Bible

Numbers 2 - YLT (Telugu)

1 And Jehovah speaketh unto Moses, and unto Aaron, saying,మరియు యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను.

2 `Each by his standard, with ensigns of the house of their fathers, do the sons of Israel encamp; over-against round about the tent of meeting they encamp.'ఇశ్రాయేలీయులందరు తమ తమ పితరుల కుటుంబముల టెక్కెములను పట్టుకొని తమ తమ ధ్వజము నొద్ద దిగవలెను, వారు ప్రత్యక్షపు గుడారమున కెదురుగా దానిచుట్టు దిగవలెను.

3 And those encamping eastward towards the sun-rising, `are of' the standard of the camp of Judah, by their hosts; and the prince of the sons of Judah `is' Nahshon, son of Amminadab;సూర్యుడు ఉదయించు తూర్పు దిక్కున యూదా పాళెపు ధ్వజము గలవారు తమ తమ సేనలచొప్పున దిగవలెను. అమీ్మనాదాబు కుమారుడైన నయస్సోను యూదా కుమారులకు ప్రధానుడు.

4 and his host, and their numbered ones, `are' four and seventy thousand and six hundred.అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడిన పురుషులు డెబ్బది నాలుగువేల ఆరువందలమంది.

5 And those encamping by him `are of' the tribe of Issachar; and the prince of the sons of Issachar `is' Nethaneel son of Zuar;అతని సమీపమున ఇశ్శాఖారు గోత్రికులు దిగవలెను. సూయారు కుమారు డైన నెతనేలు ఇశ్శాఖారు కుమారులకు ప్రధానుడు.

6 and his host, and its numbered ones, `are' four and fifty thousand and four hundred.అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడిన పురుషులు ఏబది నాలుగు వేల నాలుగువందలమంది.

7 The tribe of Zebulun; and the prince of the sons of Zebulun `is' Eliab son of Helon;అతని సమీపమున జెబూలూనుగోత్రికులుండవలెను. హేలోను కుమారుడైన ఏలీయాబు జెబూలూనీయులకు ప్రధానుడు.

8 and his host, and its numbered ones, `are' seven and fifty thousand and four hundred;అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడినవారు ఏబదియేడువేల నాలుగు వందలమంది.

9 all those numbered of the camp of Judah `are' a hundred thousand, and eighty thousand, and six thousand, and four hundred, by their hosts; they journey first.యూదా పాళెములో లెక్కింప బడిన వారందరు వారి సేనలచొప్పున లక్షయెనుబది యారు వేల నాలుగువందలమంది. వారు ముందర సాగి నడవవలెను.

10 The standard of the camp of Reuben `is' southward, by their hosts; and the prince of the sons of Reuben `is' Elizur son of Shedeur;రూబేను పాళెపు ధ్వజము వారి సేనలచొప్పున దక్షిణ దిక్కున ఉండవలెను. షెదేయూరు కుమారుడైన ఏలీసూరు రూబేను కుమారులకు ప్రధానుడు.

11 and his host, and its numbered ones, `are' six and forty thousand and five hundred.అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడినవారు నలుబది యారువేల ఐదువందలమంది.

12 And those encamping by him `are of' the tribe of Simeon; and the prince of the sons of Simeon `is' Shelumiel son of Zurishaddai;అతని సమీపమున షిమ్యోను గోత్రి కులు దిగవలెను. సూరీషద్దాయి కుమారుడైన షెలుమీ యేలు షిమ్యోను కుమారులకు ప్రధానుడు.

13 and his host, and their numbered ones, `are' nine and fifty thousand and three hundred.అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు ఏబది తొమి్మది వేల మూడు వందలమంది.

14 And the tribe of Gad; and the prince of the sons of Gad `is' Eliasaph son of Reuel;అతని సమీపమున గాదు గోత్ర ముండవలెను. రగూయేలు కుమారుడైన ఎలీయా సాపు గాదు కుమారులకు ప్రధానుడు.

15 and his host, and their numbered ones, `are' five and forty thousand and six hundred and fifty.అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు నలుబది యయిదు వేల ఆరువందల ఏబదిమంది.

16 All those numbered of the camp of Reuben `are' a hundred thousand, and one and fifty thousand, and four hundred and fifty, by their hosts; and they journey second.రూబేను పాళె ములో లెక్కింపబడిన వారందరు వారి సేనలచొప్పున లక్షయేబది యొకవేయి నాలుగువందల ఏబదిమంది. వారు రెండవతెగలో సాగినడవవలెను.

17 And the tent of meeting -- the camp of the Levites -- hath journeyed in the midst of the camps; as they encamp so they journey, each at his station by their standards.ప్రత్యక్షపు గుడారము లేవీయుల పాళెముతో పాళెముల నడుమను సాగి నడవవలెను. వారెట్లు దిగుదురో అట్లే తమ తమ ధ్వజములనుబట్టి ప్రతివాడును తన తన వరుసలో సాగి నడవవలెను.

