Bible

Psalm 23 - WEB (Telugu)

1 > Yahweh is my shepherd: I shall lack nothing.యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు.

2 He makes me lie down in green pastures. He leads me beside still waters.పచ్చికగల చోట్లను ఆయన నన్ను పరుండజేయు చున్నాడుశాంతికరమైన జలములయొద్ద నన్ను నడిపించుచున్నాడు.

3 He restores my soul. He guides me in the paths of righteousness for his name's sake.నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు తన నామమునుబట్టి నీతిమార్గములలో నన్ను నడిపించు చున్నాడు.

4 Even though I walk through the valley of the shadow of death, I will fear no evil, for you are with me. Your rod and your staff, they comfort me.గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడనునీవు నాకు తోడై యుందువు నీ దుడ్డుకఱ్ఱయు నీదండమును నన్ను ఆదరించును.

5 You prepare a table before me in the presence of my enemies. You anoint my head with oil. My cup runs over.నా శత్రువులయెదుట నీవు నాకు భోజనము సిద్ధ పరచుదువునూనెతో నా తల అంటియున్నావునా గిన్నె నిండి పొర్లుచున్నది.

6 Surely goodness and loving kindness shall follow me all the days of my life, And I shall dwell in Yahweh's house forever.నేను బ్రదుకు దినములన్నియు కృపాక్షేమములే నా వెంట వచ్చునుచిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసెదను.

Telugu Bible