Bible

Numbers 2 - BBE (Telugu)

1 And the Lord said to Moses and Aaron,మరియు యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను.

2 The children of Israel are to put up their tents in the order of their families, by the flags of their fathers' houses, facing the Tent of meeting on every side.ఇశ్రాయేలీయులందరు తమ తమ పితరుల కుటుంబముల టెక్కెములను పట్టుకొని తమ తమ ధ్వజము నొద్ద దిగవలెను, వారు ప్రత్యక్షపు గుడారమున కెదురుగా దానిచుట్టు దిగవలెను.

3 Those whose tents are on the east side, looking to the dawn, will be round the flag of the children of Judah, with Nahshon, the son of Amminadab, as their chief.సూర్యుడు ఉదయించు తూర్పు దిక్కున యూదా పాళెపు ధ్వజము గలవారు తమ తమ సేనలచొప్పున దిగవలెను. అమీ్మనాదాబు కుమారుడైన నయస్సోను యూదా కుమారులకు ప్రధానుడు.

4 The number of his army was seventy-four thousand, six hundred.అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడిన పురుషులు డెబ్బది నాలుగువేల ఆరువందలమంది.

5 And nearest to him will be the tribe of Issachar, with Nethanel, the son of Zuar, as their chief.అతని సమీపమున ఇశ్శాఖారు గోత్రికులు దిగవలెను. సూయారు కుమారు డైన నెతనేలు ఇశ్శాఖారు కుమారులకు ప్రధానుడు.

6 The number of his army was fifty-four thousand, four hundred.అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడిన పురుషులు ఏబది నాలుగు వేల నాలుగువందలమంది.

7 After him, the tribe of Zebulun, with Eliab, the son of Helon, as their chief.అతని సమీపమున జెబూలూనుగోత్రికులుండవలెను. హేలోను కుమారుడైన ఏలీయాబు జెబూలూనీయులకు ప్రధానుడు.

8 The number of his army was fifty-seven thousand, four hundred.అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడినవారు ఏబదియేడువేల నాలుగు వందలమంది.

9 The number of all the armies of Judah was a hundred and eighty-six thousand, four hundred. They go forward first.యూదా పాళెములో లెక్కింప బడిన వారందరు వారి సేనలచొప్పున లక్షయెనుబది యారు వేల నాలుగువందలమంది. వారు ముందర సాగి నడవవలెను.

10 On the south side is the flag of the children of Reuben, in the order of their armies, with Elizur, the son of Shedeur, as their chief.రూబేను పాళెపు ధ్వజము వారి సేనలచొప్పున దక్షిణ దిక్కున ఉండవలెను. షెదేయూరు కుమారుడైన ఏలీసూరు రూబేను కుమారులకు ప్రధానుడు.

11 The number of his army was forty-six thousand, five hundred.అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడినవారు నలుబది యారువేల ఐదువందలమంది.

12 And nearest to him, the tribe of Simeon, with Shelumiel, the son of Zurishaddai, as their chief.అతని సమీపమున షిమ్యోను గోత్రి కులు దిగవలెను. సూరీషద్దాయి కుమారుడైన షెలుమీ యేలు షిమ్యోను కుమారులకు ప్రధానుడు.

13 The number of his army was fifty-nine thousand, three hundred.అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు ఏబది తొమి్మది వేల మూడు వందలమంది.

14 Then the tribe of Gad, with Eliasaph, son of Reuel, as their chief.అతని సమీపమున గాదు గోత్ర ముండవలెను. రగూయేలు కుమారుడైన ఎలీయా సాపు గాదు కుమారులకు ప్రధానుడు.

15 The number of his army was forty-five thousand, six hundred and fifty.అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు నలుబది యయిదు వేల ఆరువందల ఏబదిమంది.

16 The number of all the armies of Reuben together came to a hundred and fifty-one thousand, four hundred and fifty. They go forward second.రూబేను పాళె ములో లెక్కింపబడిన వారందరు వారి సేనలచొప్పున లక్షయేబది యొకవేయి నాలుగువందల ఏబదిమంది. వారు రెండవతెగలో సాగినడవవలెను.

17 Then the Tent of meeting is to go forward, with the tents of the Levites, in the middle of the armies; in the same order as their tents are placed, they are to go forward, every man under his flag.ప్రత్యక్షపు గుడారము లేవీయుల పాళెముతో పాళెముల నడుమను సాగి నడవవలెను. వారెట్లు దిగుదురో అట్లే తమ తమ ధ్వజములనుబట్టి ప్రతివాడును తన తన వరుసలో సాగి నడవవలెను.

