Proverbs 26 - KJV (Telugu)
1 As snow in summer, and as rain in harvest, so honour is not seemly for a fool.ఎండకాలమునకు మంచు గిట్టదు కోతకాలమునకు వర్షము గిట్టదు అటువలె బుద్ధిహీనునికి ఘనత గిట్టదు.
2 As the bird by wandering, as the swallow by flying, so the curse causeless shall not come.రెక్కలు కొట్టుకొనుచు తారాడుచున్న పిచ్చుకయు దాటుచుండు వానకోవెలయు దిగకుండునట్లు హేతువులేని శాపము తగులకపోవును.
3 A whip for the horse, a bridle for the ass, and a rod for the fool's back.గుఱ్ఱమునకు చబుకు గాడిదకు కళ్లెము మూర్ఖుల వీపునకు బెత్తము.
4 Answer not a fool according to his folly, lest thou also be like unto him.వాని మూఢతచొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తర మియ్య కుము ఇచ్చినయెడల నీవును వాని పోలియుందువు.
5 Answer a fool according to his folly, lest he be wise in his own conceit.వాని మూఢతచొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తర మిమ్ము ఆలాగు చేయనియెడల వాడు తన దృష్టికి తాను జ్ఞానిననుకొనును.
6 He that sendeth a message by the hand of a fool cutteth off the feet, and drinketh damage.మూర్ఖునిచేత వర్తమానము పంపువాడు కాళ్లు తెగగొట్టుకొని విషము త్రాగినవానితో సమా నుడు.
7 The legs of the lame are not equal: so is a parable in the mouth of fools.కుంటివాని కాళ్లు పట్టులేక యున్నట్లు మూర్ఖుల నోట సామెత పాటి లేకుండును
8 As he that bindeth a stone in a sling, so is he that giveth honour to a fool.బుద్ధిహీనుని ఘనపరచువాడు వడిసెలలోని రాయి కదలకుండ కట్టువానితో సమానుడు.
9 As a thorn goeth up into the hand of a drunkard, so is a parable in the mouths of fools.మూర్ఖుల నోట సామెత మత్తునుగొనువాని చేతిలో ముల్లు గుచ్చుకొన్న ట్లుండును.
10 The great God that formed all things both rewardeth the fool, and rewardeth transgressors.అధికముగా నొందినవాడు సమస్తము చేయవచ్చును మూర్ఖునివలన కలుగు లాభము నిలువదు కూలికి వానిని పిలిచినవాడును చెడిపోవును.
11 As a dog returneth to his vomit, so a fool returneth to his folly.తన మూఢతను మరల కనుపరచు మూర్ఖుడు కక్కినదానికి తిరుగు కుక్కతో సమానుడు.
12 Seest thou a man wise in his own conceit? there is more hope of a fool than of him.తన దృష్టికి జ్ఞానిననుకొనువానిని చూచితివా? వానిని గుణపరచుటకంటె మూర్ఖుని గుణపరచుట సుళువు.
13 The slothful man saith, There is a lion in the way; a lion is in the streets.సోమరిదారిలో సింహమున్నదనును వీధిలో సింహ మున్నదనును.
14 As the door turneth upon his hinges, so doth the slothful upon his bed.ఉతకమీద తలుపు తిరుగును తన పడకమీద సోమరి తిరుగును.
15 The slothful hideth his hand in his bosom; it grieveth him to bring it again to his mouth.సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును నోటియొద్దకు దాని తిరిగి యెత్తుట కష్టమనుకొనును.
16 The sluggard is wiser in his own conceit than seven men that can render a reason.హేతువులు చూపగల యేడుగురికంటె సోమరి తన దృష్టికి తానే జ్ఞానిననుకొనును
17 He that passeth by, and meddleth with strife belonging not to him, is like one that taketh a dog by the ears.తనకు పట్టని జగడమునుబట్టి రేగువాడు దాటిపోవుచున్న కుక్క చెవులు పట్టుకొనువానితో సమానుడు.
18 As a mad man who casteth firebrands, arrows, and death,తెగులు అమ్ములు కొరవులు విసరు వెఱ్ఱివాడు
19 So is the man that deceiveth his neighbour, and saith, Am not I in sport?తన పొరుగువాని మోసపుచ్చి నేను నవ్వులాటకు చేసితినని పలుకువానితో సమానుడు.
20 Where no wood is, there the fire goeth out: so where there is no talebearer, the strife ceaseth.కట్టెలు లేనియెడల అగ్ని ఆరిపోవును కొండెగాడు లేనియెడల జగడము చల్లారును.
21 As coals are to burning coals, and wood to fire; so is a contentious man to kindle strife.వేడిబూడిదెకు బొగ్గులు అగ్నికి కట్టెలు కలహములు పుట్టించుటకు కలహప్రియుడు.
22 The words of a talebearer are as wounds, and they go down into the innermost parts of the belly.కొండెగాని మాటలు రుచిగల పదార్థములవంటివి అవి లోకడుపులోనికి దిగిపోవును.
23 Burning lips and a wicked heart are like a potsherd covered with silver dross.చెడు హృదయమును ప్రేమగల మాటలాడు పెద వులును కలిగియుండుట మంటి పెంకుమీది వెండి పూతతో సమానము.
24 He that hateth dissembleth with his lips, and layeth up deceit within him;పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటము దాచుకొనును.
25 When he speaketh fair, believe him not: for there are seven abominations in his heart.వాడు దయగా మాటలాడినప్పుడు వాని మాట నమ్మ కుము వాని హృదయములో ఏడు హేయవిషయములు కలవు.
26 Whose hatred is covered by deceit, his wickedness shall be shewed before the whole congregation.వాడు తనద్వేషమును కపటవేషముచేత దాచుకొనును సమాజములో వాని చెడుతనము బయలుపరచబడును.
27 Whoso diggeth a pit shall fall therein: and he that rolleth a stone, it will return upon him.గుంటను త్రవ్వువాడే దానిలో పడును రాతిని పొర్లించువానిమీదికి అది తిరిగి వచ్చును.
28 A lying tongue hateth those that are afflicted by it; and a flattering mouth worketh ruin.అబద్ధములాడువాడు తాను నలుగగొట్టినవారిని ద్వేషిం చును ఇచ్చకపు మాటలాడు నోరు నష్టము కలుగజేయును.
Telugu Bible