Bible

Ruth 3 - WEB (Telugu)

1 Naomi her mother-in-law said to her, My daughter, shall I not seek rest for you, that it may be well with you?ఆమె అత్తయైన నయోమినా కుమారీ, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను గదా.

2 Now isn't Boaz our kinsman, with whose maidens you were? Behold, he winnows barley tonight in the threshing floor.ఎవని పనికత్తెలయొద్ద నీవు ఉంటివో ఆ బోయజు మనకు బంధువుడు. ఇదిగో యీ రాత్రి అతడు కళ్లమున యవలు తూర్పారబట్టింప బోవుచున్నాడు.

3 Wash yourself therefore, and anoint you, and put your clothing on you, and get you down to the threshing floor, but don't make yourself known to the man, until he shall have done eating and drinking.నీవు స్నానముచేసి తైలము రాచుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్లమునకు వెళ్లుము; అతడు అన్నపానములు పుచ్చు కొనుట చాలించువరకు నీవు అతనికి మరుగైయుండుము.

4 It shall be, when he lies down, that you shall mark the place where he shall lie, and you shall go in, and uncover his feet, and lay you down; and he will tell you what you shall do.అతడు పండుకొనిన తరువాత అతడు పండుకొనిన స్థలమును గుర్తెరిగి లోపలికి పోయి అతని కాళ్లమీద నున్న బట్ట తీసి పండుకొనవలెను; నీవు చేయవలసినదానిని అతడు నీకు తెలియజేయునని ఆమెతో అనగా

5 She said to her, All that you say I will do.ఆమెనీవు సెలవిచ్చినదంతయు చేసెదనని చెప్పి

6 She went down to the threshing floor, and did according to all that her mother-in-law bade her.ఆ కళ్లమునొద్దకు పోయి తన అత్త ఆజ్ఞాపించిన దంతయు చేసెను.

7 When Boaz had eaten and drunk, and his heart was merry, he went to lie down at the end of the heap of grain: and she came softly, and uncovered his feet, and laid her down.బోయజు మనస్సున సంతోషించునట్లు అన్న పానములు పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యపు కుప్ప యొద్ద పండుకొనినప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్లమీదనున్న బట్ట తీసి పండుకొనెను.

8 It happened at midnight, that the man was afraid, and turned himself; and, behold, a woman lay at his feet.మధ్యరాత్రియందు అతడు ఉలికిపడి తిరిగి చూచినప్పుడు, ఒక స్త్రీ అతని కాళ్లయొద్ద పండుకొని యుండెను.

9 He said, Who are you? She answered, I am Ruth your handmaid: spread therefore your skirt over your handmaid; for you are a near kinsman.అతడునీ వెవరవని అడుగగా ఆమెనేను రూతు అను నీ దాసురాలిని; నీవు నాకు సమీప బంధువుడవు గనుక నీ దాసురాలిమీద నీ కొంగు కప్పు మనగా

10 He said, Blessed are you by Yahweh, my daughter: you have shown more kindness in the latter end than at the beginning, inasmuch as you didn't follow young men, whether poor or rich.అతడునా కుమారీ, యెహోవాచేత నీవు దీవెన నొందినదానవు; కొద్దివారినే గాని గొప్పవారినే గాని ¸°వనస్థులను నీవు వెంబడింపక యుండుటవలన నీ మునుపటి సత్‌ ప్రవర్తనకంటె వెనుకటి సత్‌ ప్రవర్తన మరి ఎక్కువైనది.

11 Now, my daughter, don't be afraid; I will do to you all that you say; for all the city of my people does know that you are a worthy woman.కాబట్టి నా కుమారీ, భయపడకుము; నీవు చెప్పినదంతయు నీకు చేసెదను. నీవు యోగ్యు రాలవని నా జనులందరు ఎరుగుదురు.

12 Now it is true that I am a near kinsman; however there is a kinsman nearer than I.నేను నిన్ను విడిపింపగలవాడనను మాట వాస్తవమే; అయితే నీకు నాకంటె సమీపమైన బంధువు డొకడున్నాడు.

13 Stay this night, and it shall be in the morning, that if he will perform to you the part of a kinsman, well; let him do the kinsman's part: but if he will not do the part of a kinsman to you, then will I do the part of a kinsman to you, as Yahweh lives: lie down until the morning.ఈరాత్రి యుండుము; ఉదయమున అతడు నీకు బంధువుని ధర్మము జరిపినయెడల సరి, అతడు విడిపింపవచ్చును. నీకు బంధువుని ధర్మము జరుపుటకు అతనికి ఇష్టము లేక పోయినయెడల, యెహోవా జీవముతోడు నేనే నీకు బంధువుని ధర్మము జరిపెదను; ఉదయమువరకు పండుకొను మని చెప్పెను.

14 She lay at his feet until the morning. She rose up before one could discern another. For he said, Let it not be known that the woman came to the threshing floor.కాబట్టి ఆమె ఉదయమువరకు అతని కాళ్లయొద్ద పండుకొని, ఒకని నొకడు గుర్తించుపాటి వెలుగు రాకముందే లేచెను. అప్పుడు అతడుఆ స్త్రీ కళ్లమునకు వచ్చిన సంగతి తెలియ జేయకుడని చెప్పెను.

15 He said, Bring the mantle that is on you, and hold it; and she held it; and he measured six [measures] of barley, and laid it on her: and he went into the city.మరియు అతడునీవు వేసి కొనిన దుప్పటి తెచ్చి పట్టు కొనుమని చెప్పగా ఆమె దాని పట్టెను. అతడు ఆరుకొలల యవలను కొలచి ఆమె భుజముమీద నుంచగా ఆమె పురములోనికి వెళ్లెను.

16 When she came to her mother-in-law, she said, Who are you, my daughter? She told her all that the man had done to her.ఆమె తన అత్త యింటికి వచ్చినప్పుడు అత్తనా కుమారీ, నీ పని యెట్లు జరిగెనని యడుగగా, ఆమె ఆ మనుష్యుడు తనకు చేసిన దంతయు తెలియజేసి

17 She said, These six [measures] of barley gave he me; for he said, "Don't go empty to your mother-in-law."నీవు వట్టిచేతులతో నీ అత్త యింటికి పోవద్దని చెప్పి అతడు ఈ ఆరు కొలల యవలను నాకిచ్చె ననెను.

18 Then said she, "Sit still, my daughter, until you know how the matter will fall; for the man will not rest, until he has finished the thing this day."అప్పుడు ఆమెనా కుమారీ, యీ సంగతి నేటిదినమున నెరవేర్చితేనే కాని ఆ మనుష్యుడు ఊర కుండడు గనుక యిది ఏలాగు జరుగునో నీకు తెలియు వరకు ఊరకుండుమనెను.

Telugu Bible