Numbers 29 - DBY (Telugu)
1 And in the seventh month, on the first of the month, ye shall have a holy convocation: no manner of servile work shall ye do; a day of blowing the trumpets shall it be unto you.ఏడవ నెల మొదటితేదిన మీరు పరిశుద్ధసంఘముగా కూడవలెను.
2 And ye shall offer a burnt-offering for a sweet odour to Jehovah: one young bullock, one ram, seven yearling lambs without blemish;మీరు జీవనోపాధియైన పనులేమియు చేయకూడదు; అది మీకు శృంగధ్వని దినము.
3 and their oblation of fine flour mingled with oil, three tenth parts for the bullock, two tenth parts for the ram,నిర్దోష మైన ఒక కోడెదూడను ఒక పొట్టేలును యెహోవాకు ఇంపైన సువాసనగల దహనబలిగా అర్పింపవలెను.
4 and one tenth part for each lamb of the seven lambs;వాటి వాటి విధిప్రకారముగా అమావాస్యకు అర్పించు దహన బలియు దాని నైవేద్యమును, నిత్య మైన దహనబలియు దాని నైవేద్యమును వాటి పానార్పణములును గాక మీరు నిర్దోషమైన యేడాదివగు ఏడు మగ గొఱ్ఱపిల్లలను యెహో వాకు, ఇంపైన సువాసనగల దహనబలిగా అర్పింపవలెను.
5 and one buck of the goats for a sin-offering, to make atonement for you,వాటి నైవేద్యము నూనెతో కలుపబడిన గోధుమపిండి ప్రతి కోడెదూడతో తూములో మూడు పదియవవంతు లను, పొట్టేలుకు రెండు పదియవవంతులను,
6 -- besides the monthly burnt-offering and its oblation, and the continual burnt-offering and its oblation, and their drink-offerings, according to their ordinance, for a sweet odour, an offering by fire to Jehovah.ఏడు గొఱ్ఱ పిల్లలలో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క పదియవ వంతును మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడుటకై పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను.
7 And on the tenth of this seventh month ye shall have a holy convocation; and ye shall afflict your souls; no manner of work shall ye do.ఈ యేడవ నెల పదియవ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అప్పుడు మిమ్మును మీరు దుఃఖపరచుకొనవలెను; ఏపనియు చేయకూడదు.
8 And ye shall present a burnt-offering to Jehovah for a sweet odour: one young bullock, one ram, seven yearling lambs (without blemish shall they be unto you);ప్రాయ శ్చిత్తము కలుగుటకై పాపపరిహారార్థబలియు నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును వాటి వాటి పానార్ప ణములునుగాక, మీరు ఒక కోడెదూడను ఒక పొట్టేలును ఏడాదివైన యేడు గొఱ్ఱపిల్లలను యెహోవాకు ఇంపైన సువాసనగల దహనబలిగా అర్పింపవలెను. అవి మీకున్న వాటిలో నిర్దోషమైనవై యుండవలెను.
9 and their oblation of fine flour mingled with oil, three tenth parts for the bullock, two tenth parts for the ram,నూనెతో కలుప బడిన పిండిని నైవేద్య ముగాను ప్రతి కోడెతో తూములో మూడు పదియవ వంతులను ఒక పొట్టేలుతో రెండు పది యవవంతులను
10 one tenth part for each lamb, of the seven lambs;ఆ యేడు గొఱ్ఱపిల్లలలో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క పదియవవంతును
11 [and] one buck of the goats for a sin-offering, -- besides the sin-offering of atonement, and the continual burnt-offering and its oblation, and their drink-offerings.పాపపరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను అర్పింపవలెను.
12 And on the fifteenth day of the seventh month ye shall have a holy convocation: no manner of servile work shall ye do; and ye shall celebrate a feast to Jehovah seven days;మరియు ఏడవ నెల పదునయిదవ దినమున మీరు పరిశుద్ధసంఘముగా కూడవలెను. అప్పుడు మీరు జీవనో పాధియైన పనులేమియు చేయక యేడు దినములు యెహో వాకు పండుగ ఆచరింపవలెను.
