Luke 15 - WEB (Telugu)
1 Now all the tax collectors and sinners were coming close to him to hear him.ఒకప్పుడు సమస్తమైన సుంకరులును పాపులును ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా
2 The Pharisees and the scribes murmured, saying, "This man welcomes sinners, and eats with them."పరిసయ్యులును శాస్త్రులును అది చూచిఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడ భోజనము చేయుచున్నాడని చాల సణుగుకొనిరి.
3 He told them this parable.అందుకాయన వారితో ఈ ఉపమానము చెప్పెను
4 "Which of you men, if you had one hundred sheep, and lost one of them, wouldn't leave the ninety-nine in the wilderness, and go after the one that was lost, until he found it?మీలో ఏ మనుష్యునికైనను నూరు గొఱ్ఱలు కలిగి యుండగా వాటిలో ఒకటి తప్పిపోయినయెడల అతడు తొంబది తొమి్మదింటిని అడవిలో విడిచిపెట్టి, తప్పిపోయి నది దొరకువరకు దానిని వెదక వెళ్లడా?
5 When he has found it, he carries it on his shoulders, rejoicing.అది దొరకి నప్పుడు సంతోషముతో దానిని తన భుజములమీద వేసి కొని యింటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి
6 When he comes home, he calls together his friends and his neighbors, saying to them, 'Rejoice with me, for I have found my sheep which was lost!'మీరు నాతోకూడ సంతోషించుడి; తప్పి పోయిన నా గొఱ్ఱ దొరకినదని వారితో చెప్పును గదా.
7 I tell you that even so there will be more joy in heaven over one sinner who repents, than over ninety-nine righteous people who need no repentance.అటువలె మారుమనస్సు అక్కరలేని తొంబది తొమి్మది మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషముకంటె మారుమనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలొక మందు ఎక్కువ సంతోష
8 Or what woman, if she had ten drachma{A drachma coin was worth about 2 days wages for an agricultural laborer.} coins, if she lost one drachma coin, wouldn't light a lamp, sweep the house, and seek diligently until she found it?ఏ స్త్రీకైనను పది వెండి నాణములుండగా వాటిలో ఒక నాణము పోగొట్టుకొంటె ఆమె దీపము వెలిగించి యిల్లు ఊడ్చి అది దొరకువరకు జాగ్రత్తగా వెదకదా?
9 When she has found it, she calls together her friends and neighbors, saying, 'Rejoice with me, for I have found the drachma which I had lost.'అది దొరకినప్పుడు తన చెలికత్తెలను పొరుగువారిని పిలిచి నాతో కూడ సంతోషించుడి, నేను పోగొట్టుకొనిన నాణము దొరకినదని వారితో చెప్పును గదా.
10 Even so, I tell you, there is joy in the presence of the angels of God over one sinner repenting."అటు వలె మారుమనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతలయెదుట సంతోషము కలుగునని మీతో చెప్పు చున్నాననెను.
11 He said, "A certain man had two sons.మరియు ఆయన ఇట్లనెనుఒక మనుష్యునికి ఇద్దరు కుమారులుండిరి.
12 The younger of them said to his father, 'Father, give me my share of your property.' He divided his livelihood between them.వారిలో చిన్నవాడుతండ్రీ, ఆస్తిలో నాకువచ్చు భాగమిమ్మని తన తండ్రి నడు గగా, అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను.
13 Not many days after, the younger son gathered all of this together and traveled into a far country. There he wasted his property with riotous living.కొన్నిదినములైన తరు వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూర దేశమునకు ప్రయాణమై పోయి, అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారమువలన పాడుచేసెను.
14 When he had spent all of it, there arose a severe famine in that country, and he began to be in need.అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరవు రాగా వాడు ఇబ్బంది పడ సాగి,
15 He went and joined himself to one of the citizens of that country, and he sent him into his fields to feed pigs.వెళ్లి ఆ దేశస్థులలో ఒకనిచెంత జేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములలోనికి వానిని పంపెను.
16 He wanted to fill his belly with the husks that the pigs ate, but no one gave him any.వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన అశపడెను గాని యెవడును వాని కేమియు ఇయ్యలేదు.
