Bible

Numbers 13 - WBT (Telugu)

1 And the LORD spoke to Moses, saying,యెహోవా మోషేకు ఈలాగున సెలవిచ్చెను

2 Send thou men, that they may search the land of Canaan, which I give to the children of Israel: of every tribe of their fathers shall ye send a man, every one a ruler among them.నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న కనానుదేశమును సంచరించి చూచుటకు నీవు మనుష్యులను పంపుము. వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుష్యుని మీరు పంపవలెను; వారిలో ప్రతివాడు ప్రధానుడై యుండవలెను.

3 And Moses, by the commandment of the LORD, sent them from the wilderness of Paran: all those men were heads of the children of Israel.మోషే యెహోవా మాట విని, పారాను అరణ్యమునుండి వారిని పంపెను. వారందరు ఇశ్రాయేలీయులలో ముఖ్యులు.

4 And these were their names: Of the tribe of Reuben, Shammua the son of Zaccur.వారి పేళ్లు ఏవనగారూబేను గోత్ర మునకు

5 Of the tribe of Simeon, Shaphat the son of Hori.​జక్కూరు కుమారుడైన షమ్మూయ; షిమ్యోను గోత్రమునకు హోరీ కుమారుడైన షాపాతు;

6 Of the tribe of Judah, Caleb the son of Jephunneh.యూదా గోత్రమునకు యెఫున్నె కుమారు డైన కాలేబు;

7 Of the tribe of Issachar, Igal the son of Joseph.ఇశ్శాఖారు గోత్రమునకు యోసేపు కుమారుడైన ఇగాలు;

8 Of the tribe of Ephraim, Oshea the son of Nun.ఎఫ్రాయిము గోత్రమునకు నూను కుమారుడైన హోషేయ;

9 Of the tribe of Benjamin, Palti the son of Raphu.బెన్యామీను గోత్రమునకు రాఫు కుమారుడైన పల్తీ;

10 Of the tribe of Zebulun, Gaddiel the son of Sodi.జెబూలూను గోత్రమునకు సోరీ కుమారుడైన గదీయేలు;

11 Of the tribe of Joseph, namely, of the tribe of Manassah, Gaddi the son of Susi.​యోసేపు గోత్రమునకు, అనగా మనష్షే గోత్రమునకు సూసీ కుమారుడైన గదీ;

12 Of the tribe of Dan, Ammiel the son of Gemalli.​దాను గోత్రమునకు గెమలి కుమారుడైన అమీ్మయేలు;

13 Of the tribe of Asher, Sethur the son of Michael.ఆషేరు గోత్రమునకు మిఖాయేలు కుమారుడైన సెతూరు;

14 Of the tribe of Naphtali, Nahbi the son of Vophsi.నఫ్తాలి గోత్రమునకు వాపెసీ కుమారుడైన నహబీ;

15 Of the tribe of Gad, Geuel the son of Machi.గాదు గోత్రమునకు మాకీ కుమారుడైన గెయువేలు అనునవి.

16 These are the names of the men whom Moses sent to explore the land. And Moses called Oshea the son of Nun Jehoshua.​దేశమును సంచరించి చూచుటకు మోషే పంపిన మనుష్యుల పేళ్లు ఇవి. మోషే నూను కుమారుడైన హోషేయకు యెహోషువ అను పేరు పెట్టెను.

17 And Moses sent them to explore the land of Canaan, and said to them, Go ye up this way southward, and ascend the mountain:మోషే కనానుదేశమును సంచరించి చూచుటకు వారిని పంపి నప్పుడు వారితో ఇట్లనెనుమీరు ధైర్యము తెచ్చుకొని దాని దక్షిణదిక్కున ప్రవేశించి ఆ కొండ యెక్కి ఆ దేశము ఎట్టిదో

18 And see the land, what it is; and the people that dwell therein, whether they are strong or weak, few or many;​దానిలో నివసించు జనము బలముగలదో బలములేనిదో, కొంచెమైనదో విస్తారమైనదో

19 And what the land is that they dwell in, whether it is good or bad; and what cities they are that they dwell in, whether in tents, or in strong holds;వారు నివసించు భూమి యెట్టిదో అది మంచిదో చెడ్డదో, వారు నివసించు పట్టణములు ఎట్టివో, వారు గుడారము లలో నివసించుదురో, కోటలలో నివసించుదురో, ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో,

20 And what the land is, whether it is fertile or barren, whether there is wood in it, or not. And be ye of good courage, and bring of the fruit of the land. Now the time was the time of the first ripe grapes.దానిలో చెట్లు న్నవో లేవో కనిపెట్టవలెను. మరియు మీరు ఆ దేశపు పండ్లలో కొన్ని తీసికొనిరండని చెప్పెను. అది ద్రాక్షల ప్రథమ పక్వకాలము

21 So they went up, and searched the land from the wilderness of Zin to Rehob, as men come to Hamath.​కాబట్టి వారు వెళ్లి సీను అరణ్యము మొదలుకొని హమాతుకు పోవు మార్గముగా రెహోబువరకు దేశసంచారముచేసి చూచిరి.

