Proverbs 21 - YLT (Telugu)
1 Rivulets of waters `is' the heart of a king in the hand of Jehovah, Wherever He pleaseth He inclineth it.యెహోవా చేతిలో రాజు హృదయము నీటికాలువల వలెనున్నది. ఆయన తన చిత్తవృత్తిచొప్పున దాని త్రిప్పును.
2 Every way of a man `is' right in his own eyes, And Jehovah is pondering hearts.ఒకడు తనకేర్పరచుకొనిన మార్గము ఎట్టిదైనను తన దృష్టికది న్యాయముగానే అగపడును యెహోవాయే హృదయములను పరిశీలన చేయు వాడు.
3 To do righteousness and judgment, Is chosen of Jehovah rather than sacrifice.నీతిన్యాయముల ననుసరించి నడచుకొనుట బలుల నర్పించుటకంటె యెహోవాకు ఇష్టము.
4 Loftiness of eyes, and breadth of heart, Tillage of the wicked `is' sin.అహంకార దృష్టియు గర్వ హృదయమును భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు.
5 The purposes of the diligent `are' only to advantage, And of every hasty one, only to want.శ్రద్ధగలవారి యోచనలు లాభకరములు తాలిమిలేక పనిచేయువానికి నష్టమే ప్రాప్తించును
6 The making of treasures by a lying tongue, `Is' a vanity driven away of those seeking death.అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట ఊపిరితో సాటి, దానిని కోరువారు మరణమును కోరుకొందురు.
7 The spoil of the wicked catcheth them, Because they have refused to do judgment.భక్తిహీనులు న్యాయము చేయనొల్లరు వారు చేయు బలాత్కారము వారిని కొట్టుకొని పోవును.
8 Froward `is' the way of a man who is vile, And the pure -- upright `is' his work.దోషభరితుని మార్గము మిక్కిలి వంకరమార్గము పవిత్రుల కార్యము యథార్థము.
9 Better to sit on a corner of the roof, Than `with' a woman of contentions and a house of company.గయ్యాళితో పెద్దయింట నుండుటకంటె మిద్దెమీద నొక మూలను నివసించుట మేలు.
10 The soul of the wicked hath desired evil, Not gracious in his eyes is his neighbour.భక్తిహీనుని మనస్సు కీడుచేయ గోరును వాడు తన పొరుగువానికైనను దయ తలచడు.
11 When the scorner is punished, the simple becometh wise, And in giving understanding to the wise He receiveth knowledge.అపహాసకుడు దండింపబడుట చూచి జ్ఞానము లేని వాడు జ్ఞానము పొందును జ్ఞానముగలవాడు ఉపదేశమువలన తెలివినొందును.
12 The Righteous One is acting wisely Towards the house of the wicked, He is overthrowing the wicked for wickedness.నీతిమంతుడైన వాడు భక్తిహీనుని యిల్లు ఏమైనది కని పెట్టును భక్తిహీనులను ఆయన నాశనములో కూల్చును.
13 Whoso is shutting his ear from the cry of the poor, He also doth cry, and is not answered.దరిద్రుల మొఱ్ఱ వినక చెవి మూసికొనువాడు తాను మొఱ్ఱపెట్టునప్పుడు అంగీకరింపబడడు.
14 A gift in secret pacifieth anger, And a bribe in the bosom strong fury.చాటున ఇచ్చిన బహుమానము కోపమును చల్లార్చును ఒడిలోనుంచబడిన కానుక మహా క్రోధమును శాంతి పరచును.
15 To do justice `is' joy to the righteous, But ruin to workers of iniquity.న్యాయమైన క్రియలు చేయుట నీతిమంతునికి సంతోషకరము పాపము చేయువారికి అది భయంకరము.
16 A man who is wandering from the way of understanding, In an assembly of Rephaim resteth.వివేకమార్గము విడిచి తిరుగువాడు ప్రేతల గుంపులో కాపురముండును.
17 Whoso `is' loving mirth `is' a poor man, Whoso is loving wine and oil maketh no wealth.సుఖభోగములయందు వాంఛగలవానికి లేమి కలుగును ద్రాక్షారసమును నూనెయు వాంఛించువానికి ఐశ్వ ర్యము కలుగదు.
18 The wicked `is' an atonement for the righteous, And for the upright the treacherous dealer.నీతిమంతునికొరకు భక్తిహీనులు ప్రాయశ్చిత్తమగుదురు యథార్థవంతులకు ప్రతిగా విశ్వాసఘాతకులు కూలు దురు
19 Better to dwell in a wilderness land, Than `with' a woman of contentions and anger.ప్రాణము విసికించు జగడగొండిదానితో కాపురము చేయుటకంటె అరణ్యభూమిలో నివసించుట మేలు.
20 A treasure to be desired, and oil, `Is' in the habitation of the wise, And a foolish man swalloweth it up.విలువగల ధనమును నూనెయు జ్ఞానుల యింటనుండును బుద్ధిహీనుడు దాని వ్యయపరచును.
21 Whoso is pursuing righteousness and kindness, Findeth life, righteousness, and honour.నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందును.
22 A city of the mighty hath the wise gone up, And bringeth down the strength of its confidence.జ్ఞానియైన యొకడు పరాక్రమశాలుల పట్టణ ప్రాకార మెక్కును అట్టివాడు దానికి ఆశ్రయమైన కోటను పడగొట్టును.
23 Whoso is keeping his mouth and his tongue, Is keeping from adversities his soul.నోటిని నాలుకను భద్రము చేసికొనువాడు శ్రమలనుండి తన ప్రాణమును కాపాడుకొనును.
24 Proud, haughty, scorner `is' his name, Who is working in the wrath of pride.అహంకారియైన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు అట్టివాడు అమితగర్వముతో ప్రవర్తించును.
25 The desire of the slothful slayeth him, For his hands have refused to work.సోమరివాని చేతులు పనిచేయనొల్లవు వాని యిచ్ఛ వాని చంపును.
26 All the day desiring he hath desired, And the righteous giveth and withholdeth not.దినమెల్ల ఆశలు పుట్టుచుండును నీతిమంతుడు వెనుకతీయక ఇచ్చుచుండును.
27 The sacrifice of the wicked `is' abomination, Much more when in wickedness he bringeth it.భక్తిహీనులు అర్పించు బలులు హేయములు దురాలోచనతో అర్పించినయెడల అవి మరి హేయ ములు.
28 A false witness doth perish, And an attentive man for ever speaketh.కూటసాక్షి నశించును విని మాటలాడువాడు సత్యము పలుకును.
29 A wicked man hath hardened by his face, And the upright -- he prepareth his way.భక్తిహీనుడు తన ముఖమును మాడ్చుకొనును యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్క పరచుకొనును.
30 There is no wisdom, nor understanding, Nor counsel, over-against Jehovah.యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనయైనను ఆలోచనయైనను నిలువదు.
31 A horse is prepared for a day of battle, And the deliverance `is' of Jehovah!యుద్ధదినమునకు గుఱ్ఱములను ఆయత్తపరచుటకద్దు గాని రక్షణ యెహోవా అధీనము.
Telugu Bible