Lamentations 5 - WEB (Telugu)
1 Remember, Yahweh, what has come on us: Look, and see our reproach.యెహోవా, మాకు కలిగిన శ్రమ జ్ఞాపకము చేసి కొనుము దృష్టించి మామీదికి వచ్చిన నింద యెట్టిదో చూడుము.
2 Our inheritance is turned to strangers, Our houses to aliens.మా స్వాస్థ్యము పరదేశుల వశమాయెను. మా యిండ్లు అన్యుల స్వాధీనమాయెను.
3 We are orphans and fatherless; Our mothers are as widows.మేము దిక్కులేనివారము తండ్రిలేనివారము మా తల్లులు విధవరాండ్రయిరి.
4 We have drunken our water for money; Our wood is sold to us.ద్రవ్యమిచ్చి నీళ్లు త్రాగితివిు క్రయమునకు కట్టెలు తెచ్చుకొంటిమి.
5 Our pursuers are on our necks: We are weary, and have no rest.మమ్మును తురుమువారు మా మెడలమీదికి ఎక్కి యున్నారు మేము అలసట చెందియున్నాము, విశ్రాంతి యనునది మాకు లేదు.
6 We have given the hand to the Egyptians, To the Assyrians, to be satisfied with bread.పొట్టకూటికై ఐగుప్తీయులకును అష్షూరీయులకును లోబడియున్నాము.
7 Our fathers sinned, and are no more; We have borne their iniquities.మా తండ్రులు పాపము చేసి గతించిపోయిరి మేము వారి దోషశిక్షను అనుభవించుచున్నాము.
8 Servants rule over us: There is none to deliver us out of their hand.దాసులు మాకు ప్రభువులైరి వారి వశమునుండి మమ్మును విడిపింపగలవా డెవడును లేడు.
9 We get our bread at the peril of our lives, Because of the sword of the wilderness.ఎడారిజనుల ఖడ్గభయమువలన ప్రాణమునకు తెగించి మా ధాన్యము తెచ్చుకొనుచున్నాము.
10 Our skin is black like an oven, Because of the burning heat of famine.మహా క్షామమువలన మా చర్మము పొయ్యివలె నలు పెక్కెను.
11 They ravished the women in Zion, The virgins in the cities of Judah.శత్రువులు సీయోనులో స్త్రీలను చెరిపిరి యూదా పట్టణములలో కన్యకలను చెరిపిరి.
12 Princes were hanged up by their hand: The faces of elders were not honored.చేతులు కట్టి అధిపతులను ఉరితీసిరి వారేమాత్రమును పెద్దలను ఘనపరచలేదు.
13 The young men bare the mill; The children stumbled under the wood.¸°వనులు తిరుగటిరాయి మోసిరి బాలురు కట్టెలమోపు మోయజాలక తడబడిరి.
14 The elders have ceased from the gate, The young men from their music.పెద్దలు గుమ్మములయొద్ద కూడుట మానిరి ¸°వనులు సంగీతము మానిరి.
15 The joy of our heart is ceased; Our dance is turned into mourning.సంతోషము మా హృదయమును విడిచిపోయెను నాట్యము దుఃఖముగా మార్చబడియున్నది.
16 The crown is fallen from our head: Woe to us! for we have sinned.మా తలమీదనుండి కిరీటము పడిపోయెను మేము పాపము చేసియున్నాము, మాకు శ్రమ.
17 For this our heart is faint; For these things our eyes are dim;దీనివలన మాకు ధైర్యము చెడియున్నది. సీయోను పర్వతము పాడైనది
18 For the mountain of Zion, which is desolate: The foxes walk on it.నక్కలు దానిమీద తిరుగులాడుచున్నవి మా కన్నులు దీని చూచి మందగిలెను.
19 You, Yahweh, abide forever; Your throne is from generation to generation.యెహోవా, నీవు నిత్యము ఆసీనుడవై యుందువు నీ సింహాసనము తరతరములుండును.
20 Why do you forget us forever, [And] forsake us so long time?నీవు మమ్ము నెల్లప్పుడును మరచిపోవుట ఏల? మమ్ము నింతకాలము విడిచిపెట్టుట ఏల?
21 Turn you us to you, Yahweh, and we shall be turned; Renew our days as of old.యెహోవా, నీవు మమ్మును నీతట్టు త్రిప్పినయెడల మేము తిరిగెదము. మా పూర్వస్థితి మరల మాకు కలుగజేయుము.
22 But you have utterly rejected us; You are very angry against us.నీవు మమ్మును బొత్తిగా విసర్జించి యున్నావు నీ మహోగ్రత మామీద వచ్చినది.
Telugu Bible