Bible

Leviticus 18 - WEB (Telugu)

1 Yahweh said to Moses,మరియు యెహోవా మోషేకు ఈలాగు సెల విచ్చెను

2 "Speak to the children of Israel, and say to them, 'I am Yahweh your God.నేను మీ దేవుడనైన యెహోవానని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పుము.

3 You shall not do as they do in the land of Egypt, where you lived: and you shall not do as they do in the land of Canaan, where I am bringing you; neither shall you walk in their statutes.మీరు నివసించిన ఐగుప్తు దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు; నేను మిమ్మును రప్పించుచున్న కనాను దేశాచారములచొప్పున మీరు చేయకూడదు; వారి కట్టడలను బట్టి నడవకూడదు.

4 You shall do my ordinances, and you shall keep my statutes, and walk in them: I am Yahweh your God.మీరు నా విధులను గైకొనవలెను; నా కట్టడలనుబట్టి నడుచుకొనుటకు వాటిని ఆచరింపవలెను; మీ దేవుడనగు నేను యెహోవాను.

5 You shall therefore keep my statutes and my ordinances; which if a man does, he shall live in them: I am Yahweh.మీరు నాకట్టడలను నా విధు లను ఆచరింపవలెను. వాటిని గైకొనువాడు వాటివలన బ్రదుకును; నేను యెహోవాను.

6 "'None of you shall approach anyone who are his close relatives, to uncover their nakedness: I am Yahweh.మీలో ఎవరును తమ రక్తసంబంధుల మానాచ్ఛాదన మును తీయుటకు వారిని సమీపింపకూడదు; నేను యెహోవాను.

7 "'You shall not uncover the nakedness of your father, nor the nakedness of your mother: she is your mother. You shall not uncover her nakedness.​నీ తండ్రికి మానాచ్ఛాదనముగా నున్న నీ తల్లి మానాచ్ఛాదనమును తీయకూడదు; ఆమె నీ తల్లి; ఆమె మానాచ్ఛాదనమును తీయకూడదు.

8 "'You shall not uncover the nakedness of your father's wife: it is your father's nakedness.​నీ తండ్రి భార్య మానాచ్ఛాదనమును తీయకూడదు; అది నీ తండ్రిదే.

9 "'You shall not uncover the nakedness of your sister, the daughter of your father, or the daughter of your mother, whether born at home, or born abroad.​నీ సహోదరి మానాచ్ఛాదనమును, అనగా ఇంటిలో పుట్టిన దేమి వెలుపట పుట్టినదేమి నీ తండ్రి కుమార్తెయొక్క యైనను నీ తల్లి కుమార్తెయొక్కయైనను మానాచ్ఛాదనమును తీయకూడదు.

10 "'You shall not uncover the nakedness of your son's daughter, or of your daughter's daughter, even their nakedness: for theirs is your own nakedness.నీ కుమారుని కుమార్తె మానాచ్ఛాదనము నైనను కుమార్తె కుమార్తె మానాచ్ఛాదనమునైనను తీయ కూడదు; అది నీది.

11 "'You shall not uncover the nakedness of your father's wife's daughter, conceived by your father, since she is your sister. "'నీ తండ్రివలన పుట్టిన నీ తండ్రి భార్య కుమార్తె నీ సహోదరి; ఆమె మానాచ్ఛాదనమును తీయకూడదు.

12 You shall not uncover the nakedness of your father's sister: she is your father's near kinswoman.నీ తండ్రి సహోదరి మానాచ్ఛాదన మును తీయకూడదు. ఆమె నీ తండ్రి రక్తసంబంధి.

13 "'You shall not uncover the nakedness of your mother's sister: for she is your mother's near kinswoman.నీ తల్లి సహోదరి మానాచ్ఛాదనమును తీయకూడదు; ఆమె నీ తల్లి రక్తసంబంధి.

14 "'You shall not uncover the nakedness of your father's brother, you shall not approach his wife: she is your aunt.నీ తండ్రి సహోదరుని మానాచ్ఛాదనమును తీయకూడదు, అనగా అతని భార్యను సమీపింపకూడదు; ఆమె నీ పినతల్లి.

15 "'You shall not uncover the nakedness of your daughter-in-law: she is your son's wife. You shall not uncover her nakedness.నీ కోడలి మానాచ్ఛాదనమును తీయకూడదు; ఆమె నీ కుమారుని భార్య, ఆమె మానాచ్ఛాదనమును తీయ కూడదు.

16 "'You shall not uncover the nakedness of your brother's wife: it is your brother's nakedness.నీ సహోదరుని భార్యమానాచ్ఛాదనమును తీయకూడదు; అది నీ సహోదరుని మానము.

