Bible

Proverbs 30 - WEB (Telugu)

1 The words of Agur the son of Jakeh, the oracle: The man says to Ithiel, To Ithiel and Ucal:దేవోక్తి, అనగా యాకె కుమారుడైన ఆగూరు పలికిన మాటలు.ఆ మనుష్యుడు ఈతీయేలునకును, ఈతీయేలునకును ఉక్కాలునకును చెప్పినమాట.

2 "Surely I am the most ignorant man, And don't have a man's understanding.నిశ్చయముగా మనుష్యులలో నావంటి పశుప్రాయుడు లేడు నరులకున్న వివేచన నాకు లేదు.

3 I have not learned wisdom, Neither do I have the knowledge of the Holy One.నేను జ్ఞానాభ్యాసము చేసికొన్నవాడను కాను పరిశుద్ధ దేవునిగూర్చిన జ్ఞానము పొందలేదు.

4 Who has ascended up into heaven, and descended? Who has gathered the wind in his fists? Who has bound the waters in his garment? Who has established all the ends of the earth? What is his name, and what is his son's name, if you know?ఆకాశమునకెక్కి మరల దిగినవాడెవడు? తన పిడికిళ్లతో గాలిని పట్టుకొన్నవాడెవడు? బట్టలో నీళ్లు మూటకట్టినవాడెవడు? భూమియొక్క దిక్కులన్నిటిని స్థాపించిన వాడెవడు? ఆయన పేరేమో ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసియున్నదా?

5 "Every word of God is flawless. He is a shield to those who take refuge in him.దేవుని మాటలన్నియు పుటము పెట్టబడినవే ఆయనను ఆశ్రయించువారికి ఆయన కేడెము.

6 Don't you add to his words, Lest he reprove you, and you be found a liar.ఆయన మాటలతో ఏమియు చేర్చకుము ఆయన నిన్ను గద్దించునేమో అప్పుడు నీవు అబద్ధికుడవగుదువు.

7 "Two things I have asked of you; Don't deny me before I die:దేవా, నేను నీతో రెండు మనవులు చేసికొను చున్నాను నేను చనిపోకముందు వాటిని నాకనుగ్రహింపుము;

8 Remove far from me falsehood and lies. Give me neither poverty nor riches. Feed me with the food that is needful for me;వ్యర్థమైనవాటిని ఆబద్ధములను నాకు దూరముగా నుంచుము పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయ చేయకుము తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము.

9 Lest I be full, deny you, and say, 'Who is Yahweh?' Or lest I be poor, and steal, And so dishonor the name of my God.ఎక్కువైనయెడల నేను కడుపు నిండినవాడనై నిన్ను విసర్జించి యెహోవా యెవడని అందునేమో లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతు నేమో.

10 "Don't slander a servant to his master, Lest he curse you, and you be held guilty.దాసునిగూర్చి వాని యజమానునితో కొండెములు చెప్పకుము వాడు నిన్ను శపించును ఒకవేళ నీవు శిక్షార్హుడ వగుదువు.

11 There is a generation that curses their father, And doesn't bless their mother.తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు.

12 There is a generation that is pure in their own eyes, Yet are not washed from their filthiness.తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యమునుండి కడుగబడని వారి తరము కలదు.

13 There is a generation, oh how lofty are their eyes! Their eyelids are lifted up.కన్నులు నెత్తికి వచ్చినవారి తరము కలదు. వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడియున్నవి!

14 There is a generation whose teeth are like swords, And their jaws like knives, To devour the poor from the earth, and the needy from among men.దేశములో ఉండకుండ వారు దరిద్రులను మింగు నట్లును మనుష్యులలో ఉండకుండ బీదలను నశింపజేయు నట్లును ఖడ్గమువంటి పళ్లును కత్తులవంటి దవడపళ్లును గల వారి తరము కలదు.