18 The standard of the camp of Ephraim, by their hosts, `is' westward; and the prince of the sons of Ephraim `is' Elishama son of Ammihud;ఎఫ్రాయిము సేనలచొప్పున వారి పాళెపుధ్వజము పడమటిదిక్కున ఉండవలెను. అమీహూదు కుమారు డైన ఎలీషామా ఎఫ్రాయిము కుమారులకు ప్రధానుడు.

19 and his host, and their numbered ones, `are' forty thousand and five hundred.అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు నలుబదివేల ఐదువందలమంది.

20 And by him `is' the tribe of Manasseh; and the prince of the sons of Manasseh `is' Gamaliel son of Pedahzur;అతని సమీపమున మనష్షే గోత్రముండవలెను. పెదాసూరు కుమారుడైన గమలీ యేలు మనష్షే కుమారులలో ప్రధానుడు.

21 and his host, and their numbered ones, `are' two and thirty thousand, and two hundred.​అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడినవారు ముప్పది రెండు వేల రెండువందలమంది.

22 And the tribe of Benjamin; and the prince of the sons of Benjamin `is' Abidan son of Gideoni;అతని సమీపమున బెన్యామీను గోత్రముండవలెను. గిద్యోనీ కుమారుడైన అబీదాను బెన్యామీను కుమారులకు ప్రధానుడు.

23 and his host, and their numbered ones, `are' five and thirty thousand and four hundred.​అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు ముప్పది యయిదువేల నాలుగు వందలమంది.

24 All those numbered of the camp of Ephraim `are' a hundred thousand, and eight thousand, and a hundred, by their hosts; and they journey third.​ఎఫ్రాయిము పాళె ములో లెక్కింపబడిన వారందరు వారి సేనలచొప్పున లక్షయెనిమిదివేల నూరుమంది. వారు మూడవగుంపులో సాగి నడవవలెను.

25 The standard of the camp of Dan `is' northward, by their hosts; and the prince of the sons of Dan `is' Ahiezer son of Ammishaddai;దాను పాళెపుధ్వజము వారి సేనలచొప్పున ఉత్తర దిక్కున ఉండవలెను. అమీషదాయి కుమారుడైన అహీ యెజెరు దాను కుమారులకు ప్రధానుడు.

26 and his host, and their numbered ones, `are' two and sixty thousand and seven hundred.అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడినవారు అరువది రెండు వేల ఏడువందలమంది.

27 And those encamping by him `are of' the tribe of Asher; and the prince of the sons of Asher `is' Pagiel son of Ocran;అతని సమీపమున ఆషేరు గోత్రికులు దిగవలెను. ఒక్రాను కుమారుడైన పగీయేలు ఆషేరు కుమారులకు ప్రధానుడు.

28 and his host, and their numbered ones, `are' one and forty thousand and five hundred.అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు నలుబదియొకవేయి ఐదువందలమంది.

29 And the tribe of Naphtali; and the prince of the sons of Naphtali `is' Ahira son of Enan;అతని సమీపమున నఫ్తాలి గోత్రికు లుండవలెను. ఏనాను కుమారుడైన అహీర నఫ్తాలి కుమా రులకు ప్రధానుడు.

30 and his host, and their numbered ones, `are' three and fifty thousand and four hundred.అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు ఏబదిమూడువేల నాలుగువందల మంది.

31 All those numbered of the camp of Dan `are' a hundred thousand, and seven and fifty thousand, and six hundred; at the rear they journey, by their standards.దాను పాళెములో లెక్కింపబడినవారందరు లక్ష యేబదియేడువేల ఆరువందలమంది. వారు తమ ధ్వజముల ప్రకారము కడపటి గుంపులో నడవవలెను.

32 These `are' those numbered of the sons of Israel by the house of their fathers; all those numbered of the camps by their hosts `are' six hundred thousand, and three thousand, and five hundred and fifty.వీరు ఇశ్రాయేలీయులలో తమ తమ పితరుల కుటుంబ ముల ప్రకారము లెక్కింపబడినవారు. తమ తమ సేనల చొప్పున తమ తమ పాళెములలో లెక్కింపబడినవారందరు ఆరులక్షల మూడువేల ఐదువందల ఏబదిమంది.

33 And the Levites have not numbered themselves in the midst of the sons of Israel, as Jehovah hath commanded Moses.అయితే యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు లేవీయులు ఇశ్రా యేలీయులలో తమ్మును లెక్కించుకొనలేదు.

34 And the sons of Israel do according to all that Jehovah hath commanded Moses; so they have encamped by their standards, and so they have journeyed; each by his families, by the house of his fathers.అట్లు ఇశ్రా యేలీయులు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సమస్త మును చేసిరి. అట్లు వారు తమ తమ వంశములచొప్పునను తమ తమ పితరుల కుటుంబముల చొప్పునను ప్రతివాడు తన తన ధ్వజమునుబట్టి దిగుచు సాగుచు నుండిరి.

Telugu Bible