Proverbs 21 - WEB (Telugu)
1 The king's heart is in Yahweh's hand like the watercourses. He turns it wherever he desires.యెహోవా చేతిలో రాజు హృదయము నీటికాలువల వలెనున్నది. ఆయన తన చిత్తవృత్తిచొప్పున దాని త్రిప్పును.
2 Every way of a man is right in his own eyes, But Yahweh weighs the hearts.ఒకడు తనకేర్పరచుకొనిన మార్గము ఎట్టిదైనను తన దృష్టికది న్యాయముగానే అగపడును యెహోవాయే హృదయములను పరిశీలన చేయు వాడు.
3 To do righteousness and justice Is more acceptable to Yahweh than sacrifice.నీతిన్యాయముల ననుసరించి నడచుకొనుట బలుల నర్పించుటకంటె యెహోవాకు ఇష్టము.
4 A high look, and a proud heart, The lamp of the wicked, is sin.అహంకార దృష్టియు గర్వ హృదయమును భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు.
5 The plans of the diligent surely lead to profit; And everyone who is hasty surely rushes to poverty.శ్రద్ధగలవారి యోచనలు లాభకరములు తాలిమిలేక పనిచేయువానికి నష్టమే ప్రాప్తించును
6 Getting treasures by a lying tongue Is a fleeting vapor for those who seek death.అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట ఊపిరితో సాటి, దానిని కోరువారు మరణమును కోరుకొందురు.
7 The violence of the wicked will drive them away, Because they refuse to do what is right.భక్తిహీనులు న్యాయము చేయనొల్లరు వారు చేయు బలాత్కారము వారిని కొట్టుకొని పోవును.
8 The way of the guilty is devious, But the conduct of the innocent is upright.దోషభరితుని మార్గము మిక్కిలి వంకరమార్గము పవిత్రుల కార్యము యథార్థము.
9 It is better to dwell in the corner of the housetop, Than to share a house with a contentious woman.గయ్యాళితో పెద్దయింట నుండుటకంటె మిద్దెమీద నొక మూలను నివసించుట మేలు.
10 The soul of the wicked desires evil; His neighbor finds no mercy in his eyes.భక్తిహీనుని మనస్సు కీడుచేయ గోరును వాడు తన పొరుగువానికైనను దయ తలచడు.
11 When the mocker is punished, the simple gains wisdom; When the wise is instructed, he receives knowledge.అపహాసకుడు దండింపబడుట చూచి జ్ఞానము లేని వాడు జ్ఞానము పొందును జ్ఞానముగలవాడు ఉపదేశమువలన తెలివినొందును.
12 The Righteous One considers the house of the wicked, And brings the wicked to ruin.నీతిమంతుడైన వాడు భక్తిహీనుని యిల్లు ఏమైనది కని పెట్టును భక్తిహీనులను ఆయన నాశనములో కూల్చును.
13 Whoever stops his ears at the cry of the poor, He will also cry out, but shall not be heard.దరిద్రుల మొఱ్ఱ వినక చెవి మూసికొనువాడు తాను మొఱ్ఱపెట్టునప్పుడు అంగీకరింపబడడు.
14 A gift in secret pacifies anger; And a bribe in the cloak, strong wrath.చాటున ఇచ్చిన బహుమానము కోపమును చల్లార్చును ఒడిలోనుంచబడిన కానుక మహా క్రోధమును శాంతి పరచును.
15 It is joy to the righteous to do justice; But it is a destruction to the workers of iniquity.న్యాయమైన క్రియలు చేయుట నీతిమంతునికి సంతోషకరము పాపము చేయువారికి అది భయంకరము.
16 The man who wanders out of the way of understanding Shall rest in the assembly of the dead.వివేకమార్గము విడిచి తిరుగువాడు ప్రేతల గుంపులో కాపురముండును.
17 He who loves pleasure shall be a poor man: He who loves wine and oil shall not be rich.సుఖభోగములయందు వాంఛగలవానికి లేమి కలుగును ద్రాక్షారసమును నూనెయు వాంఛించువానికి ఐశ్వ ర్యము కలుగదు.
18 The wicked is a ransom for the righteous; The treacherous for the upright.నీతిమంతునికొరకు భక్తిహీనులు ప్రాయశ్చిత్తమగుదురు యథార్థవంతులకు ప్రతిగా విశ్వాసఘాతకులు కూలు దురు
19 It is better to dwell in a desert land, Than with a contentious and fretful woman.ప్రాణము విసికించు జగడగొండిదానితో కాపురము చేయుటకంటె అరణ్యభూమిలో నివసించుట మేలు.
20 There is precious treasure and oil in the dwelling of the wise; But a foolish man swallows it up.విలువగల ధనమును నూనెయు జ్ఞానుల యింటనుండును బుద్ధిహీనుడు దాని వ్యయపరచును.
21 He who follows after righteousness and kindness Finds life, righteousness, and honor.నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందును.
22 A wise man scales the city of the mighty, And brings down the strength of its confidence.జ్ఞానియైన యొకడు పరాక్రమశాలుల పట్టణ ప్రాకార మెక్కును అట్టివాడు దానికి ఆశ్రయమైన కోటను పడగొట్టును.
23 Whoever guards his mouth and his tongue Keeps his soul from troubles.నోటిని నాలుకను భద్రము చేసికొనువాడు శ్రమలనుండి తన ప్రాణమును కాపాడుకొనును.
24 The proud and haughty man, "scoffer" is his name; He works in the arrogance of pride.అహంకారియైన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు అట్టివాడు అమితగర్వముతో ప్రవర్తించును.
25 The desire of the sluggard kills him, For his hands refuse to labor.సోమరివాని చేతులు పనిచేయనొల్లవు వాని యిచ్ఛ వాని చంపును.
26 There are those who covet greedily all the day long; But the righteous give and don't withhold.దినమెల్ల ఆశలు పుట్టుచుండును నీతిమంతుడు వెనుకతీయక ఇచ్చుచుండును.
27 The sacrifice of the wicked is an abomination: How much more, when he brings it with a wicked mind!భక్తిహీనులు అర్పించు బలులు హేయములు దురాలోచనతో అర్పించినయెడల అవి మరి హేయ ములు.
28 A false witness will perish, And a man who listens speaks to eternity.కూటసాక్షి నశించును విని మాటలాడువాడు సత్యము పలుకును.
29 A wicked man hardens his face; But as for the upright, he establishes his ways.భక్తిహీనుడు తన ముఖమును మాడ్చుకొనును యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్క పరచుకొనును.
30 There is no wisdom nor understanding Nor counsel against Yahweh.యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనయైనను ఆలోచనయైనను నిలువదు.
31 The horse is prepared for the day of battle; But victory is with Yahweh.యుద్ధదినమునకు గుఱ్ఱములను ఆయత్తపరచుటకద్దు గాని రక్షణ యెహోవా అధీనము.
Telugu Bible