22 And they ascended by the south, and came to Hebron; where Ahiman, Sheshai, and Talmai, the children of Anak, were. (Now Hebron was built seven years before Zoan in Egypt.)వారు దక్షిణదిక్కున ప్రయాణముచేసి హెబ్రోనుకు వచ్చిరి. అక్కడ అనాకీయులు అహీమాను షేషయి తల్మయి అను వారుండిరి. ఆ హెబ్రోను ఐగుప్తులోని సోయనుకంటె ఏడేండ్లు ముందుగా కట్టబడెను.

23 And they came to the brook of Eshcol, and cut down from thence a branch with one cluster of grapes, and they bore it between two upon a staff; and they brought of the pomegranates, and of the figs.వారు ఎష్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక్క గెలగల ద్రాక్షచెట్టు యొక్క కొమ్మనుకోసి దండెతో ఇద్దరు మోసిరి. మరియు వారు కొన్ని దానిమ్మపండ్లను కొన్ని అంజూ రపు పండ్లను తెచ్చిరి.

24 The place was called the brook Eshcol, because of the cluster of grapes which the children of Israel cut down from thence.ఇశ్రాయేలీయులు అక్కడకోసిన ద్రాక్ష గెలనుబట్టి ఆ స్థలమునకు ఎష్కోలు లోయ అను పేరు పెట్టబడెను.

25 And they returned from exploring the land after forty days.వారు నలుబది దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి.

26 And they went and came to Moses, and to Aaron, and to all the congregation of the children of Israel, to the wilderness of Paran, to Kadesh; and brought back word to them, and to all the congregation, and showed them the fruit of the land.అట్లు వారు వెళ్లి పారాను అరణ్యమందలి కాదేషులోనున్న మోషే అహ రోనులయొద్దకును ఇశ్రాయేలీయుల సర్వసమాజమునొద్ద కును వచ్చి, వారికిని ఆ సర్వ సమాజమునకును సమాచారము తెలియచెప్పి ఆ దేశపు పండ్లను వారికి చూపించిరి.

27 And they told him, and said, We came to the land whither thou sentest us, and surely it floweth with milk and honey; and this is the fruit of it.వారు అతనికి తెలియపరచినదేమనగానీవు మమ్మును పంపిన దేశమునకు వెళ్లితివిు; అది పాలు తేనెలు ప్రవ హించు దేశమే; దాని పండ్లు ఇవి.

28 Nevertheless, the people are strong that dwell in the land, and the cities are walled, and very great: and moreover, we saw the children of Anak there.అయితే ఆ దేశ ములో నివసించు జనులు బలవంతులు; వారి పట్టణములు ప్రాకారముగలవి అవి మిక్కిలి గొప్పవి; మరియు అక్కడ అనాకీయులను చూచితివిు.

29 The Amalekites dwell in the land of the south: and the Hittites, and the Jebusites, and the Amorites, dwell in the mountains: and the Canaanites dwell by the sea, and by the coast of Jordan.అమాలేకీయులు దక్షిణదేశ ములో నివసించుచున్నారు; హిత్తీయులు యెబూసీయులు అమోరీయులు కొండ దేశములో నివసించుచున్నారు; కనానీయులు సముద్రమునొద్దను యొర్దాను నదీప్రాంత ములలోను నివసించుచున్నారని చెప్పిరి.

30 And Caleb stilled the people before Moses, and said, Let us go up at once, and possess it; for we are well able to overcome it.​కాలేబు మోషే యెదుట జనులను నిమ్మళ పరచిమనము నిశ్చయముగా వెళ్లుదుము; దాని స్వాధీనపరచుకొందుము; దాని జయించుటకు మన శక్తి చాలుననెను.

31 But the men that went up with him said, We are not able to go up against the people; for they are stronger than we.​అయితే అతనితో కూడ పోయిన ఆ మనుష్యులుఆ జనులు మనకంటె బల వంతులు; మనము వారి మీదికి పోజాలమనిరి.

32 And they brought an evil report of the land which they had searched to the children of Israel, saying, The land through which we have passed to search it, is a land that eateth up its inhabitants; and all the people that we saw in it, are men of a great stature.​​మరియు వారు తాము సంచరించి చూచిన దేశమునుగూర్చి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారము చెప్పిమేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము; దానిలో మాకు కనబడిన జనులందరు ఉన్నత దేహులు.

33 And there we saw the giants, the sons of Anak, who come of the giants: and we were in our own sight as grasshoppers, and so we were in their sight.​​అక్కడ నెఫీలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీ యులను చూచితివిు; మా దృష్ఠికి మేము మిడతలవలె ఉంటిమి, వారి దృష్ఠికిని అట్లే ఉంటిమనిరి.

Telugu Bible