Lamentations 5 - BBE (Telugu)
1 Keep in mind, O Lord, what has come to us: take note and see our shame.యెహోవా, మాకు కలిగిన శ్రమ జ్ఞాపకము చేసి కొనుము దృష్టించి మామీదికి వచ్చిన నింద యెట్టిదో చూడుము.
2 Our heritage is given up to men of strange lands, our houses to those who are not our countrymen.మా స్వాస్థ్యము పరదేశుల వశమాయెను. మా యిండ్లు అన్యుల స్వాధీనమాయెను.
3 We are children without fathers, our mothers are like widows.మేము దిక్కులేనివారము తండ్రిలేనివారము మా తల్లులు విధవరాండ్రయిరి.
4 We give money for a drink of water, we get our wood for a price.ద్రవ్యమిచ్చి నీళ్లు త్రాగితివిు క్రయమునకు కట్టెలు తెచ్చుకొంటిమి.
5 Our attackers are on our necks: overcome with weariness, we have no rest.మమ్మును తురుమువారు మా మెడలమీదికి ఎక్కి యున్నారు మేము అలసట చెందియున్నాము, విశ్రాంతి యనునది మాకు లేదు.
6 We have given our hands to the Egyptians and to the Assyrians so that we might have enough bread.పొట్టకూటికై ఐగుప్తీయులకును అష్షూరీయులకును లోబడియున్నాము.
7 Our fathers were sinners and are dead; and the weight of their evil-doing is on us.మా తండ్రులు పాపము చేసి గతించిపోయిరి మేము వారి దోషశిక్షను అనుభవించుచున్నాము.
8 Servants are ruling over us, and there is no one to make us free from their hands.దాసులు మాకు ప్రభువులైరి వారి వశమునుండి మమ్మును విడిపింపగలవా డెవడును లేడు.
9 We put our lives in danger to get our bread, because of the sword of the waste land.ఎడారిజనుల ఖడ్గభయమువలన ప్రాణమునకు తెగించి మా ధాన్యము తెచ్చుకొనుచున్నాము.
10 Our skin is heated like an oven because of our burning heat from need of food.మహా క్షామమువలన మా చర్మము పొయ్యివలె నలు పెక్కెను.
11 They took by force the women in Zion, the virgins in the towns of Judah.శత్రువులు సీయోనులో స్త్రీలను చెరిపిరి యూదా పట్టణములలో కన్యకలను చెరిపిరి.
12 Their hands put princes to death by hanging: the faces of old men were not honoured.చేతులు కట్టి అధిపతులను ఉరితీసిరి వారేమాత్రమును పెద్దలను ఘనపరచలేదు.
13 The young men were crushing the grain, and the boys were falling under the wood.¸°వనులు తిరుగటిరాయి మోసిరి బాలురు కట్టెలమోపు మోయజాలక తడబడిరి.
14 The old men are no longer seated in the doorway, and the music of the young men has come to an end.పెద్దలు గుమ్మములయొద్ద కూడుట మానిరి ¸°వనులు సంగీతము మానిరి.
15 The joy of our hearts is ended; our dancing is changed into sorrow.సంతోషము మా హృదయమును విడిచిపోయెను నాట్యము దుఃఖముగా మార్చబడియున్నది.
16 The crown has been taken from our head: sorrow is ours, for we are sinners.మా తలమీదనుండి కిరీటము పడిపోయెను మేము పాపము చేసియున్నాము, మాకు శ్రమ.
17 Because of this our hearts are feeble; for these things our eyes are dark;దీనివలన మాకు ధైర్యము చెడియున్నది. సీయోను పర్వతము పాడైనది
18 Because of the mountain of Zion which is a waste; jackals go over it.నక్కలు దానిమీద తిరుగులాడుచున్నవి మా కన్నులు దీని చూచి మందగిలెను.
19 You, O Lord, are seated as King for ever; the seat of your power is eternal.యెహోవా, నీవు నిత్యము ఆసీనుడవై యుందువు నీ సింహాసనము తరతరములుండును.
20 Why have we gone from your memory for ever? why have you been turned away from us for so long?నీవు మమ్ము నెల్లప్పుడును మరచిపోవుట ఏల? మమ్ము నింతకాలము విడిచిపెట్టుట ఏల?
21 Make us come back to you, O Lord, and let us be turned; make our days new again as in the past.యెహోవా, నీవు మమ్మును నీతట్టు త్రిప్పినయెడల మేము తిరిగెదము. మా పూర్వస్థితి మరల మాకు కలుగజేయుము.
22 But you have quite given us up; you are full of wrath against us.నీవు మమ్మును బొత్తిగా విసర్జించి యున్నావు నీ మహోగ్రత మామీద వచ్చినది.
Telugu Bible