనల గ్రంథము 146:6
ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దాని లోని సర్వమును సృజించినవాడు ఆయన ఎన్నడును మాట తప్పనివాడు.

యెషయా గ్రంథము 34:4
ఆకాశ సైన్యమంతయు క్షీణించును కాగితపు చుట్టవలె ఆకాశవైశాల్యములు చుట్టబడును. ద్రాక్షావల్లినుండి ఆకు వాడి రాలునట్లు అంజూరపుచెట్టునుండి వాడినది రాలునట్లు వాటి సైన్యమంతయు రాలిపోవును.

యెషయా గ్రంథము 40:26
మీకన్నులు పైకెత్తి చూడుడి వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్కచొప్పున వీటి సమూహములను బయలు దేరజేసి వీటన్నిటికిని పేరులు పెట్టి పిలుచువాడే గదా. తన అధికశక్తిచేతను తనకు కలిగియున్న బలాతిశయము చేతను ఆయన యొక్కటియైనను విడిచిపెట్టడు.

యెషయా గ్రంథము 42:5
ఆకాశములను సృజించి వాటిని విశాలపరచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దానిమీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు.

యెషయా గ్రంథము 45:12
భూమిని కలుగజేసినవాడను నేనే దానిమీదనున్న నరులను నేనే సృజించితిని నా చేతులు ఆకాశములను విశాలపరచెను వాటి సర్వసమూహమునకు నేను ఆజ్ఞ ఇచ్చితిని.

యెషయా గ్రంథము 45:18
ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు; ఆయన భూమిని కలుగజేసి దాని సిద్ధపరచి స్థిర పరచెను నిరాకారముగానుండునట్లు ఆయన దాని సృజింప లేదు నివాసస్థలమగునట్లుగా దాని సృజించెను ఆయన సెలవిచ్చునదేమనగా యెహోవాను నేనే మరి ఏ దేవుడును లేడు.

ఆదికాండము 1:10
దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను, అది మంచిదని దేవుడు చూచెను.