Bible

Judges 21 - DBY (Telugu)

1 Now the men of Israel had sworn at Mizpah, "No one of us shall give his daughter in marriage to Benjamin."ఇశ్రాయేలీయులు తమలో ఎవడును తన కుమార్తెను బెన్యామీనీయుని కియ్యకూడదని మిస్పాలో ప్రమాణము చేసికొనియుండిరి.

2 And the people came to Bethel, and sat there till evening before God, and they lifted up their voices and wept bitterly.ప్రజలు బేతేలుకు వచ్చి దేవుని సన్ని ధిని సాయంకాలమువరకు కూర్చుండి

3 And they said, "O LORD, the God of Israel, why has this come to pass in Israel, that there should be today one tribe lacking in Israel?"యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, నేడు ఇశ్రాయేలీయులలో ఒక గోత్రము లేకపోయెను. ఇది ఇశ్రాయేలీయులకు సంభ వింపనేల అని బహుగా ఏడ్చిరి.

4 And on the morrow the people rose early, and built there an altar, and offered burnt offerings and peace offerings.మరునాడు జనులు వేకువనే లేచి అక్కడ బలిపీఠమును కట్టి దహనబలులను సమాధానబలులను అర్పించిరి.

5 And the people of Israel said, "Which of all the tribes of Israel did not come up in the assembly to the LORD?" For they had taken a great oath concerning him who did not come up to the LORD to Mizpah, saying, "He shall be put to death."అప్పుడు ఇశ్రాయేలీయులు ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో మిస్పాలో యెహోవా పక్షమున రాకపోయినవారెవరని విచారించిరి. ఏలయనగా అట్టివారికి నిశ్చయముగా మరణశిక్ష విధింప వలెనని ఖండితముగా ప్రమాణము చేసియుండిరి.

6 And the people of Israel had compassion for Benjamin their brother, and said, "One tribe is cut off from Israel this day.ఇశ్రాయేలీయులు తమ సహోదరులైన బెన్యామీనీయులను గూర్చి పశ్చాత్తాపపడినేడు ఒక గోత్రము ఇశ్రా యేలీయులలో నుండకుండ కొట్టివేయబడియున్నది;

7 What shall we do for wives for those who are left, since we have sworn by the LORD that we will not give them any of our daughters for wives?"మిగిలియున్నవారికి భార్యలు దొరుకునట్లు మనము మన కుమార్తెలను వారికి పెండ్లి చేయమని యెహోవా తోడని ప్రమాణము చేసితివిుగదా; వారి విషయములో ఏమి చేయ గలము? అని చెప్పుకొనిరి.

8 And they said, "What one is there of the tribes of Israel that did not come up to the LORD to Mizpah?" And behold, no one had come to the camp from Ja'besh-gil'ead, to the assembly.మరియు వారు ఇశ్రాయేలీ యుల గోత్రములలో యెహోవా పక్షమున మిస్పాకు రానిది ఏదని విచా రింపగా

9 For when the people were mustered, behold, not one of the inhabitants of Ja'besh-gil'ead was there.సమాజమునకుచేరిన యాబేష్గి లాదునుండి సేనలోనికి ఎవడును రాలేదని తేలెను. జన సంఖ్య చేసినప్పుడు యాబేష్గిలాదు నివాసులలో ఒకడును అక్కడ ఉండలేదు.

10 So the congregation sent thither twelve thousand of their bravest men, and commanded them, "Go and smite the inhabitants of Ja'besh-gil'ead with the edge of the sword; also the women and the little ones.కాబట్టి సమాజపు వారు పరా క్రమవంతులైన పండ్రెండు వేలమంది మనుష్యులను పంపించి మీరు పోయి స్త్రీల నేమి పిల్లల నేమి యాబేష్గిలాదు నివాసులనందరిని కత్తివాతను హతము చేయుడి.

11 This is what you shall do; every male and every woman that has lain with a male you shall utterly destroy."​మీరు చేయవలసినదేమనగా, ప్రతి పురుషుని పురుషసంయోగము నెరిగిన ప్రతి స్త్రీని నశింపజేయవలెనని చెప్పిరి.

12 And they found among the inhabitants of Ja'besh-gil'ead four hundred young virgins who had not known man by lying with him; and they brought them to the camp at Shiloh, which is in the land of Canaan.​​యాబేష్గి లాదు నివాసులలో పురుషసంయోగము నెరుగని నాలుగు వందలమంది కన్యలైన స్త్రీలు దొరుకగా కనాను దేశ మందలి షిలోహులోనున్న సేనలోనికి వారిని తీసికొనివచ్చిరి.

