Bible

Proverbs 6 - BBE (Telugu)

1 My son, if you have made yourself responsible for your neighbour, or given your word for another,నా కుమారుడా, నీ చెలికానికొరకు పూటపడిన యెడల పరునిచేతిలో నీవు నీ చేయి వేసినయెడల

2 You are taken as in a net by the words of your mouth, the sayings of your lips have overcome you.నీ నోటి మాటలవలన నీవు చిక్కుబడియున్నావు నీ నోటి మాటలవలన పట్టబడియున్నావు

3 Do this, my son, and make yourself free, because you have come into the power of your neighbour; go without waiting, and make a strong request to your neighbour.నా కుమారుడా, నీ చెలికానిచేత చిక్కుబడితివి. నీవు త్వరపడి వెళ్లి విడిచిపెట్టుమని నీ చెలికానిని బలవంతము చేయుము.

4 Give no sleep to your eyes, or rest to them;ఈలాగు చేసి తప్పించుకొనుము నీ కన్నులకు నిద్రయైనను నీ కనురెప్పలకు కునుకుపాటైనను రానియ్యకుము.

5 Make yourself free, like the roe from the hand of the archer, and the bird from him who puts a net for her.వేటకాని చేతినుండి లేడి తప్పించుకొనునట్లును ఎరుకువాని చేతినుండి పక్షి తప్పించుకొనునట్లును తప్పించుకొనుము.

6 Go to the ant, you hater of work; give thought to her ways and be wise:సోమరీ, చీమలయొద్దకు వెళ్లుము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము.

7 Having no chief, overseer, or ruler,వాటికి న్యాయాధిపతి లేకున్నను పై విచారణకర్త లేకున్నను అధిపతి లేకున్నను

8 She gets her meat in the summer, storing up food at the time of the grain-cutting.అవి వేసవికాలమందు ఆహారము సిద్ధపరచుకొనును కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును.

9 How long will you be sleeping, O hater of work? when will you get up from your sleep?సోమరీ, ఎందాక నీవు పండుకొనియుందువు? ఎప్పుడు నిద్రలేచెదవు?

10 A little sleep, a little rest, a little folding of the hands in sleep:ఇక కొంచెము నిద్రించెదనని కొంచెము కునికెదనని కొంచెముసేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవనుచుందువు

11 Then loss will come on you like an outlaw, and your need like an armed manఅందుచేత దోపిడిగాడు వచ్చునట్లు దారిద్ర్యము నీయొద్దకు వచ్చును. ఆయుధధారుడు వచ్చునట్లు లేమి నీయొద్దకు వచ్చును.

12 A good-for-nothing man is an evil-doer; he goes on his way causing trouble with false words;కుటిలమైన మాటలు పలుకువాడు పనికిమాలినవాడును దుష్టుడునై యున్నాడు

13 Making signs with his eyes, rubbing with his feet, and giving news with his fingers;వాడు కన్ను గీటుచు కాళ్లతో సైగచేయును వ్రేళ్లతో గురుతులు చూపును.

14 His mind is ever designing evil: he lets loose violent acts.వాని హృదయము అతిమూర్ఖ స్వభావముగలది వాడెల్లప్పుడు కీడు కల్పించుచు జగడములు పుట్టించును.

15 For this cause his downfall will be sudden; quickly he will be broken, and there will be no help for him.కాబట్టి ఆపద వానిమీదికి హఠాత్తుగా వచ్చును వాడు తిరుగలేకుండ ఆ క్షణమందే నలుగగొట్టబడును.

16 Six things are hated by the Lord; seven things are disgusting to him:యెహోవాకు అసహ్యములైనవి ఆరు గలవు ఏడును ఆయనకు హేయములు

17 Eyes of pride, a false tongue, hands which take life without cause;అవేవనగా, అహంకారదృష్టియు కల్లలాడు నాలుకయు నిరపరాధులను చంపు చేతులును

18 A heart full of evil designs, feet which are quick in running after sin;దుర్యోచనలు యోచించు హృదయమును కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములును

19 A false witness, breathing out untrue words, and one who lets loose violent acts among brothers.లేనివాటిని పలుకు అబద్ధసాక్షియు అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును.

20 My son, keep the rule of your father, and have in memory the teaching of your mother:నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము.

21 Keep them ever folded in your heart, and have them hanging round your neck.వాటిని ఎల్లప్పుడు నీ హృదయమునందు ధరించు కొనుము నీ మెడచుట్టు వాటిని కట్టుకొనుము.

22 In your walking, it will be your guide; when you are sleeping, it will keep watch over you; when you are awake, it will have talk with you.నీవు త్రోవను వెళ్లునప్పుడు అది నిన్ను నడిపించును నీవు పండుకొనునప్పుడు అది నిన్ను కాపాడును. నీవు మేలుకొనునప్పుడు అది నీతో ముచ్చటించును.

23 For the rule is a light, and the teaching a shining light; and the guiding words of training are the way of life.ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు.

24 They will keep you from the evil woman, from the smooth tongue of the strange woman.చెడు స్త్రీయొద్దకు పోకుండను పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోబడకుండను అవి నిన్ను కాపాడును.

25 Let not your heart's desire go after her fair body; let not her eyes take you prisoner.దాని చక్కదనమునందు నీ హృదయములో ఆశపడకుము అది తన కనురెప్పలను చికిలించి నిన్ను లోపరచుకొన నియ్యకుము.

26 For a loose woman is looking for a cake of bread, but another man's wife goes after one's very life.వేశ్యాసాంగత్యము చేయువానికి రొట్టెతునక మాత్రము మిగిలియుండును. మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును.

27 May a man take fire to his breast without burning his clothing?ఒకడు తన ఒడిలో అగ్ని నుంచుకొనినయెడల వాని వస్త్రములు కాలకుండునా?

28 Or may one go on lighted coals, and his feet not be burned?ఒకడు నిప్పులమీద నడిచినయెడల వాని పాదములు కమలకుండునా?

29 So it is with him who goes in to his neighbour's wife; he who has anything to do with her will not go free from punishment.తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు.

30 Men do not have a low opinion of a thief who takes food when he is in need of it:దొంగ ఆకలిగొని ప్రాణరక్షణకొరకు దొంగిలిన యెడల యెవరును వాని తిరస్కరింపరు గదా.

31 But if he is taken in the act he will have to give back seven times as much, giving up all his property which is in his house.వాడు దొరికినయెడల ఏడంతలు చెల్లింపవలెను తన యింటి ఆస్తి అంతయు అప్పగింపవలెను.

32 He who takes another man's wife is without all sense: he who does it is the cause of destruction to his soul.జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు ఆ కార్యము చేయువాడు స్వనాశనమును కోరువాడే

33 Wounds will be his and loss of honour, and his shame may not be washed away.వాడు దెబ్బలకును అవమానమునకును పాత్రుడగును వానికి కలుగు అపకీర్తి యెన్నటికిని తొలగిపోదు.

34 For bitter is the wrath of an angry husband; in the day of punishment he will have no mercy.భర్తకు పుట్టు రోషము మహా రౌద్రముగలది ప్రతికారము చేయు కాలమందు అట్టివాడు కనికర పడడు.

35 He will not take any payment; and he will not make peace with you though your money offerings are increased.ప్రాయశ్చిత్తమేమైన నీవు చేసినను వాడు లక్ష్య పెట్టడు ఎంత గొప్ప బహుమానములు నీవిచ్చినను వాడు ఒప్పు కొనడు.

Telugu Bible