Bible

Luke 20 - BBE (Telugu)

1 And it came about on one of those days, when he was teaching the people in the Temple and preaching the good news,ఆ దినములలో ఒకనాడు ఆయన దేవాలయములో ప్రజలకు బోధించుచు సువార్తను ప్రకటించుచున్నప్పుడు ప్రధానయాజకులును శాస్త్రులును పెద్దలతోకూడ ఆయన మీదికివచ్చి

2 That the chief priests and the scribes and the rulers of the people came to him and said, Make clear to us by what authority you do these things and who gave you this authority.నీవు ఏ అధికారమువలన ఈ కార్యము చేయుచున్నావో, యీ అధికారము నీ కెవడు ఇచ్చెనో మాతో చెప్పుమని ఆయనను అడిగిరి.

3 And in answer he said to them, I will put a question to you, and do you give me an answer:అందుకాయననేనును మిమ్మును ఒక మాట అడుగుదును, అది నాతో చెప్పుడి.

4 The baptism of John, was it from heaven or of men?యోహాను ఇచ్చిన బాప్తిస్మము పరలోకము నుండి కలిగినదా మనుష్యులనుండి కలిగినదా? అని వారి నడుగగా

5 And they said among themselves, If we say, From heaven; he will say, Why did you not have faith in him?వారు మనము పరలోకమునుండి కలిగినదని చెప్పినయెడల--ఆలా గైతే మీ రెందుకతని నమ్మలేదని ఆయన మనలను అడుగును.

6 But if we say, Of men; we will be stoned by the people, for they are certain that John was a prophet.మనుష్యులవలన కలిగినదని చెప్పినయెడల ప్రజలందరు మనలను రాళ్లతో కొట్టుదురు; ఏలయనగా యోహాను ప్రవక్త అని అందరును రూఢిగా నమ్ముచున్నారని తమలో తాము ఆలోచించుకొని

7 And they made answer that they had no idea where it came from.అది ఎక్కడనుండి కలిగినదో మాకు తెలియదని ఆయనకు ఉత్తరమిచ్చిరి.

8 And Jesus said, And I will not make clear to you by what authority I do these things.అందుకు యేసుఏ అధికారమువలన ఈ కార్యములు చేయుచున్నానో నేను మీతో చెప్పననివారి తోననెను.

9 And he gave the people this story: A man made a vine-garden and gave the use of it to some field-workers and went into another country for a long time.అంతట ఆయన ప్రజలతో ఈ ఉపమానము చెప్ప సాగెను ఒక మనుష్యుడు ద్రాక్షతోట నాటించి, కాపులకు గుత్తకిచ్చి, దేశాంతరముపోయి బహుకాల ముండెను.

10 And at the right time he sent a servant to the workers to get part of the fruit from the vines; but the workmen gave him blows and sent him away with nothing.పంటకాలమందు అతడు ఆ ద్రాక్షతోట పంటలో తన భాగమిమ్మని ఆ కాపులయొద్ద కొక దాసుని పంపగా ఆ కాపులు వానిని కొట్టి వట్టిచేతులతో పంపి వేసిరి.

11 And he sent another servant, and they gave blows to him in the same way, and put shame on him, and sent him away with nothing.మరల అతడు మరియొక దాసుని పంపగా వారు వానిని కొట్టి అవమానపరచి, వట్టిచేతులతో పంపివేసిరి.

12 And he sent a third, and they gave him wounds and put him out.మరల నతడు మూడవవాని పంపగా వారు వానిని గాయ పరచి వెలుపలికి త్రోసివేసిరి.

13 And the lord of the garden said, What am I to do? I will send my dearly loved son; they may give respect to him.అప్పుడా ద్రాక్షతోట యజమానుడునేనేమి చేతును? నా ప్రియకుమారుని పంపుదును; ఒక వేళ వారు అతని సన్మానించెద రను కొనెను.

14 But when the workmen saw him, they said to one another, This is he who will one day be the owner of the property: let us put him to death and the heritage will be ours.అయినను ఆ కాపులు అతనిని చూచిఇతడు వారసుడు; ఈ స్వాస్థ్యము మనదగునట్లు ఇతని చంపుదము రండని యొకరితో నొకరు ఆలోచించుకొని

15 And driving him out of the garden they put him to death. Now what will the lord do to these workmen?అతనిని ద్రాక్షతోట వెలుపలికి త్రోసివేసి చంపిరి. కాబట్టి ఆ ద్రాక్షతోట యజమానుడు వారికేమి చేయును?