18 On the west side will be the flag of the children of Ephraim, with Elishama, the son of Ammihud, as their chief.ఎఫ్రాయిము సేనలచొప్పున వారి పాళెపుధ్వజము పడమటిదిక్కున ఉండవలెను. అమీహూదు కుమారు డైన ఎలీషామా ఎఫ్రాయిము కుమారులకు ప్రధానుడు.

19 The number of his army was forty thousand, five hundred.అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు నలుబదివేల ఐదువందలమంది.

20 And by him the tribe of Manasseh with Gamaliel, the son of Pedahzur, as their chief.అతని సమీపమున మనష్షే గోత్రముండవలెను. పెదాసూరు కుమారుడైన గమలీ యేలు మనష్షే కుమారులలో ప్రధానుడు.

21 The number of his army was thirty-two thousand, two hundred.​అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడినవారు ముప్పది రెండు వేల రెండువందలమంది.

22 Then the tribe of Benjamin, with Abidan, the son of Gideoni, as their chief.అతని సమీపమున బెన్యామీను గోత్రముండవలెను. గిద్యోనీ కుమారుడైన అబీదాను బెన్యామీను కుమారులకు ప్రధానుడు.

23 The number of his army was thirty-five thousand, four hundred.​అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు ముప్పది యయిదువేల నాలుగు వందలమంది.

24 The number of all the armies of Ephraim was a hundred and eight thousand, one hundred. They go forward third.​ఎఫ్రాయిము పాళె ములో లెక్కింపబడిన వారందరు వారి సేనలచొప్పున లక్షయెనిమిదివేల నూరుమంది. వారు మూడవగుంపులో సాగి నడవవలెను.

25 On the north side will be the flag of the children of Dan, with Ahiezer, the son of Ammishaddai, as their chief.దాను పాళెపుధ్వజము వారి సేనలచొప్పున ఉత్తర దిక్కున ఉండవలెను. అమీషదాయి కుమారుడైన అహీ యెజెరు దాను కుమారులకు ప్రధానుడు.

26 The number of his army was sixty-two thousand, seven hundred.అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడినవారు అరువది రెండు వేల ఏడువందలమంది.

27 Nearest to him will be the tribe of Asher, with Pagiel, the son of Ochran, as their chief.అతని సమీపమున ఆషేరు గోత్రికులు దిగవలెను. ఒక్రాను కుమారుడైన పగీయేలు ఆషేరు కుమారులకు ప్రధానుడు.

28 The number of his army was forty-one thousand, five hundred;అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు నలుబదియొకవేయి ఐదువందలమంది.

29 Then the tribe of Naphtali, with Ahira, the son of Enan, as their chief.అతని సమీపమున నఫ్తాలి గోత్రికు లుండవలెను. ఏనాను కుమారుడైన అహీర నఫ్తాలి కుమా రులకు ప్రధానుడు.

30 The number of his army was fifty-three thousand, four hundred.అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు ఏబదిమూడువేల నాలుగువందల మంది.

31 The number of all the armies in the tents of Dan was a hundred and fifty-seven thousand, six hundred. They will go forward last, by their flags.దాను పాళెములో లెక్కింపబడినవారందరు లక్ష యేబదియేడువేల ఆరువందలమంది. వారు తమ ధ్వజముల ప్రకారము కడపటి గుంపులో నడవవలెను.

32 These are all who were numbered of the children of Israel, in the order of their fathers' families: all the armies in their tents together came to six hundred and three thousand, five hundred and fifty.వీరు ఇశ్రాయేలీయులలో తమ తమ పితరుల కుటుంబ ముల ప్రకారము లెక్కింపబడినవారు. తమ తమ సేనల చొప్పున తమ తమ పాళెములలో లెక్కింపబడినవారందరు ఆరులక్షల మూడువేల ఐదువందల ఏబదిమంది.

33 But the Levites were not numbered among the children of Israel, as the Lord said to Moses.అయితే యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు లేవీయులు ఇశ్రా యేలీయులలో తమ్మును లెక్కించుకొనలేదు.

34 So the children of Israel did as the Lord said to Moses, so they put up their tents by their flags, and they went forward in the same order, by their families, and by their fathers' houses.అట్లు ఇశ్రా యేలీయులు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సమస్త మును చేసిరి. అట్లు వారు తమ తమ వంశములచొప్పునను తమ తమ పితరుల కుటుంబముల చొప్పునను ప్రతివాడు తన తన ధ్వజమునుబట్టి దిగుచు సాగుచు నుండిరి.

Telugu Bible