17 "'You shall not uncover the nakedness of a woman and her daughter. You shall not take her son's daughter, or her daughter's daughter, to uncover her nakedness; they are near kinswomen: it is wickedness.ఒక స్త్రీ మానాచ్ఛాదనమును ఆమె కుమార్తె మానాచ్ఛాదనమును తీయకూడదు; ఆమె కుమారుని కుమార్తె మానాచ్ఛాదనము నైనను ఆమె కుమార్తె కుమార్తె మానాచ్ఛాదనమునైనను తీయుటకు వారిని చేర్చుకొనకూడదు; వారు ఆమె రక్తసంబంధులు; అది దుష్కామప్రవర్తన.

18 "'You shall not take a wife to her sister, to be a rival, to uncover her nakedness, while her sister is yet alive.​నీ భార్య బ్రదికి యుండగా ఆమెను పీడించుటకు ఆమె సహోదరి మానా చ్ఛాదనమును తీయుటకు ఈమెను ఆమెతో పెండ్లిచేసి కొనకూడదు.

19 "'You shall not approach a woman to uncover her nakedness, as long as she is impure by her uncleanness.అపవిత్రతవలన స్త్రీ కడగా ఉండు నప్పుడు ఆమె మానాచ్ఛాదనమును తీయుటకు ఆమెను సమీపింపకూడదు.

20 "'You shall not lie carnally with your neighbor's wife, and defile yourself with her.నీ పొరుగువాని భార్యయందు నీ వీర్యస్ఖలనముచేసి ఆమెవలన అపవిత్రత కలుగజేసికొన కూడదు.

21 "'You shall not give any of your children to sacrifice to Molech; neither shall you profane the name of your God: I am Yahweh.​నీవు ఏ మాత్రమును నీ సంతానమునుమోలెకు నిమిత్తము అగ్నిగుండమును దాటనీయ కూడదు; నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు, నేను యెహోవాను.

22 "'You shall not lie with a man, as with a woman. That is detestible.స్త్రీ శయనమువలె పురుషశయనము కూడదు; అది హేయము.

23 "'You shall not lie with any animal to defile yourself with it; neither shall any woman give herself to an animal, to lie down with it: it is a perversion.​ఏ జంతువు నందును నీ స్ఖలనముచేసి దాని వలన అపవిత్రత కలుగజేసికొనకూడదు. జంతువు స్త్రీని పొందునట్లు ఆమె దాని యెదుట నిలువరాదు, అది విపరీతము.

24 "'Don't defile yourselves in any of these things: for in all these the nations which I am casting out before you were defiled.​వీటిలో దేనివలనను అపవిత్రత కలుగజేసికొన కూడదు. నేను మీ యెదుటనుండి వెళ్లగొట్టుచున్న జనములు వా టన్నిటివలన అపవిత్రులైరి.

25 The land was defiled: therefore I punished its iniquity, and the land vomitted out her inhabitants.ఆ దేశము అపవిత్రత కలది గనుక నేను దానిమీద దాని దోష శిక్షను మోపుచున్నాను. ఆ దేశమందు కాపురమున్న వారిని వెళ్లగ్రక్కి వేయుచున్నది.

26 You therefore shall keep my statutes and my ordinances, and shall not do any of these abominations; neither the native-born, nor the stranger who lives as a foreigner among you;కాబట్టి ఆ దేశము మీకంటె ముందుగానున్న ప్రజలను వెళ్లగ్రక్కివేసిన ప్రకారము మీ అపవిత్రతను బట్టి మిమ్మును వెళ్లగ్రక్కి వేయకుండునట్లు మీరు,

27 (for all these abominations have the men of the land done, that were before you, and the land became defiled);అనగా స్వదేశియేగాని మీలో నివసించు పరదేశియేగాని యీ హేయ క్రియలన్నిటిలో దేనిని చేయక,

28 that the land not vomit you out also, when you defile it, as it vomited out the nation that was before you.యీ నా కట్ట డలను నా విధులను ఆచరింపవలెను.

29 "'For whoever shall do any of these abominations, even the souls that do them shall be cut off from among their people.ఎవరు అట్టి హేయ క్రియలలో దేనినైనను చేయుదురో వారు ప్రజలలొ నుండి కొట్టివేయబడుదురు.

30 Therefore you shall keep my charge, that you do not practice any of these abominable customs, which were practiced before you, and that you do not defile yourselves with them: I am Yahweh your God.'"కాబట్టి మీకంటె ముందుగా నున్నవారు అనుసరించిన ఆ హేయమైన ఆచారములలో దేనినైనను అనుసరించుటవలన అపవిత్రత కలుగజేసికొన కుండునట్లు నేను మీకు విధించిన విధి ననుసరించి నడుచు కొనవలెను. నేను మీ దేవుడనైన యెహోవాను.

Telugu Bible