Mark 1 - ASV (Telugu)
1 The beginning of the gospel of Jesus Christ, the Son of God.దేవుని కుమారుడైన యేసు క్రీస్తు సువార్త ప్రారం భము.
2 Even as it is written in Isaiah the prophet, Behold, I send my messenger before thy face, Who shall prepare thy way.ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను; అతడు నీ మార్గము సిద్ధపరచును.
3 The voice of one crying in the wilderness, Make ye ready the way of the Lord, Make his paths straight;ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాళము చేయుడని అరణ్యములో కేకవేయుచున్న ఒకనిశబ్దము అని ప్రవక్తయైన యెషయాచేత వ్రాయబడినట్టు
4 John came, who baptized in the wilderness and preached the baptism of repentance unto remission of sins.బాప్తిస్మమిచ్చు యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణనిమిత్తము మారుమనస్సు విషయమైన బాప్తి స్మము ప్రకటించుచు వచ్చెను.
5 And there went out unto him all the country of Judaea, and all they of Jerusalem; And they were baptized of him in the river Jordan, confessing their sins.అంతట యూదయ దేశస్థు లందరును, యెరూషలేమువారందరును, బయలుదేరి అతని యొద్దకు వచ్చి, తమ పాపములను ఒప్పుకొనుచు, యొర్దాను నదిలో అతనిచేత బాప్తిస్మము పొందుచుండి
6 And John was clothed with camel's hair, and `had' a leathern girdle about his loins, and did eat locusts and wild honey.యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొలచుట్టు తోలుదట్టియు ధరించు కొనువాడు, అడవి తేనెను మిడుతలను తినువాడు.
7 And he preached, saying, There cometh after me he that is mightier than I, the latchet of whose shoes I am not worthy to stoop down and unloose.మరియు అతడునాకంటె శక్తిమంతుడొకడు నావెనుక వచ్చుచున్నాడు; నేను వంగి ఆయన చెప్పులవారును విప్పుటకు పాత్రుడనుకాను;
8 I baptized you in water; But he shall baptize you in the Holy Spirit.నేను నీళ్లలో2 మీకు బాప్తిస్మమిచ్చితిని గాని ఆయన పరిశుద్ధాత్మలో3 మీకు బాప్తిస్మమిచ్చునని చెప్పి ప్రకటించుచుండెను.
9 And it came to pass in those days, that Jesus came from Nazareth of Galilee, and was baptized of John in the Jordan.ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతునుండి వచ్చి యొర్దానులో యోహానుచేత బాప్తిస్మము పొందెను.
10 And straightway coming up out of the water, he saw the heavens rent asunder, and the Spirit as a dove descending upon him:వెంటనే ఆయన నీళ్లలోనుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడుటయు, పరిశుద్ధాత్మ పావురమువలె తనమీదికి దిగివచ్చుటయు చూచెను.
11 And a voice came out of the heavens, Thou art my beloved Son, in thee I am well pleased.మరియునీవు నా ప్రియకుమారుడవు, నీయందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను.
12 And straightway the Spirit driveth him forth into the wilderness.వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసికొనిపోయెను.
13 And he was in the wilderness forty days tempted of Satan; And he was with the wild beasts; And the angels ministered unto him.ఆయన సాతానుచేత శోధింప బడుచు అరణ్యములో నలువదిదినములు అడవిమృగము లతోకూడ నుండెను; మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి.
14 Now after John was delivered up, Jesus came into Galilee, preaching the gospel of God,యోహాను చెరపట్టబడిన తరువాత యేసు
15 and saying, The time is fulfilled, and the kingdom of God is at hand: repent ye, and believe in the gospel.కాలము సంపూర్ణమైయున్నది, దేవునిరాజ్యము సమీపించి యున్నది ; మారుమనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు, గలిలయకు వచ్చెను.
