Psalm 150
1 యెహోవాను స్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధిచేయు ఆకాశవిశాలమందు ఆయనను స్తుతించుడి.
2 ఆయనను స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యములనుబట్టి ఆయనను స్తుతించుడి. ఆయన మహా ప్రభావమునుబట్టి ఆయనను స్తుతించుడి.
3 బూరధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండలముతోను సితారాతోను ఆయనను స్తుతించుడి.
4 తంబురతోను నాట్యముతోను ఆయనను స్తుతించుడి. తంతివాద్యములతోను పిల్లనగ్రోవితోను ఆయనను స్తుతించుడి.
5 మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి. గంభీరధ్వనిగల తాళములతో ఆయనను స్తుతించుడి.
6 సకలప్రాణులు యెహోవాను స్తుతించుదురు గాక యెహోవాను స్తుతించుడి.
1 Praise ye the Lord. Praise God in his sanctuary: praise him in the firmament of his power.
2 Praise him for his mighty acts: praise him according to his excellent greatness.
3 Praise him with the sound of the trumpet: praise him with the psaltery and harp.
4 Praise him with the timbrel and dance: praise him with stringed instruments and organs.
5 Praise him upon the loud cymbals: praise him upon the high sounding cymbals.
6 Let every thing that hath breath praise the Lord. Praise ye the Lord.