13 and ye shall present a burnt-offering, an offering by fire for a sweet odour to Jehovah: thirteen young bullocks, two rams, fourteen yearling lambs (they shall be without blemish);నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును దాని పానార్పణమును గాక, యెహో వాకు ఇంపైన సువాసనగల దహనబలిగా పదమూడు కోడెదూడలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొఱ్ఱ పిల్లలను అర్పింపవలెను. అవి నిర్దోషమైనవై యుండవలెను.
14 and their oblation of fine flour mingled with oil: three tenth parts for each bullock of the thirteen bullocks, two tenth parts for each ram of the two rams,నూనెతో కలుపబడిన గోధుమపిండిని నైవేద్యముగాను ఆ పదమూడు కోడెదూడలలో ప్రతి దూడతో తూములో మూడు పదియవవంతులను ఆ రెండు పొట్టేళ్లలో ప్రతి పొట్టేలుతో రెండు పదియవవంతులను
15 and one tenth part for each lamb of the fourteen lambs;ఆ పదునాలుగు గొఱ్ఱపిల్లలలో ప్రతి పిల్లతో ఒక్కొక్క పదియవవంతును పాపపరిహారార్థబలిగా
16 and one buck of the goats for a sin-offering, -- besides the continual burnt-offering, its oblation and its drink-offering.ఒక మేక పిల్లను అర్పింవలెను.
17 And on the second day, [ye shall present] twelve young bullocks, two rams, fourteen yearling lambs without blemish;రెండవ దినమున నిత్యమైన దహనబలియు దాని నైవేద్య మును వాటి పానార్పణములును గాక మీరు నిర్దోషమైన పండ్రెండుకోడెదూడలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొఱ్ఱ పిల్లలను విధిప్రకారముగా,
18 and their oblation and their drink-offerings for the bullocks, for the rams, and for the lambs, by their number, according to the ordinance;వాటి వాటి లెక్కచొప్పున, ఆ కోడెలతోను పొట్టేళ్లతోను గొఱ్ఱపిల్లలతోను వాటి వాటి నైవేద్యమును
19 and one buck of the goats for a sin-offering, -- besides the continual burnt-offering and its oblation, and their drink-offerings.పానార్ప ణములను పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను అర్పింప వలెను.
20 And on the third day, eleven bullocks, two rams, fourteen yearling lambs without blemish;మూడవ దినమున నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును దాని పానార్పణమును గాక నిర్దోషమైన పదకొండు కోడెలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొఱ్ఱపిల్లలను
21 and their oblation and their drink-offerings for the bullocks, for the rams, and for the lambs, by their number, according to the ordinance;విధి ప్రకారముగా వాటి వాటి లెక్కచొప్పున, ఆ కోడెలతోను పొట్టేళ్లతోను గొఱ్ఱ పిల్లలతోను వాటి నైవేద్యమును పానార్పణములను
22 and one he-goat for a sin-offering, -- besides the continual burnt-offering and its oblation and its drink-offering.పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను.
23 And on the fourth day, ten bullocks, two rams, fourteen yearling lambs without blemish;నాలుగవ దినమున నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును పానార్పణమును గాక నిర్దోషమైన పది కోడెలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొఱ్ఱపిల్లలను విధి ప్రకారముగా, వాటి వాటి లెక్క చొప్పున,
24 their oblation and their drink-offerings for the bullocks, for the rams, and for the lambs, by their number, according to the ordinance;ఆ కోడెలతోను పొట్టేళ్లతోను గొఱ్ఱపిల్లల తోను వాటి నైవేద్యమును పానార్పణములను
25 and one buck of the goats for a sin-offering, -- besides the continual burnt-offering, its oblation and its drink-offering.పాప పరిహారార్థబలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను.