15 "The leach has two daughters: 'Give, give.' "There are three things that are never satisfied; Four that don't say, 'Enough:'జలగకు ఇమ్ము ఇమ్ము అను కూతురులిద్దరు కలరు తృప్తిపడనివి మూడు కలవుచాలును అని పలుకనివి నాలుగు కలవు.

16 Sheol, The barren womb; The earth that is not satisfied with water; And the fire that doesn't say, 'Enough.'అవేవనగా పాతాళము, కనని గర్భము, నీరు చాలును అనని భూమి, చాలును అనని అగ్ని.

17 The eye that mocks at his father, And scorns obedience to his mother: The ravens of the valley shall pick it out, The young eagles shall eat it.తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును పక్షిరాజు పిల్లలు దానిని తినును.

18 "There are three things which are too amazing for me, Four which I don't understand:నా బుద్ధికి మించినవి మూడు కలవు నేను గ్రహింపలేనివి నాలుగు కలవు. అవేవనగా, అంతరిక్షమున పక్షిరాజు జాడ,

19 The way of an eagle in the air; The way of a serpent on a rock; The way of a ship in the midst of the sea; And the way of a man with a maiden.బండమీద సర్పము జాడ, నడిసముద్రమున ఓడ నడచుజాడ, కన్యకతో పురుషుని జాడ.

20 So is the way of an adulterous woman: She eats and wipes her mouth, And says, 'I have done nothing wrong.'జారిణియొక్క చర్యయును అట్టిదే; అది తిని నోరు తుడుచుకొని నేను ఏ దోషము ఎరుగననును.

21 "For three things the earth tremble, And under four, it can't bear up:భూమిని వణకించునవి మూడు కలవు, అది మోయ లేనివి నాలుగు కలవు.

22 For a servant when he is king; A fool when he is filled with food;అవేవనగా, రాజరికమునకు వచ్చిన దాసుడు, కడుపు నిండ అన్నము కలిగిన మూర్ఖుడు,

23 For an unloved woman when she is married; And a handmaid who is heir to her mistress.కంటకురాలై యుండి పెండ్లియైన స్త్రీ, యజమాను రాలికి హక్కు దారురాలైన దాసి.

24 "There are four things which are little on the earth, But they are exceedingly wise:భూమిమీద చిన్నవి నాలుగు కలవు అయినను అవి మిక్కిలి జ్ఞానముగలవి.

25 The ants are not a strong people, Yet they provide their food in the summer;చీమలు బలములేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును.

26 The conies are but a feeble folk, Yet make they their houses in the rocks;చిన్న కుందేళ్లు బలములేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనును.

27 The locusts have no king, Yet they advance in ranks;మిడుతలకు రాజు లేడు అయినను అవన్నియు పంక్తులు తీరి సాగిపోవును.

28 You can catch a lizard with your hands, Yet it is in kings' palaces.బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు అయినను రాజుల గృహములలో అది యుండును.

29 "There are three things which are stately in their march, Four which are stately in going:డంబముగా నడుచునవి మూడు కలవు ఠీవితో నడుచునవి నాలుగు కలవు

30 The lion, which is mightiest among animals, And doesn't turn away for any;​అవేవనగా ఎల్లమృగములలో పరాక్రమముగలదై ఎవనికైన భయపడి వెనుకకు తిరుగని సింహము

31 The greyhound, The male goat also; And the king against whom there is no rising up.శోణంగి కుక్క, మేకపోతు, తన సైన్యమునకు ముందు నడుచుచున్న రాజు.

32 "If you have done foolishly in lifting up yourself, Or if you have thought evil, Put your hand over your mouth.నీవు బుద్ధిహీనుడవై అతిశయపడి యుండినయెడల కీడు యోచించి యుండినయెడల నీ చేతితో నోరు మూసికొనుము.

33 For as the churning of milk brings forth butter, And the wringing of the nose brings forth blood; So the forcing of wrath brings forth strife."పాలు తరచగా వెన్న పుట్టును, ముక్కు పిండగా రక్తము వచ్చును, కోపము రేపగా కలహము పుట్టును

Telugu Bible