16 And passing along by the sea of Galilee, he saw Simon and Andrew the brother of Simon casting a net in the sea; for they were fishers.ఆయన గలిలయ సముద్రతీరమున వెళ్లుచుండగా సీమోనును సీమోను సహోదరుడగు అంద్రెయయు, సముద్రములో వలవేయుట చూచెను; వారు జాలరులు.
17 And Jesus said unto them, Come ye after me, and I will make you to become fishers of men.యేసునా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులనుగా చేసెదనని వారితో చెప్పెను.
18 And straightway they left the nets, and followed him.వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి.
19 And going on a little further, he saw James the `son' of Zebedee, and John his brother, who also were in the boat mending the nets.ఆయన ఇంక కొంతదూరము వెళ్లి జెబెదయి కుమారుడగు యాకోబును అతని సహోదరుడగు యోహానును చూచెను; వారు దోనెలో ఉండి తమ వలలు బాగుచేసికొనుచుండిరి.
20 And straightway he called them: and they left their father Zebedee in the boat with the hired servants, and went after him.వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రియైన జెబెదయిని దోనెలో జీతగాండ్రయొద్ద విడిచిపెట్టి ఆయ నను వెంబడించిరి.
21 And they go into Capernaum; and straightway on the sabbath day he entered into the synagogue and taught.అంతట వారు కపెర్నహూములోనికి వెళ్లిరి. వెంటనే ఆయన విశ్రాంతిదినమున సమాజమందిరములోనికి పోయి బోధించెను.
22 And they were astonished at his teaching: For he taught them as having authority, and not as the scribes.ఆయన శాస్త్రులవలె గాక అధికారము గలవానివలె వారికి బోధించెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి.
23 And straightway there was in their synagogue a man with an unclean spirit; and he cried out,ఆ సమయమున వారి సమాజ మందిరములో అపవిత్రాత్మపట్టిన మనుష్యుడొకడుండెను.
24 saying, What have we to do with thee, Jesus thou Nazarene? art thou come to destroy us? I know thee who thou art, the Holy One of God.వాడునజరేయుడవగు యేసూ, మాతో నీకేమి, మమ్ము నశింపజేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియును; నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేసెను.
25 And Jesus rebuked him, saying, Hold thy peace, and come out of him.అందుకు యేసుఊరకుండుము వానిని విడిచిపొమ్మని దానిని గద్దింపగా
26 And the unclean spirit, tearing him and crying with a loud voice, came out of him.ఆ అపవిత్రాత్మ వానిని విలవిలలాడించి పెద్ద కేకవేసి వాని విడిచిపోయెను.
27 And they were all amazed, insomuch that they questioned among themselves, saying, What is this? a new teaching! with authority he commandeth even the unclean spirits, and they obey him.అందరును విస్మయమొంది ఇదేమిటో? యిది క్రొత్త బోధగా ఉన్నదే; ఈయన అధికారముతో అపవిత్రాత్మలకును ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని యొకనితో ఒకడు చెప్పు కొనిరి.
28 And the report of him went out straightway everywhere into all the region of Galilee round about.వెంటనే ఆయననుగూర్చిన సమాచారము త్వరలో గలిలయ ప్రాంతములందంతట వ్యాపించెను.
29 And straightway, when they were come out of the synagogue, they came into the house of Simon and Andrew, with James and John.వెంటనే వారు సమాజమందిరములోనుండి వెళ్లి, యాకోబుతోను యోహానుతోను సీమోను అంద్రెయ అనువారియింట ప్రవేశించిరి.
30 Now Simon's wife's mother lay sick of a fever; and straightway they tell him of her:సీమోను అత్త జ్వరముతో పడియుండగా, వెంటనే వారామెనుగూర్చి ఆయనతో చెప్పిరి.
31 and he came and took her by the hand, and raised her up; and the fever left her, and she ministered unto them.ఆయన ఆమెదగ్గరకు వచ్చి, చెయ్యిపట్టి ఆమెను లేవనెత్తెను; అంతట జ్వరము ఆమెను వదలెను గనుక ఆమె వారికి ఉపచారము చేయసాగెను.
