1యెహోవా, నా మాటలు చెవినిబెట్టుము నా ధ్యానముమీద లక్ష్యముంచుము.Give ear to my words, O LORD, consider my meditation.
2నా రాజా నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము.నిన్నే ప్రార్థించుచున్నాను.Hearken unto the voice of my cry, my King, and my God: for unto thee will I pray.
3యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడునుఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధముచేసికాచియుందును.My voice shalt thou hear in the morning, O LORD; in the morning will I direct my prayer unto thee, and will look up.
4నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు చెడుతనమునకు నీయొద్ద చోటులేదుFor thou art not a God that hath pleasure in wickedness: neither shall evil dwell with thee.
5డాంబికులు నీ సన్నిధిని నిలువలేరుపాపము చేయువారందరు నీకసహ్యులుThe foolish shall not stand in thy sight: thou hatest all workers of iniquity.
6అబద్ధమాడువారిని నీవు నశింపజేయుదువుకపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు.Thou shalt destroy them that speak leasing: the LORD will abhor the bloody and deceitful man.
7నేనైతే నీ కృపాతిశయమునుబట్టి నీ మందిరములోప్రవేశించెదనునీయెడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయముదిక్కు చూచి నమస్కరించెదనుBut as for me, I will come into thy house in the multitude of thy mercy: and in thy fear will I worship toward thy holy temple.
8యెహోవా, నాకొఱకు పొంచియున్న వారినిబట్టినీ నీత్యానుసారముగా నన్ను నడిపింపుమునీ మార్గమును నాకు స్పష్టముగా కనుపరచుము.Lead me, O LORD, in thy righteousness because of mine enemies; make thy way straight before my face.
9వారి నోట యథార్థత లేదువారి అంతరంగము నాశనకరమైన గుంటవారి కంఠము తెరచిన సమాధివారు నాలుకతో ఇచ్చకములాడుదురు.For there is no faithfulness in their mouth; their inward part is very wickedness; their throat is an open sepulchre; they flatter with their tongue.
10దేవా, వారు నీమీద తిరుగబడియున్నారువారిని అపరాధులనుగా తీర్చుము.వారు తమ ఆలోచనలలో చిక్కుబడి కూలుదురుగాకవారు చేసిన అనేక దోషములనుబట్టి వారిని వెలివేయుము.Destroy thou them, O God; let them fall by their own counsels; cast them out in the multitude of their transgressions; for they have rebelled against thee.
11నిన్ను ఆశ్రయించువారందరు సంతోషించుదురునీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యముఆనందధ్వని చేయుదురు.But let all those that put their trust in thee rejoice: let them ever shout for joy, because thou defendest them: let them also that love thy name be joyful in thee.
12యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవేకేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవుకావున నీ నామమును ప్రేమించువారు నిన్నుగూర్చిఉల్లసింతురు.For thou, LORD, wilt bless the righteous; with favour wilt thou compass him as with a shield.