2 Kings 21:5
మరియు యెహోవా మందిరమునకున్న రెండుసాలలలో ఆకాశ సమూహములకు అతడు బలిపీఠములను కట్టించెను.
2 Kings 21:5 in Other Translations
King James Version (KJV)
And he built altars for all the host of heaven in the two courts of the house of the LORD.
American Standard Version (ASV)
And he built altars for all the host of heaven in the two courts of the house of Jehovah.
Bible in Basic English (BBE)
And he put up altars for all the stars of heaven in the two outer squares of the house of the Lord.
Darby English Bible (DBY)
And he built altars to all the host of heaven in both courts of the house of Jehovah.
Webster's Bible (WBT)
And he built altars for all the host of heaven in the two courts of the house of the LORD.
World English Bible (WEB)
He built altars for all the host of the sky in the two courts of the house of Yahweh.
Young's Literal Translation (YLT)
And he buildeth altars to all the host of the heavens in the two courts of the house of Jehovah;
| And he built | וַיִּ֥בֶן | wayyiben | va-YEE-ven |
| altars | מִזְבְּח֖וֹת | mizbĕḥôt | meez-beh-HOTE |
| all for | לְכָל | lĕkāl | leh-HAHL |
| the host | צְבָ֣א | ṣĕbāʾ | tseh-VA |
| of heaven | הַשָּׁמָ֑יִם | haššāmāyim | ha-sha-MA-yeem |
| two the in | בִּשְׁתֵּ֖י | bištê | beesh-TAY |
| courts | חַצְר֥וֹת | ḥaṣrôt | hahts-ROTE |
| of the house | בֵּית | bêt | bate |
| of the Lord. | יְהוָֽה׃ | yĕhwâ | yeh-VA |
Cross Reference
రాజులు మొదటి గ్రంథము 7:12
గొప్ప ఆవరణమునకు చుట్టును మూడు వరుసల చెక్కిన రాళ్లును, ఒక వరుస దేవదారు దూలములును కలవు; యెహోవా మందిరములోని ఆవరణము కట్టబడిన రీతినే ఆ మందిరపు మంటపమును కట్టబడెను.
రాజులు రెండవ గ్రంథము 23:12
మరియు యూదారాజులు చేయించిన ఆహాజు మేడగదిపైనున్న బలిపీఠములను, యెహోవా మందిరపు రెండు సాలలలో మనష్షే చేయించిన బలిపీఠములను రాజు పడ గొట్టించి ఛిన్నాభిన్నములుగా చేయించి ఆ ధూళిని కిద్రోను వాగులో పోయించెను.
రాజులు రెండవ గ్రంథము 23:4
రాజుబయలు దేవతకును అషేరా దేవికిని నక్షత్రములకును చేయబడిన ఉపకరణము లన్నిటి యెహోవా ఆలయములోనుండి ఇవతలకు తీసికొని రావలెనని ప్రధానయాజకుడైన హిల్కీయాకును రెండవ వరుస యాజకులకును ద్వారపాలకులకును ఆజ్ఞ ఇయ్యగా హిల్కీయా వాటిని యెరూషలేము వెలుపల కిద్రోను పొలములో కాల్చివేసి, బూడిదెను బేతేలు ఊరికి పంపి వేసెను.
రాజులు మొదటి గ్రంథము 6:36
మరియు లోపలనున్న సాలను మూడు వరుసలను చెక్కిన రాళ్లతోను ఒక వరుసను దేవదారు దూల ములతోను కట్టించెను.
యెహెజ్కేలు 44:19
బయటి ఆవరణములోనికి జనులయొద్దకు వారు వెళ్లునప్పుడు తమ ప్రతిష్ఠిత వస్త్రములను తీయకపోవుటచేత జనులను ప్రతిష్ఠింపకుండునట్లు, తమ పరిచర్య సంబంధమైన వస్త్ర ములను తీసి ప్రతిష్ఠితములగు గదులలో వాటిని ఉంచి, వేరు బట్టలు ధరింపవలెను,
యెహెజ్కేలు 43:5
ఆత్మ నన్ను ఎత్తి లోపటి ఆవరణము లోనికి తీసికొని రాగా యెహోవా తేజోమహిమతో మందిరము నిండియుండెను.
యెహెజ్కేలు 42:3
ఇరువది మూరలుగల లోపటి ఆవరణమున కెదురుగాను బయటి ఆవరణపు చఎ్టా కెదురుగాను మూడవ అంతస్థు లోని వసారాలు ఒకదానికొకటి యెదురుగా ఉండెను.
యెహెజ్కేలు 40:47
అతడు ఆ ఆవరణమును కొలువగా నిడివియు వెడల్పును నూరుమూరలై చచ్చౌకముగా ఉండెను. మందిరమునకు ఎదురుగా బలిపీఠముంచబడెను.
యెహెజ్కేలు 40:37
దాని స్తంభములు బయటి ఆవరణముతట్టు చూచుచుండెను; ఆ స్తంభములమీద ఈ ప్రక్కను ఆ ప్రక్కను ఖర్జూరపు చెట్లనుపోలిన అలంకారముండెను; ఎక్కుటకు ఎనిమిది మెట్లుండెను.
యెహెజ్కేలు 40:32
తూర్పుతట్టు లోపటి ఆవరణములోనికి నన్ను తోడుకొనిపోయి దాని గుమ్మమును ఆయన కొలువగా పైచెప్పిన కొలత తేలెను.
యెహెజ్కేలు 40:28
అతడు దక్షిణమార్గమున లోపటి ఆవరణములోనికి నన్ను తోడుకొనిపోయి దక్షిణపు గుమ్మమును కొలిచెను; దాని కొలత అదే.
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 33:15
మరియు యెహోవా మందిరమునుండి అన్యుల దేవతలను విగ్రహమును తీసివేసి, యెరూషలేమునందును యెహోవా మందిర పర్వతము నందును తాను కట్టించిన బలిపీఠములన్నిటిని తీసి పట్టణము బయటికి వాటిని లాగివేయించెను.
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 33:5
మరియు యెహోవా మందిరపు రెండు ఆవరణములలో అతడు ఆకాశనక్షత్ర సమూహమునకు బలిపీఠములను కట్టించెను.
రాజులు రెండవ గ్రంథము 23:6
యెహోవా మందిరమందున్న అషేరాదేవి ప్రతిమను యెరూషలేము వెలుపలనున్న కిద్రోను వాగుదగ్గరకు తెప్పించి, కిద్రోను వాగు ఒడ్డున దాని కాల్చి త్రొక్కి పొడుముచేసి ఆ పొడుమును సామాన్య జనుల సమాధులమీద చల్లెను.