16 He will come and put them to destruction and give the garden to others. And when he said this, they said, May it not be so.అతడు వచ్చి ఆ కాపులను సంహరించి తన ద్రాక్షతోటను ఇతరులకు ఇచ్చునని ఆయన చెప్పగా వారు విని అట్లు కాకపోవును గాకనిరి.

17 But he, looking on them, said, Is it not in the Writings, The stone which the builders put on one side, the same has become the chief stone of the building?ఆయన వారిని చూచి ఆలాగైతే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను అని వ్రాయబడిన మాట ఏమిటి?

18 Everyone falling on that stone will be broken, but the man on whom the stone comes down will be crushed to dust.ఈ రాతిమీద పడు ప్రతివాడును తునకలై పోవును; గాని అది ఎవనిమీద పడునో వానిని నలిచేయుననెను.

19 And the chief priests and the scribes made attempts to get their hands on him in that very hour; and they were in fear of the people, for they saw that he had made up this story against them.ప్రధానయాజకులును శాస్త్రులును తమ్మునుగూర్చి ఈ ఉపమానము ఆయన చెప్పెనని గ్రహించి, ఆ గడియలోనే ఆయనను బలాత్కారముగా పట్టుకొన సమయము చూచిరి గాని జనులకు భయపడిరి.

20 And they kept watch on him, and sent out secret representatives, who were acting the part of good men, in order that they might get something from his words, on account of which they might give him up to the government and into the power of the ruler.వారాయనను కనిపెట్టుచు, అధిపతి వశమునకును అధికారమునకును ఆయనను అప్పగించుటకై ఆయన మాటలయందు తప్పు పట్టవలెనని, తాము నీతిమంతులని అనిపించుకొను వేగుల వారిని ఆయనయొద్దకు పంపిరి.

21 And they put a question to him, saying, Master, we are certain that your teaching and your words are right, and that you have no respect for a man's position, but you are teaching the true way of God:వారు వచ్చిబోధకుడా, నీవు న్యాయముగా మాటలాడుచును బోధించుచు నున్నావు; నీ వెవని యందును మోమోటము లేక సత్యము గానే దేవుని మార్గమును బోధించుచున్నావని యెరుగు దుము.

22 Is it right for us to make payment of taxes to Caesar or not?మనము కైసరునకు పన్ను ఇచ్చుట న్యాయమా కాదా అని ఆయన నడిగిరి.

23 But he saw through their trick and said to them,ఆయన వారి కుయుక్తిని గుర్తెరిగిఒక దేనారము నాకు చూపుడి.

24 Let me see a penny. Whose image and name are on it? And they said, Caesar's.దీనిమీది రూపమును పైవ్రాతయు ఎవనివని అడుగగా వారు కైసరు వనిరి.

25 And he said, Then give to Caesar the things which are Caesar's, and to God the things which are God's.అందుకాయనఆలాగైతే కైసరువి కైసరునకును దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పెను.

26 And they were not able to get anything from these words before the people: but they were full of wonder at his answer, and said nothing.వారు ప్రజలయెదుట ఈ మాటలో తప్పు పట్ట నేరక ఆయన ప్రత్యుత్తరమునకు ఆశ్చర్యపడి ఊరకుండిరి.

27 And some of the Sadducees came to him, who say that there is no coming back from the dead; and they said to him,పునరుత్థానము లేదని చెప్పెడి సద్దూకయ్యులు కొందరు ఆయనయొద్దకు వచ్చి ఆయనను ఇట్లడిగిరి.

28 Master, Moses said that if a man's brother comes to his end, having a wife, but no children, his brother is to take the wife, and get a family for his brother.బోధకుడా, భార్య బ్రదికియుండగా ఒకని సహోదరుడు సంతానము లేక చనిపోయినయెడల, అతని సహోదరు డతని భార్యను పెండ్లిచేసికొని తన సహోదరునికి సంతానము కలుగజేయ వలె

29 Now there were seven brothers, and the first had a wife and came to his end, having no children;యేడుగురు సహోదరు లుండిరి. మొదటివాడొక స్త్రీని పెండ్లి చేసికొని సంతానము లేక చనిపోయెను.

