Bible

Proverbs 14 - YLT (Telugu)

1 Every wise woman hath builded her house, And the foolish with her hands breaketh it down.జ్ఞానవంతురాలు తన యిల్లు కట్టును మూఢురాలు తన చేతులతో తన యిల్లు ఊడ... బెరుకును.

2 Whoso is walking in his uprightness is fearing Jehovah, And the perverted `in' his ways is despising Him.యథార్థముగా ప్రవర్తించువాడు యెహోవాయందు భయభక్తులుగలవాడు కుటిలచిత్తుడు ఆయనను తిరస్కరించువాడు,

3 In the mouth of a fool `is' a rod of pride, And the lips of the wise preserve them.మూఢుల నోట బెత్తమువంటి గర్వమున్నది. జ్ఞానుల పెదవులు వారిని కాపాడును.

4 Without oxen a stall `is' clean, And great `is' the increase by the power of the ox.ఎద్దులు లేని చోట గాదెయందు ధాన్యముండదు ఎద్దుల బలముచేత విస్తారము వచ్చుబడి కలుగును

5 A faithful witness lieth not, And a false witness breatheth out lies.నమ్మక మైన సాక్షి అబద్ధమాడడు కూటసాక్షికి అబద్ధములు ప్రియములు.

6 A scorner hath sought wisdom, and it is not, And knowledge to the intelligent `is' easy.అపహాసకుడు జ్ఞానము వెదకుట వ్యర్థము. తెలివిగలవానికి జ్ఞానము సులభము.

7 Go from before a foolish man, Or thou hast not known the lips of knowledge.బుద్ధిహీనుని యెదుటనుండి వెళ్లిపొమ్ము జ్ఞానవచనములు వానియందు కనబడవు గదా?

8 The wisdom of the prudent `is' to understand his way, And the folly of fools `is' deceit.తమ ప్రవర్తనను కనిపెట్టి యుండుట వివేకుల జ్ఞానము నకు లక్షణము మోసకృత్యములే బుద్ధిహీనులు కనుపరచు మూఢత.

9 Fools mock at a guilt-offering, And among the upright -- a pleasing thing.మూఢులు చేయు అపరాధపరిహారార్థబలి వారిని అపహాస్యము చేయును యథార్థవంతులు ఒకరియందు ఒకరు దయ చూపుదురు.

10 The heart knoweth its own bitterness, And with its joy a stranger doth not intermeddle.ఎవని దుఃఖము వాని హృదయమునకే తెలియును ఒకని సంతోషములో అన్యుడు పాలివాడు కానే రడు.

11 The house of the wicked is destroyed, And the tent of the upright flourisheth.భక్తిహీనుల యిల్లు నిర్మూలమగును యథార్థవంతుల గుడారము వర్థిల్లును.

12 There is a way -- right before a man, And its latter end `are' ways of death.ఒకని యెదుట సరియైనదిగా కనబడు మార్గము కలదు అయితే తుదకు అది మరణమునకు త్రోవతీయును.

13 Even in laughter is the heart pained, And the latter end of joy `is' affliction.ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖముండ వచ్చును. సంతోషము తుదకు వ్యసనమగును.

14 From his ways is the backslider in heart filled, And a good man -- from his fruits.భక్తి విడిచినవాని మార్గములు వానికే వెక్కసమగును మంచివాని స్వభావము వానికే సంతోషమిచ్చును.

15 The simple giveth credence to everything, And the prudent attendeth to his step.జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును వివేకియైనవాడు తన నడతలను బాగుగా కనిపెట్టును.

16 The wise is fearing and turning from evil, And a fool is transgressing and is confident.జ్ఞానముగలవాడు భయపడి కీడునుండి తొలగును బుద్ధిహీనుడు విఱ్ఱవీగి నిర్భయముగా తిరుగును.

17 Whoso is short of temper doth folly, And a man of wicked devices is hated.త్వరగా కోపపడువాడు మూఢత్వము చూపును. దుర్యోచనలుగలవాడు ద్వేషింపబడును.

18 The simple have inherited folly, And the prudent are crowned `with' knowledge.జ్ఞానము లేనివారికి మూఢత్వమే స్వాస్థ్యము వివేకులు జ్ఞానమును కిరీటముగా ధరించుకొందురు.

19 The evil have bowed down before the good, And the wicked at the gates of the righteous.చెడ్డవారు మంచివారి యెదుటను భక్తిహీనులు నీతిమంతుల తలుపునొద్దను వంగుదురు.

20 Even of his neighbour is the poor hated, And those loving the rich `are' many.దరిద్రుడు తన పొరుగువారికి అసహ్యుడు ఐశ్వర్యవంతుని ప్రేమించువారు అనేకులు.

21 Whoso is despising his neighbour sinneth, Whoso is favouring the humble, O his happiness.తన పొరుగువాని తిరస్కరించువాడు పాపము చేయు వాడు బీదలను కటాక్షించువాడు ధన్యుడు.

22 Do not they err who are devising evil? And kindness and truth `are' to those devising good,కీడు కల్పించువారు తప్పిపోవుదురు మేలు కల్పించువారు కృపాసత్యముల నొందుదురు.

23 In all labour there is advantage, And a thing of the lips `is' only to want.ఏ కష్టము చేసినను లాభమే కలుగును వట్టి మాటలు లేమిడికి కారణములు.

24 The crown of the wise is their wealth, The folly of fools `is' folly.జ్ఞానుల ఐశ్వర్యము వారికి భూషణము బుద్ధిహీనుల మూఢత్వము మూఢత్వమే.

25 A true witness is delivering souls, And a deceitful one breatheth out lies.నిజము పలుకు సాక్షి మనుష్యులను రక్షించును అబద్ధములాడువాడు వట్టి మోసగాడు.

26 In the fear of Jehovah `is' strong confidence, And to His sons there is a refuge.యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట బహు ధైర్యము పుట్టించును

27 The fear of Jehovah `is' a fountain of life, To turn aside from snares of death.అట్టివారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు. యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట జీవపు ఊట అది మరణపాశములలోనుండి విడిపించును

28 In the multitude of a people `is' the honour of a king, And in lack of people the ruin of a prince.జనసమృద్ధి కలుగుటచేత రాజులకు ఘనత వచ్చును జనక్షయము రాజులకు వినాశకరము.

29 Whoso is slow to anger `is' of great understanding, And whoso is short in temper is exalting folly.దీర్ఘశాంతముగలవాడు మహా వివేకి ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొం దును.

30 A healed heart `is' life to the flesh, And rottenness to the bones `is' envy.సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము మత్సరము ఎముకలకు కుళ్లు.

31 An oppressor of the poor reproacheth his Maker, And whoso is honouring Him Is favouring the needy.దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించు వాడు బీదను కనికరించువాడు ఆయనను ఘనపరచువాడు.

32 In his wickedness is the wicked driven away, And trustful in his death `is' the righteous.అపాయము రాగా భక్తిహీనుడు నశించును మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయము కలదు.

33 In the heart of the intelligent wisdom doth rest. And in the midst of fools it is known.తెలివిగలవాని హృదయమందు జ్ఞానము సుఖనివా సము చేయును బుద్ధిహీనుల అంతరంగములోనున్నది బయలుపడును

34 Righteousness exalteth a nation, And the goodliness of peoples `is' a sin-offering.నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము పాపము ప్రజలకు అవమానము తెచ్చును.

35 The favour of a king `is' to a wise servant, And an object of his wrath is one causing shame!బుద్ధిగల సేవకుడు రాజుల కిష్టుడు అవమానకరముగా నడచువానిమీద రాజు కోపించును

Telugu Bible