Bible

Proverbs 16 - KJV (Telugu)

1 The preparations of the heart in man, and the answer of the tongue, is from the LORD.హృదయాలోచనలు మనుష్యుని వశము, చక్కని ప్రత్యుత్తరమిచ్చుటకు యెహోవావలన కలు గును.

2 All the ways of a man are clean in his own eyes; but the LORD weigheth the spirits.ఒకని నడతలన్నియు వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును యెహోవా ఆత్మలను పరిశోధించును.

3 Commit thy works unto the LORD, and thy thoughts shall be established.నీ పనుల భారము యెహోవామీద నుంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును.

4 The LORD hath made all things for himself: yea, even the wicked for the day of evil.యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేసెను నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను.

5 Every one that is proud in heart is an abomination to the LORD: though hand join in hand, he shall not be unpunished.గర్వహృదయులందరు యెహోవాకు హేయులు నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు.

6 By mercy and truth iniquity is purged: and by the fear of the LORD men depart from evil.కృపాసత్యములవలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును యెహోవాయందు భయభక్తులు కలిగియుండుటవలన మనుష్యులు చెడుతనమునుండి తొలగిపోవుదురు.

7 When a man's ways please the LORD, he maketh even his enemies to be at peace with him.ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును.

8 Better is a little with righteousness than great revenues without right.అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడికంటె నీతితోకూడిన కొంచెమే శ్రేష్ఠము.

9 A man's heart deviseth his way: but the LORD directeth his steps.ఒకడు తాను చేయబోవునది హృదయములో యోచించుకొనును యెహోవా వాని నడతను స్థిరపరచును

10 A divine sentence is in the lips of the king: his mouth transgresseth not in judgment.దేవోక్తి పలుకుట రాజువశము న్యాయము విధించుటయందు అతని మాట న్యాయము తప్పదు.

11 A just weight and balance are the LORD's: all the weights of the bag are his work.న్యాయమైన త్రాసును తూనికరాళ్లును యెహోవా యొక్క యేర్పాటులు సంచిలోని గుండ్లన్నియు ఆయన నియమించెను.

12 It is an abomination to kings to commit wickedness: for the throne is established by righteousness.రాజులు దుష్టక్రియలు చేయుట హేయమైనది నీతివలన సింహాసనము స్థిరపరచబడును.

13 Righteous lips are the delight of kings; and they love him that speaketh right.నీతిగల పెదవులు రాజులకు సంతోషకరములు యథార్థవాదులు వారికి ప్రియులు.

14 The wrath of a king is as messengers of death: but a wise man will pacify it.రాజు క్రోధము మరణదూత జ్ఞానియైనవాడు ఆ క్రోధమును శాంతిపరచును.

15 In the light of the king's countenance is life; and his favour is as a cloud of the latter rain.రాజుల ముఖప్రకాశమువలన జీవము కలుగును వారి కటాక్షము కడవరి వానమబ్బు.

16 How much better is it to get wisdom than gold! and to get understanding rather to be chosen than silver!అపరంజిని సంపాదించుటకంటె జ్ఞానమును సంపా దించుట ఎంతో శ్రేష్ఠము వెండిని సంపాదించుటకంటె తెలివిని సంపాదించుట ఎంతో మేలు.

17 The highway of the upright is to depart from evil: he that keepeth his way preserveth his soul.చెడుతనము విడిచి నడచుటయే యథార్థవంతులకు రాజమార్గము తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును.

18 Pride goeth before destruction, and an haughty spirit before a fall.నాశనమునకు ముందు గర్వము నడచును. పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడచును

19 Better it is to be of an humble spirit with the lowly, than to divide the spoil with the proud.గర్విష్ఠులతో దోపుడుసొమ్ము పంచుకొనుటకంటె దీనమనస్సు కలిగి దీనులతో పొత్తుచేయుట మేలు.

20 He that handleth a matter wisely shall find good: and whoso trusteth in the LORD, happy is he.ఉపదేశమునకు చెవి యొగ్గువాడు మేలునొందును యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు.

21 The wise in heart shall be called prudent: and the sweetness of the lips increaseth learning.జ్ఞానహృదయుడు వివేకి యనబడును రుచిగల మాటలు పలుకుటవలన విద్యయెక్కువగును.

22 Understanding is a wellspring of life unto him that hath it: but the instruction of fools is folly.తెలివిగలవానికి వాని తెలివి జీవపు ఊట మూఢులకు వారి మూఢత్వమే శిక్ష

23 The heart of the wise teacheth his mouth, and addeth learning to his lips.జ్ఞానుని హృదయము వానినోటికి తెలివి కలిగించును వాని పెదవులకు విద్య విస్తరింపజేయును.

24 Pleasant words are as an honeycomb, sweet to the soul, and health to the bones.ఇంపైన మాటలు తేనెపట్టువంటివి అవి ప్రాణమునకు మధురమైనవి యెముకలకు ఆరోగ్య కరమైనవి.

25 There is a way that seemeth right unto a man, but the end thereof are the ways of death.ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును అయినను తుదకు అది మరణమునకు చేరును.

26 He that laboureth laboureth for himself; for his mouth craveth it of him.కష్టము చేయువాని ఆకలి వానికొరకు వానిచేత కష్టము చేయించును వాని కడుపు వానిని తొందరపెట్టును.

27 An ungodly man diggeth up evil: and in his lips there is as a burning fire.పనికిమాలినవాడు కీడును త్రవ్వి పైకెత్తును వాని పెదవులమీద అగ్ని మండుచున్నట్టున్నది.

28 A froward man soweth strife: and a whisperer separateth chief friends.మూర్ఖుడు కలహము పుట్టించును కొండెగాడు మిత్రభేదము చేయును.

29 A violent man enticeth his neighbour, and leadeth him into the way that is not good.బలాత్కారి తన పొరుగువానిని లాలనచేయును కానిమార్గములో వాని నడిపించును.

30 He shutteth his eyes to devise froward things: moving his lips he bringeth evil to pass.కృత్రిమములు కల్పింపవలెనని కన్నులు మూసికొని తన పెదవులు బిగబట్టువాడే కీడు పుట్టించువాడు.

31 The hoary head is a crown of glory, if it be found in the way of righteousness.నెరసిన వెండ్రుకలు సొగసైన కిరీటము అవి నీతిప్రవర్తన గలవానికి కలిగి యుండును.

32 He that is slow to anger is better than the mighty; and he that ruleth his spirit than he that taketh a city.పరాక్రమశాలికంటె దీర్ఘశాంతముగలవాడు శ్రేష్ఠుడు పట్టణము పట్టుకొనువానికంటె తన మనస్సును స్వాధీన పరచుకొనువాడు శ్రేష్ఠుడు

33 The lot is cast into the lap; but the whole disposing thereof is of the LORD.చీట్లు ఒడిలో వేయబడును వాటివలని తీర్పు యెహోవా వశము.

Telugu Bible