17 But when he came to himself he said, 'How many hired servants of my father's have bread enough to spare, and I'm dying with hunger!అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడునా తండ్రియొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవు చున్నాను.
18 I will get up and go to my father, and will tell him, "Father, I have sinned against heaven, and in your sight.నేను లేచి నా తండ్రియొద్దకు వెళ్లి--తండ్రీ, నేను పరలోకమునకు విరోధముగాను నీ యెదుటను పాపము చేసితిని;
19 I am no more worthy to be called your son. Make me as one of your hired servants."'ఇకమీదట నీ కుమారుడనని అని పించుకొనుటకు యోగ్యుడను కాను; నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదు ననుకొని, లేచి తండ్రియొద్దకు వచ్చెను.
20 "He arose, and came to his father. But while he was still far off, his father saw him, and was moved with compassion, and ran, and fell on his neck, and kissed him.వాడింక దూర ముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి, పరుగెత్తి వాని మెడమీదపడి ముద్దుపెట్టుకొనెను.
21 The son said to him, 'Father, I have sinned against heaven, and in your sight. I am no longer worthy to be called your son.'అప్పుడు ఆ కుమారుడు అతనితోతండ్రీ, నేను పరలోక మునకు విరోధముగాను నీ యెదుటను పాపము చేసితిని; ఇకమీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యు డను కాననెను.
22 "But the father said to his servants, 'Bring out the best robe, and put it on him. Put a ring on his hand, and shoes on his feet.అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికికట్టి, వీని చేతికి ఉంగరము పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించుడి;
23 Bring the fattened calf, kill it, and let us eat, and celebrate;క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదము;
24 for this, my son, was dead, and is alive again. He was lost, and is found.' They began to celebrate.ఈ నా కుమారుడు చనిపోయి మరల బ్రదికెను, తప్పిపోయి దొరకెనని చెప్పెను; అంతట వారు సంతోషపడసాగిరి.
25 "Now his elder son was in the field. As he came near to the house, he heard music and dancing.అప్పుడు అతని పెద్ద కుమా రుడు పొలములో ఉండెను. వాడు (పొలమునుండి) వచ్చుచు ఇంటిదగ్గరకు రాగా, వాద్యములును నాట్యమును జరుగుట విని
26 He called one of the servants to him, and asked what was going on.దాసులలో ఒకని పిలిచిఇవి ఏమిటని అడుగగా
27 He said to him, 'Your brother has come, and your father has killed the fattened calf, because he has received him back safe and healthy.'ఆ దాసుడు అతనితోనీ తమ్ముడు వచ్చి యున్నాడు, అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చి నందున నీ తండ్రి క్రొవ్విన దూడను వధించెననెను.
28 But he was angry, and would not go in. Therefore his father came out, and begged him.అయితే అతడు కోపపడి లోపలికి వెళ్లనొల్లక పోయెను గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి (లోపలికి రమ్మని) బతిమాలుకొనెను.
29 But he answered his father, 'Behold, these many years I have served you, and I never disobeyed a commandment of yours, but you never gave me a goat, that I might celebrate with my friends.అందుకతడు తన తండ్రితోఇదిగో యిన్నియేండ్లనుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడును మీరలేదే; అయినను నా స్నేహితులతో సంతోషపడునట్లు నీవు నాకెన్నడును ఒక మేక
30 But when this, your son, came, who has devoured your living with prostitutes, you killed the fattened calf for him.'అయితే నీ ఆస్తిని వేశ్యలతో తిని వేసిన యీ నీ కుమారుడు రాగానే వీనికొరకు క్రొవ్విన దూడను వధించితివని చెప్పెను.
31 "He said to him, 'Son, you are always with me, and all that is mine is yours.అందుకతడుకుమారుడా, నీ వెల్లప్పుడును నాతోకూడ ఉన్నావు; నావన్నియు నీవి,
32 But it was appropriate to celebrate and be glad, for this, your brother, was dead, and is alive again. He was lost, and is found.'"మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే; ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రదికెను, తప్పిపోయి దొరకెనని అతనితో చెప్పెను.
Telugu Bible