26 And on the fifth day, nine bullocks, two rams, fourteen yearling lambs without blemish;అయిదవ దినమున నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును పానార్పణమును గాక నిర్దోషమైన తొమి్మది కోడెలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొఱ్ఱపిల్లలను విధి ప్రకారముగా, వాటి వాటి లెక్కచొప్పున,
27 and their oblation and their drink-offerings for the bullocks, for the rams, and for the lambs, by their number, according to the ordinance;ఆ కోడెలతోను పొట్టేళ్లతోను గొఱ్ఱ పిల్లలతోను
28 and one he-goat for a sin-offering, -- besides the continual burnt-offering and its oblation and its drink-offering.వాటి వాటి నైవేద్యమును పానార్పణము లను పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను అర్పింప వలెను.
29 And on the sixth day, eight bullocks, two rams, fourteen yearling lambs without blemish;ఆరవ దినమున నిత్యమైన దహనబలియు దాని నైవేద్య మును పానార్పణమును గాక నిర్దోషమైన యెనిమిది కోడె లను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొఱ్ఱ పిల్లలను విధి ప్రకారముగా, వాటి వాటి లెక్కచొప్పున,
30 and their oblation and their drink-offerings for the bullocks, for the rams, and for the lambs, by their number, according to the ordinance;ఆ కోడెలతోను పొట్టేళ్లతోను గొఱ్ఱపిల్లలతోను వాటి వాటి నైవేద్యమును పానార్పణములను
31 and one he-goat for a sin-offering, -- besides the continual burnt-offering, its oblation and its drink-offerings.పాపపరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను అర్పింపవలెను.
32 And on the seventh day, seven bullocks, two rams, fourteen yearling lambs without blemish;ఏడవ దినమున నిత్యమైన దహనబలియు దాని నైవేద్య మును పానార్పణమును గాక నిర్దోషమైన యేడు దూడ లను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొఱ్ఱ పిల్లలను విధి ప్రకారముగా, వాటి వాటి లెక్కచొప్పున,
33 and their oblation and their drink-offerings for the bullocks, for the rams, and for the lambs, by their number, according to their ordinance;ఆ కోడెలతోను పొట్టేళ్లతోను గొఱ్ఱపిల్లల తోను వాటి వాటి నైవేద్యమును పానార్పణములను
34 and one he-goat for a sin-offering, -- besides the continual burnt-offering, its oblation and its drink-offering.పాపపరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను అర్పింపవలెను.
35 On the eighth day ye shall have a solemn assembly: no manner of servile work shall ye do.ఎనిమిదవ దినము మీకు వ్రతదినముగానుండును. అప్పుడు మీరు జీవనోపాధియైన పనులనేమియు చేయ కూడదు.
36 And ye shall present a burnt-offering, an offering by fire of a sweet odour to Jehovah: one bullock, one ram, seven yearling lambs without blemish;అందులో నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును పానార్పణమునుగాక మీరు యెహోవాకు ఇంపైన సువాసనగల దహనబలిగా నిర్దోషమైన యొక కోడెదూడను ఒక పొట్టేలును ఏడాదివైన యేడు గొఱ్ఱపిల్లలను విధి ప్రకారముగా, వాటి వాటి లెక్కచొప్పున,
37 their oblation and their drink-offerings for the bullock, for the ram, and for the lambs, by their number, according to the ordinance;ఆ కోడెదూడతోను పొట్టేలుతోను గొఱ్ఱపిల్లలతోను
38 and one he-goat for a sin-offering, -- besides the continual burnt-offering and its oblation and its drink-offering.వాటి వాటి నైవేద్యమును పానార్పణ ములను పాపపరి హారార్థబలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను.
39 These shall ye offer to Jehovah in your set feasts, besides your vows, and your voluntary-offerings, for your burnt-offerings, and for your oblations, and for your drink-offerings, and for your peace-offerings.మీ మ్రొక్కుబళ్లను మీ స్వేచ్ఛార్పణములను మీ దహనబలులను మీ నైవేద్యములను మీ పానార్పణములను మీ సమాధానబలులను గాక వీటిని నియామక కాలములందు యెహోవాకు అర్పింవలెను.
40 And Moses told the children of Israel according to all that Jehovah had commanded Moses.యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే ఇశ్రాయేలీయులతో సమస్తమును తెలియజెప్పెను.
Telugu Bible