32 And at even, when the sun did set, they brought unto him all that were sick, and them that were possessed with demons.సాయంకాలము ప్రొద్దు గ్రుంకినప్పుడు, జనులు సకల రోగులను దయ్యములు పట్టినవారిని ఆయనయొద్దకు తీసి కొని వచ్చిరి;
33 And all the city was gathered together at the door.పట్టణమంతయు ఆ యింటివాకిట కూడి యుండెను.
34 And he healed many that were sick with divers diseases, and cast out many demons; and he suffered not the demons to speak, because they knew him.ఆయన నానావిధ రోగములచేత పీడింప బడిన అనేకులను స్వస్థపరచి, అనేకమైన దయ్యములను వెళ్లగొట్టెను. అవి తన్ను ఎరిగియుండినందున ఆయన ఆ దయ్యములను మాటలాడనియ్యలేదు.
35 And in the morning, a great while before day, he rose up and went out, and departed into a desert place, and there prayed.ఆయన పెందలకడనే లేచి యింకను చాలా చీకటి యుండగానే బయలుదేరి, అరణ్యప్రదేశమునకు వెళ్లి, అక్కడ ప్రార్థన చేయుచుండెను.
36 And Simon and they that were with him followed after him;సీమోనును అతనితో కూడ నున్నవారును ఆయనను వెదకుచు వెళ్లి
37 and they found him, and say unto him, All are seeking thee.ఆయనను కనుగొని,అందరు నిన్ను వెదకుచున్నారని ఆయనతో చెప్పగా
38 And he saith unto them, Let us go elsewhere into the next towns, that I may preach there also; for to this end came I forth.ఆయనఇతర సమీప గ్రామములలోను నేను ప్రకటించునట్లు వెళ్లుదము రండి; యిందునిమిత్తమే గదా నేను బయలుదేరి వచ్చితినని వారితో చెప్పెను.
39 And he went into their synagogues throughout all Galilee, preaching and casting out demons.ఆయన గలిలయయందంతట వారి సమాజమందిరములలో ప్రక టించుచు, దయ్యములను వెళ్లగొట్టుచు నుండెను.
40 And there cometh to him a leper, beseeching him, and kneeling down to him, and saying unto him, If thou wilt, thou canst make me clean.ఒక కుష్ఠరోగి ఆయనయొద్దకు వచ్చి ఆయనయెదుట మోకాళ్లూనినీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనతో చెప్పి, ఆయనను వేడుకొనగా
41 And being moved with compassion, he stretched forth his hand, and touched him, and saith unto him, I will; be thou made clean.ఆయన కనికర పడి, చెయ్యిచాపి వానిని ముట్టినాకిష్టమే; నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పెను.
42 And straightway the leprosy departed from him, and he was made clean.వెంటనే కుష్ఠరోగము వానిని విడిచెను గనుక వాడు శుద్ధుడాయెను.
43 And he strictly charged him, and straightway sent him out,అప్పుడాయనఎవనితోను ఏమియు చెప్పకు సుమీ;
44 and saith unto him, See thou say nothing to any man: but go show thyself to the priest, and offer for thy cleansing the things which Moses commanded, for a testimony unto them.కాని నీవు వెళ్లి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనబరచు కొని, నీవు శుద్ధుడవైనందుకు మోషే నియమించిన కానుక లను సమర్పించుమని వానికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వానిని పంపివేసెను.
45 But he went out, and began to publish it much, and to spread abroad the matter, insomuch that Jesus could no more openly enter into a city, but was without in desert places: and they came to him from every quarter.అయితే వాడు వెళ్లి దానిని గూర్చి విస్తారముగా ప్రకటించుటకును, ఆ సంగతి ప్రచురము చేయుటకును ఆరంభించెను గనుక ఆయన ఇక పట్టణములో బహిరంగముగా ప్రవేశింపలేక, వెలు
Telugu Bible