30 And the second;రెండవవాడును మూడవవాడును ఆమెను పెండ్లిచేసికొనిరి.

31 And the third took her; and in the same way, all the seven, without having any children, came to their end.ఆ ప్రకారమే యేడుగురును ఆమెను పెండ్లాడి సంతానములేకయే చని పోయిరి. పిమ్మట ఆ స్త్రీయు చనిపోయెను.

32 And last of all, the woman came to her end.కాబట్టి పునరుత్థానమందు ఆమె వారిలో ఎవనికి భార్యగా ఉండును?

33 When they come back from the dead, whose wife will she be? for all the seven had her.ఆ యేడుగురికిని ఆమె భార్యగా ఉండెను గదా అనిరి.

34 And Jesus said to them, The sons of this world are married and have wives;అందుకు యేసుఈ లోకపు జనులు పెండ్లిచేసికొందురు,పెండ్లికియ్యబడుదురు గాని

35 But those to whom is given the reward of the world to come, and to come back from the dead, have no wives, and are not married;పరమును మృతుల పునరుత్థానమును పొందుటకు యోగ్యులని యెంచ బడినవారు పెండ్లిచేసికొనరు, పెండ్లికియ్య బడరు.

36 And death has no more power over them, for they are equal to the angels, and are sons of God, being of those who will come back from the dead.వారు పునరుత్థానములో పాలివారైయుండి,3 దేవదూత సమా నులును దేవుని కుమారులునై యుందురు గనుక వారికను చావనేరరు.

37 But even Moses made it clear that the dead come back to life, saying, in the story of the burning thorn-tree, The Lord, the God of Abraham, the God of Isaac, and the God of Jacob.పొదనుగురించిన భాగములోప్రభువు అబ్రాహాము దేవుడనియు ఇస్సాకు దేవుడనియు యాకోబు దేవుడనియు చెప్పుచు,

38 Now he is not the God of the dead but of the living: for all men are living to him.మృతులు లేతురని మోషే సూచించెను; ఆయన సజీవులకే దేవుడు కాని మృతులకు దేవుడు కాడు; ఆయన దృష్టికి అందరును జీవించు చున్నారని వారికి ఉత్తరమిచ్చెను.

39 And some of the scribes, in answer to this, said, Master, you have said well.తరువాత వారాయ నను మరేమియు అడుగ తెగింపలేదు గనుక శాస్త్రులలో కొందరు బోధకుడా,

40 And they had fear of putting any more questions to him.నీవు యుక్తముగా చెప్పితివనిరి.

41 And he said to them, Why do they say that the Christ is the son of David?ఆయన వారితోక్రీస్తు దావీదు కుమారుడని జను లేలాగు చెప్పుచున్నారు

42 For David himself says in the book of Psalms, The Lord said to my Lord, Take your seat at my right hand,నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా ఉంచువరకు నీవు నాకుడిపార్శ్వమున కూర్చుండు మని

43 Till I put under your feet all those who are against you.ప్రభువు నా ప్రభువుతో చెప్పెను. అని కీర్తనల గ్రంథములో దావీదే చెప్పియున్నాడు.

44 David then gives him the name of Lord, so how is it possible for him to be his son?దావీదు ఆయనను ప్రభువని చెప్పినయెడల ఆయన ఏలాగు అతని కుమారుడగునని చెప్పెను.

45 And in the hearing of all the people he said to his disciples,ప్రజలందరు వినుచుండగా ఆయన ఇట్లనెనుశాస్త్రులను గూర్చి జాగ్రత్తపడుడి. వారు నిలువుటంగీలు ధరించు కొని తిరుగగోరుచు

46 Keep away from the scribes, whose pleasure it is to go about in long robes, and to have words of respect said to them in the market-places, and to take the chief seats in the Synagogues and the first places at feasts;సంతవీధులలో వందనములను, సమాజమందిరములలో అగ్రపీఠములను, విందులలో అగ్ర స్థానములను కోరుదురు.

47 Who take the property of widows and before the eyes of men make long prayers; they will get a greater punishment.వారు విధవరాండ్ర యిండ్లను దిగమింగుచు, మాయవేషముగా దీర్ఘప్రార్థనలు చేయుదురు. వారు మరి విశేషముగా శిక్ష పొందుదురని తన శిష్యులతో చెప్పెను.

Telugu Bible