13 Then the whole congregation sent word to the Benjaminites who were at the rock of Rimmon, and proclaimed peace to them.ఆ సర్వసమాజము రిమ్మోను కొండలోనున్న బెన్యా మీనీయులతో మాటలాడుటకును వారిని సమాధానపరచు టకును వర్తమానము పంపగా

14 And Benjamin returned at that time; and they gave them the women whom they had saved alive of the women of Ja'besh-gil'ead; but they did not suffice for them.ఆ వేళను బెన్యా మీనీ యులు తిరిగి వచ్చిరి. అప్పుడు వారు తాము యాబేష్గి లాదు స్త్రీలలో బ్రదుకనిచ్చినవారిని వారికిచ్చి పెండ్లి చేసిరి. ఆ స్త్రీలు వారికి చాలక పోగా

15 And the people had compassion on Benjamin because the LORD had made a breach in the tribes of Israel.యెహోవా ఇశ్రాయేలీయుల గోత్రములలో లోపము కలుగజేసి యుండుట జనులు చూచి బెన్యామీనీయులనుగూర్చి పశ్చాత్తాపపడిరి.

16 Then the elders of the congregation said, "What shall we do for wives for those who are left, since the women are destroyed out of Benjamin?"సమాజప్రధానులు బెన్యామీను గోత్రములో స్త్రీలు నశించియుండుట చూచి మిగిలినవారికి భార్యలు దొరుకు నట్లు మనమేమి చేయుదమని యోచించుకొని

17 And they said, "There must be an inheritance for the survivors of Benjamin, that a tribe be not blotted out from Israel.ఇశ్రా యేలీయులలోనుండి ఒక గోత్రము తుడిచివేయ బడకుండు నట్లు బెన్యామీనీయులలో తప్పించుకొనిన వారికి స్వాస్థ్య ముండవలెననిరి.

18 Yet we cannot give them wives of our daughters." For the people of Israel had sworn, "Cursed be he who gives a wife to Benjamin."ఇశ్రాయేలీయులలో ఎవడైనను తన కుమార్తెను బెన్యామీనీయునికి ఇచ్చిన యెడల వాడు నిర్మూలము చేయబడునని ప్రమాణము చేసియున్నాము గనుక మనము మన కుమార్తెలను వారికి పెండ్లి చేయకూడ దని చెప్పుకొనుచుండిరి.

19 So they said, "Behold, there is the yearly feast of the LORD at Shiloh, which is north of Bethel, on the east of the highway that goes up from Bethel to Shechem, and south of Lebo'nah."​కాగా వారు బెన్యామీనీయు లతో ఇట్లనిరిఇదిగో బేతేలుకు ఉత్తరదిక్కున బేతేలు నుండి షెకెమునకు పోవు రాజమార్గమునకు తూర్పుననున్న లెబోనాకు దక్షిణ దిక్కున యెహోవాకు పండుగ ఏటేట షిలోహులో జరుగునని చెప్పి బెన్యామీనీయులను చూచి

20 And they commanded the Benjaminites, saying, "Go and lie in wait in the vineyards,మీరు వెళ్లి ద్రాక్షతోటలలో మాటుననుండి షిలోహు స్త్రీలు నాట్యమాడువారితో కలిసి నాట్యమాడుటకు బయలు దేరగా

21 and watch; if the daughters of Shiloh come out to dance in the dances, then come out of the vineyards and seize each man his wife from the daughters of Shiloh, and go to the land of Benjamin.​ద్రాక్షతోటలలోనుండి బయలు దేరివచ్చి పెండ్లి చేసికొనుటకు ప్రతివాడును షిలోహు స్త్రీలలో ఒకదాని పట్టుకొని బెన్యామీనీయుల దేశమునకు పారిపోవుడి.

22 And when their fathers or their brothers come to complain to us, we will say to them, 'Grant them graciously to us; because we did not take for each man of them his wife in battle, neither did you give them to them, else you would now be guilty.'"​తరువాత వారి తండ్రులైనను సహో దరులైనను వాదించుటకు మీయొద్దకు వచ్చినయెడల మేము ఆ యుద్ధమును బట్టి వారిలో ప్రతివానికిని పెండ్లికి స్త్రీ దొరకలేదు గనుక ఈ స్త్రీలను దయచేసి మాకియ్యుడి, ఈ సమయమున వారికిచ్చినయెడల మీరు అపరాధులగుదురు గనుక మాకిచ్చినట్లుగా ఇయ్యుడని వారితో చెప్పెద మనిరి.

23 And the Benjaminites did so, and took their wives, according to their number, from the dancers whom they carried off; then they went and returned to their inheritance, and rebuilt the towns, and dwelt in them.​​కాగా బెన్యామీనీయులు అట్లు చేసి తమ లెక్క చొప్పున నాట్యమాడిన వారిలోనుండి స్త్రీలను పట్టుకొని వారిని తీసికొని పోయి తమ స్వాస్థ్యమునకు వెళ్లి పట్టణములను కట్టి వాటిలో నివసించిరి.

24 And the people of Israel departed from there at that time, every man to his tribe and family, and they went out from there every man to his inheritance.అటుపిమ్మట ఇశ్రా యేలీయులలో ప్రతివాడును అక్కడనుండి తమ గోత్ర స్థానములకును కుటుంబములకును పోయెను. అందరును అక్కడనుండి బయలుదేరి తమ స్వాస్థ్యములకు పోయిరి.

25 In those days there was no king in Israel; every man did what was right in his own eyes.ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు; ప్రతి వాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచువచ్చెను.

Telugu Bible