Luke 13 - WEB (Telugu)
1 Now there were some present at the same time who told him about the Galileans, whose blood Pilate had mixed with their sacrifices.పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపియుండెను. ఆ కాలమున అక్కడనున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా
2 Jesus answered them, "Do you think that these Galileans were worse sinners than all the other Galileans, because they suffered such things?ఆయన వారితో ఇట్లనెనుఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటె పాపులని మీరు తలంచు చున్నారా?
3 I tell you, no, but, unless you repent, you will all perish in the same way.కారని మీతో చెప్పుచున్నాను; మీరు మారుమనస్సు పొందనియెడల మీరందరును ఆలాగే నశింతురు.
4 Or those eighteen, on whom the tower in Siloam fell, and killed them; do you think that they were worse offenders than all the men who dwell in Jerusalem?మరియు సిలోయములోని గోపురము పడి చచ్చిన ఆ పదునెనిమిదిమంది, యెరూషలేములో కాపుర మున్నవారందరికంటె అపరాధులని తలంచుచున్నారా?
5 I tell you, no, but, unless you repent, you will all perish in the same way."కారని మీతో చెప్పుచున్నాను; మీరు మారుమనస్సు పొందనియెడల మీరందరును ఆలాగే నశింతురు.
6 He spoke this parable. "A certain man had a fig tree planted in his vineyard, and he came seeking fruit on it, and found none.మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను ఒక మనుష్యుని ద్రాక్షతోటలో అంజూరపు చెట్టొకటి నాటబడి యుండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చి నప్పుడు ఏమియు దొరకలేదు
7 He said to the vine dresser, 'Behold, these three years I have come looking for fruit on this fig tree, and found none. Cut it down. Why does it waste the soil?'గనుక అతడు ఇదిగో మూడేండ్లనుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకవచ్చుచున్నాను గాని యేమియు దొరకలేదు; దీనిని నరికివేయుము, దీనివలన ఈ భూమియు ఏల వ్యర్థమై పోవలెనని ద్రాక్షతోట మాలితో చెప్పెను.
8 He answered, 'Lord, leave it alone this year also, until I dig around it, and fertilize it.అయితే వాడు అయ్యా, నేను దానిచుట్టు త్రవ్వి, యెరువు వేయుమట్టుకు ఈ సంవత్సరముకూడ ఉండనిమ్ము;
9 If it bears fruit, fine; but if not, after that, you can cut it down.'"అది ఫలించిన సరి, లేనియెడల నరికించివేయుమని అతనితో చెప్పెను.
10 He was teaching in one of the synagogues on the Sabbath day.విశ్రాంతి దినమున ఆయన యొక సమాజమందిరములో బోధించుచున్నప్పుడు
11 Behold, there was a woman who had a spirit of infirmity eighteen years, and she was bent over, and could in no way straighten herself up.పదునెనిమిది ఏండ్లనుండి బలహీన పరచు దయ్యము పట్టిన యొక స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి యెంత మాత్రమును చక్కగా నిలువబడలేకుండెను.
12 When Jesus saw her, he called her, and said to her, "Woman, you are freed from your infirmity."యేసు ఆమెను చూచి, రమ్మని పిలిచి అమ్మా, నీ బలహీనతనుండి విడుదల పొంది యున్నావని ఆమెతో చెప్పి
13 He laid his hands on her, and immediately she stood up straight, and glorified God.ఆమెమీద చేతులుంచ గానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమపరచెను.
14 The ruler of the synagogue, being indignant because Jesus had healed on the Sabbath, said to the multitude, "There are six days in which men ought to work. Therefore come on those days and be healed, and not on the Sabbath day!"యేసు విశ్రాంతిదినమున స్వస్థపరచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపముతో మండిపడి, జనసమూహ మును చూచిపనిచేయదగిన ఆరు దినములు కలవు గనుక ఆ దినములలోనే వచ్చి స్వస్థతపొందుడి; విశ్రాంతిదిన మందు రావద్దని చెప్పెను.
15 Therefore the Lord answered him, "You hypocrites! Doesn't each one of you free his ox or his donkey from the stall on the Sabbath, and lead him away to water?అందుకు ప్రభువు వేషధారు లారా, మీలో ప్రతివాడును విశ్రాంతిదినమున తన యెద్దునైనను గాడిదనైనను గాడియొద్దనుండి విప్పి, తోలు కొనిపోయి, నీళ్లు పెట్టును గదా.
16 Ought not this woman, being a daughter of Abraham, whom Satan had bound eighteen long years, be freed from this bondage on the Sabbath day?"ఇదిగో పదునెనిమిది ఏండ్లనుండి సాతాను బంధించిన అబ్రాహాము కుమార్తెయైన యీమెను విశ్రాంతిదినమందు ఈ కట్లనుండి విడిపింప దగదా? అని అతనితో చెప్పెను.
17 As he said these things, all his adversaries were disappointed, and all the multitude rejoiced for all the glorious things that were done by him.ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన నెదిరించిన వారందరు సిగ్గుపడిరి; అయితే జనసమూహమంతయు ఆయన చేసిన ఘన కార్యములన్నిటిని చూచి సంతోషించెను.
18 He said, "What is the Kingdom of God like? To what shall I compare it?ఆయనదేవుని రాజ్యము దేనిని పోలియున్నది? దేనితో దాని పోల్తును?
