Proverbs 23 - WEB (Telugu)
1 When you sit to eat with a ruler, Consider diligently what is before you;నీవు ఏలికతో భోజనము చేయ కూర్చుండినయెడల నీవెవరి సమక్షమున నున్నావో బాగుగా యోచిం చుము.
2 Put a knife to your throat, If you are a man given to appetite.నీవు తిండిపోతువైనయెడల నీ గొంతుకకు కత్తి పెట్టుకొనుము.
3 Don't be desirous of his dainties, Seeing they are deceitful food.అతని రుచిగల పదార్థములను ఆశింపకుము అవి మోసపుచ్చు ఆహారములు.
4 Don't weary yourself to be rich. In your wisdom, show restraint.ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాని విడిచిపెట్టుము.
5 Why do you set your eyes on that which is not? For it certainly sprouts wings like an eagle and flies in the sky.నీవు దానిమీద దృష్టి నిలిపినతోడనే అది లేకపోవును నిశ్చయముగా అది రెక్కలు ధరించి యెగిరిపోవును. పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరి పోవును.
6 Don't eat the food of him who has a stingy eye, And don't crave his delicacies:ఎదుటివాని మేలు ఓర్చలేనివానితో కలిసి భోజనము చేయకుము వాని రుచిగల పదార్థముల నాశింపకుము.
7 For as he thinks about the cost, so he is. "Eat and drink!" he says to you, But his heart is not with you.అట్టివాడు తన ఆంతర్యములో లెక్కలు చూచుకొను వాడు తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే గాని అది హృదయములోనుండి వచ్చు మాట కాదు.
8 The morsel which you have eaten you shall vomit up, And lose your good words.నీవు తినినను తినినదానిని కక్కి వేయుదువు నీవు పలికిన యింపైన మాటలు వ్యర్థములగును.
9 Don't speak in the ears of a fool, For he will despise the wisdom of your words.బుద్ధిహీనుడు వినగా మాటలాడకుము అట్టివాడు నీ మాటలలోని జ్ఞానమును తృణీకరించును.
10 Don't move the ancient boundary stone. Don't encroach on the fields of the fatherless:పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయకుము తలిదండ్రులు లేనివారి పొలములోనికి నీవు చొరబడ కూడదు
11 For their Defender is strong. He will plead their case against you.వారి విమోచకుడు బలవంతుడు ఆయన వారిపక్షమున నీతో వ్యాజ్యెమాడును.
12 Apply your heart to instruction, And your ears to the words of knowledge.ఉపదేశముమీద మనస్సు నుంచుము తెలివిగల మాటలకు చెవి యొగ్గుము.
13 Don't withhold correction from a child. If you punish him with the rod, he will not die.నీ బాలురను శిక్షించుట మానుకొనకుము బెత్తముతో వాని కొట్టినయెడల వాడు చావకుండును
14 Punish him with the rod, And save his soul from Sheol.బెత్తముతో వాని కొట్టినయెడల పాతాళమునకు పోకుండ వాని ఆత్మను నీవు తప్పించె దవు.
15 My son, if your heart is wise, Then my heart will be glad, even mine:నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానము లభించిన యెడల నా హృదయముకూడ సంతోషించును.
16 Yes, my heart will rejoice, When your lips speak what is right.నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములు ఆనందించును.
17 Don't let your heart envy sinners; But rather fear Yahweh all the day long.పాపులను చూచి నీ హృదయమునందు మత్సరపడకుము నిత్యము యెహోవాయందు భయభక్తులు కలిగి యుండుము.
18 Indeed surely there is a future hope, And your hope will not be cut off.నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును నీ ఆశ భంగము కానేరదు.
19 Listen, my son, and be wise, And keep your heart on the right path!నా కుమారుడా, నీవు విని జ్ఞానము తెచ్చుకొనుము నీ హృదయమును యథార్థమైన త్రోవలయందు చక్కగా నడిపించుకొనుము.
20 Don't be among ones drinking too much wine, Or those who gorge themselves on meat:ద్రాక్షారసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగాతినువారితోనైనను సహ వాసము చేయకుము.
21 For the drunkard and the glutton shall become poor; And drowsiness clothes them in rags.త్రాగుబోతులును తిండిపోతులును దరిద్రులగుదురు. నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించుటకు కారణమగును.
22 Listen to your father who gave you life, And don't despise your mother when she is old.నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము.
23 Buy the truth, and don't sell it: Get wisdom, discipline, and understanding.సత్యమును అమి్మవేయక దాని కొనియుంచు కొనుము జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొనియుంచు కొనుము.
24 The father of the righteous has great joy. Whoever fathers a wise child delights in him.నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును జ్ఞానముగలవానిని కనినవాడు వానివలన ఆనందము నొందును.
25 Let your father and your mother be glad! Let her who bore you rejoice!నీ తలిదండ్రులను నీవు సంతోషపెట్టవలెను నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను.
26 My son, give me your heart; And let your eyes keep in my ways.నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా నుండనిమ్ము,
27 For a prostitute is a deep pit; And a wayward wife is a narrow well.వేశ్య లోతైన గొయ్యి పరస్త్రీ యిరుకైన గుంట.
28 Yes, she lies in wait like a robber, And increases the unfaithful among men.దోచుకొనువాడు పొంచియుండునట్లు అది పొంచి యుండును అది బహుమందిని విశ్వాసఘాతకులనుగా చేయును.
29 Who has woe? Who has sorrow? Who has strife? Who has complaints? Who has needless bruises? Who has bloodshot eyes?ఎవరికి శ్రమ? ఎవరికి దుఃఖము? ఎవరికి జగడములు? ఎవరికి చింత? ఎవరికి హేతువులేని గాయములు?ఎవరికి మంద దృష్టి?
30 Those who stay long at the wine; Those who go to seek out mixed wine.ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చువారికే గదా కలిపిన ద్రాక్షారసము రుచిచూడ చేరువారికే గదా.
31 Don't look at the wine when it is red, When it sparkles in the cup, When it goes down smoothly:ద్రాక్షారసము మిక్కిలి ఎఱ్ఱబడగను గిన్నెలో తళతళలాడుచుండగను త్రాగుటకు రుచిగా నుండగను దానివైపు చూడకుము.
32 In the end, it bites like a snake, And poisons like a viper.పిమ్మట అది సర్పమువలె కరచును కట్లపామువలె కాటువేయును.
33 Your eyes will see strange things, And your mind will imagine confusing things.విపరీతమైనవి నీ కన్నులకు కనబడును నీవు వెఱ్ఱిమాటలు పలుకుదువు
34 Yes, you will be as he who lies down in the midst of the sea, Or as he who lies on top of the rigging:నీవు నడిసముద్రమున పండుకొనువానివలె నుందువు ఓడకొయ్య చివరను పండుకొనువానివలె నుందువు.
35 "They hit me, and I was not hurt; They beat me, and I don't feel it! When will I wake up? I can do it again. I can find another."నన్ను కొట్టినను నాకు నొప్పి కలుగలేదు నామీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు నేనెప్పుడు నిద్ర మేల్కొందును? మరల దాని వెదకుదును అని నీవనుకొందువు.
Telugu Bible