19 It is like a grain of mustard seed, which a man took, and put in his own garden. It grew, and became a large tree, and the birds of the sky lodged in its branches."ఒక మనుష్యుడు తీసికొని పోయి తన తోటలోవేసిన ఆవగింజను పోలియున్నది. అది పెరిగి వృక్షమాయెను; ఆకాశపక్షులు దాని కొమ్మల యందు నివసించెననెను.
20 Again he said, "To what shall I compare the Kingdom of God?మరల ఆయనదేవుని రాజ్య మును దేనితో పోల్తును?
21 It is like yeast, which a woman took and hid in three measures{literally, three sata. 3 sata is about 39 litres or a bit more than a bushel} of flour, until it was all leavened."ఒక స్త్రీ తీసికొని, అంతయు పులిసి పొంగువరకు మూడు కుంచముల పిండిలో దాచి పెట్టిన పుల్లని పిండిని పోలియున్నదని చెప్పెను.
22 He went on his way through cities and villages, teaching, and traveling on to Jerusalem.ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవుచు బోధించుచు పట్టణములలోను గ్రామములలోను సంచా రము చేయుచుండెను.
23 One said to him, "Lord, are they few who are saved?" He said to them,ఒకడు ప్రభువా, రక్షణపొందు వారు కొద్దిమందేనా? అని ఆయన నడుగగా
24 "Strive to enter in by the narrow door, for many, I tell you, will seek to enter in, and will not be able.ఆయన వారిని చూచిఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి; అనేకులు ప్రవేశింప జూతురు గాని వారివలన కాదని మీతో చెప్పుచున్నాను.
25 When once the master of the house has risen up, and has shut the door, and you begin to stand outside, and to knock at the door, saying, 'Lord, Lord, open to us!' then he will answer and tell you, 'I don't know you or where you come from.'ఇంటి యజమానుడు లేచి తలుపువేసిన తరువాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి అయ్యా, మాకు తలుపు తీయుమని చెప్ప నారంభించి నప్పుడు
26 Then you will begin to say, 'We ate and drink in your presence, and you taught in our streets.'ఆయన మీ రెక్కడివారో మిమ్మును ఎరుగనని ఉత్తరము మీతో చెప్పును. అందుకు మీరునీ సముఖ మందు మేము తిని త్రాగుచుంటిమే; నీవు మా వీధులలో బోధించితివే అని చెప్ప సాగుదురు.
27 He will say, 'I tell you, I don't know where you come from. Depart from me, all you workers of iniquity.'అప్పుడాయనమీ రెక్కడివారో మిమ్మును ఎరుగనని మీతో చెప్పు చున్నాను; అక్రమము చేయు మీరందరు నా యొద్దనుండి తొలగిపొండని చెప్పును.
28 There will be weeping and gnashing of teeth, when you see Abraham, Isaac, Jacob, and all the prophets, in the Kingdom of God, and yourselves being thrown outside.అబ్రాహాము ఇస్సాకు యాకోబులును సకల ప్రవక్తలును దేవుని రాజ్యములో ఉండుటయు, మీరు వెలుపలికి త్రోయబడుటయు, మీరు చూచునప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుకు దురు.
29 They will come from the east, west, north, and south, and will sit down in the Kingdom of God.మరియు జనులు తూర్పునుండియు పడమట నుండియు ఉత్తరమునుండియు దక్షిణమునుండియువచ్చి, దేవుని రాజ్యమందు కూర్చుందురు.
30 Behold, there are some who are last who will be first, and there are some who are first who will be last."ఇదిగో కడపటి వారిలో కొందరు మొదటి వారగుదురు, మొదటివారిలో కొందరు కడపటి వారగుదురని చెప్పెను.
31 On that same day, some Pharisees came, saying to him, "Get out of here, and go away, for Herod wants to kill you."ఆ గడియలోనే కొందరు పరిసయ్యులు వచ్చినీ విక్కడనుండి బయలుదేరి పొమ్ము; హేరోదు నిన్ను చంప గోరుచున్నాడని ఆయనతో చెప్పగా
32 He said to them, "Go and tell that fox, 'Behold, I cast out demons and perform cures today and tomorrow, and the third day I complete my mission.ఆయన వారిని చూచిమీరు వెళ్లి, ఆ నక్కతో ఈలాగు చెప్పుడి ఇదిగో నేడును రేపును నేను దయ్యములను వెళ్ల గొట్టుచు (రోగులను) స్వస్థపరచుచునుండి మూడవ దినమున పూర్ణ సిద్ధి పొందెదను.
33 Nevertheless I must go on my way today and tomorrow and the next day, for it can't be that a prophet perish outside of Jerusalem.'అయినను నేడు రేపు ఎల్లుండి నా త్రోవను నేను పోవుచుండవలెను; ప్రవక్త యెరూషలేము నకు వెలుపల నశింప వల్లపడదు.
34 "Jerusalem, Jerusalem, that kills the prophets, and stones those who are sent to her! How often I wanted to gather your children together, like a hen gathers her own brood under her wings, and you refused!యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు, నీయొద్దకు పంప బడినవారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా, కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఏలాగు చేర్చుకొనునో ఆలాగే ఎన్నో మారులు నేను నీ ప్లిలలను చేర్చుకొనవలెనని యుంటినిగాని మీ రొల్లకపోతిరి.
35 Behold, your house is left to you desolate. I tell you, you will not see me, until you say, 'Blessed is he who comes in the name of the Lord!'"ఇదిగో మీ యిల్లు మీకు పాడుగా విడువబడుచున్నదిప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాకని మీరు చెప్పువరకు మీరు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాననెను.
Telugu Bible