Bible

Joshua 8 - WEB (Telugu)

1 Yahweh said to Joshua, Don't be afraid, neither be dismayed: take all the people of war with you, and arise, go up to Ai; behold, I have given into your hand the king of Ai, and his people, and his city, and his land;మరియు యెహోవా యెహోషువతో ఇట్లనెను భయపడకుము, జడియకుము, యుద్ధసన్నధ్ధులైన వారినంద రిని తోడుకొని హాయిమీదికి పొమ్ము. చూడుము; నేను హాయి రాజును అతని జనులను అతని పట్టణమును అతని దేశమును నీ చేతికప్పగించు చున్నాను.

2 You shall do to Ai and her king as you did to Jericho and her king: only the spoil of it, and the cattle of it, shall you take for a prey to yourselves: set you an ambush for the city behind it.నీవు యెరికోకును దాని రాజునకును ఏమి చేసితివో అదే హాయికిని దాని రాజునకును చేసెదవు; అయితే దాని సొమ్మును పశువులను మీరు కొల్లగా దోచుకొనవలెను. పట్టణపు పడమటి వైపున మాటు గాండ్లనుంచుము.

3 So Joshua arose, and all the people of war, to go up to Ai: and Joshua chose out thirty thousand men, the mighty men of valor, and sent them forth by night.యెహోషువయు యోధు లందరును హాయిమీదికి పోవలెననియుండగా, యెహో షువ పరాక్రమముగల ముప్పదివేల శూరులను ఏర్పరచి రాత్రివేళ వారిని పంపి

4 He commanded them, saying, Behold, you shall lie in ambush against the city, behind the city; don't go very far from the city, but be all ready:వారి కాజ్ఞాపించినదేమనగా ఈ పట్టణమునకు పడమటివైపున మీరు దాని పట్టుకొన చూచుచు పొంచియుండవలెను పట్టణమునకు బహుదూర మునకు వెళ్లక మీరందరు సిద్ధపడియుండుడి.

5 and I, and all the people who are with me, will approach to the city. It shall happen, when they come out against us, as at the first, that we will flee before them;​నేనును నాతోకూడనున్న జనులందరును పట్టణమునకు సమీపించె దము, వారు మునుపటివలె మమ్మును ఎదుర్కొనుటకు బయలుదేరగా మేము వారియెదుట నిలువక పారిపోదుము.

6 and they will come out after us, until we have drawn them away from the city; for they will say, They flee before us, as at the first: so we will flee before them;మునుపటివలె వీరు మనయెదుట నిలువలేక పారిపోదురని వారనుకొని, మేము పట్టణమునొద్దనుండి వారిని తొలగి రాజేయువరకు వారు మా వెంబడిని బయలు దేరి వచ్చెదరు; మేము వారియెదుట నిలువక పారిపోయి నప్పుడు మీరు పొంచియుండుట మాని

7 and you shall rise up from the ambush, and take possession of the city: for Yahweh your God will deliver it into your hand.లేచి పట్టణమును పట్టుకొనుడి; మీ దేవుడైన యెహోవా మీ చేతికి దాని నప్పగించును.

8 It shall be, when you have seized on the city, that you shall set the city on fire; according to the word of Yahweh shall you do: behold, I have commanded you.మీరు ఆ పట్టణమును పట్టుకొనినప్పుడు యెహోవా మాట చొప్పున జరిగించి దానిని తగులబెట్ట వలెను.

9 Joshua sent them forth; and they went to set up the ambush, and stayed between Bethel and Ai, on the west side of Ai: but Joshua lodged that night among the people.ఇదిగో నేను మీ కాజ్ఞాపించియున్నానని చెప్పి యెహోషువ వారిని పంపగా వారు పొంచియుండుటకు పోయి హాయి పడమటి దిక్కున బేతేలునకును హాయికిని మధ్య నిలిచిరి. ఆ రాత్రి యెహోషువ జనులమధ్య బసచేసెను.

10 Joshua arose up early in the morning, and mustered the people, and went up, he and the elders of Israel, before the people to Ai.ఉదయమున యెహోషువ వేకువను లేచి జనులను వ్యూహపరచి, తానును ఇశ్రాయేలీయుల పెద్దలును జను లకుముందుగా హాయిమీదికి పోయిరి.

11 All the people, [even] the [men of] war who were with him, went up, and drew near, and came before the city, and encamped on the north side of Ai: now there was a valley between him and Ai.అతని యొద్దనున్న యోధులందరు పోయి సమీపించి ఆ పట్టణము నెదుటికి వచ్చి హాయికి ఉత్తరదిక్కున దిగిరి.

12 He took about five thousand men, and set them in ambush between Bethel and Ai, on the west side of the city.వారికిని హాయికిని మధ్యను లోయయుండగా అతడు ఇంచుమించు అయిదు వేలమంది మనుష్యులను నియమించి పట్టణమునకు పడమటి వైపున బేతేలునకును హాయికిని మధ్యను పొంచియుండుటకు ఉంచెను.

13 So they set the people, even all the host who was on the north of the city, and their liers-in-wait who were on the west of the city; and Joshua went that night into the midst of the valley.వారు ఆ జనులను, అనగా పట్టణమునకు ఉత్తర దిక్కుననున్న సమస్త సైన్యమును పట్టణమునకు పడ మటి దిక్కున దాని వెనుకటి భాగమున నున్నవారిని, ఉంచిన తరువాత యెహోషువ ఆ రాత్రి లోయలోనికి దిగి పోయెను.

14 It happened, when the king of Ai saw it, that they hurried and rose up early, and the men of the city went out against Israel to battle, he and all his people, at the time appointed, before the Arabah; but he didn't know that there was an ambush against him behind the city.హాయి రాజు దాని చూచినప్పుడు అతడును అతని జనులందరును పట్టణస్థులందరును త్వరపడి పెందలకడలేచి మైదానమునెదుట ఇశ్రాయేలీయులను ఎదుర్కొని, తాము అంతకుముందు నిర్ణయించుకొనిన స్థలమున యుద్ధముచేయు టకు బయలుదేరిరి. తన్ను పట్టుకొనుటకు పొంచియున్న వారు పట్టణమునకు పడమటివైపుననుండిన సంగతి అతడు తెలిసికొనలేదు.

15 Joshua and all Israel made as if they were beaten before them, and fled by the way of the wilderness.​యెహోషువయు ఇశ్రాయేలీయులంద రును వారి యెదుట నిలువలేక ఓడిపోయినవారైనట్టు అరణ్యమార్గముతట్టు పారిపోయినప్పుడు

16 All the people who were in the city were called together to pursue after them: and they pursued after Joshua, and were drawn away from the city.వారిని ఆతుర ముగా తరుముటకై హాయిలోనున్న జనులందరు కూడుకొని యెహోషువను తరుముచు పట్టణమునకు దూరముగా పోయిరి.

17 There was not a man left in Ai or Beth El, who didn't go out after Israel: and they left the city open, and pursued after Israel.ఇశ్రాయేలీయులను తరుముటకు పోనివాడొక డును హాయిలోనేగాని బేతేలులోనేగాని మిగిలియుండ లేదు. వారు గవిని వేయక పట్టణమును విడిచి ఇశ్రా యేలీయులను తరుమబోయి యుండిరి.

18 Yahweh said to Joshua, Stretch out the javelin that is in your hand toward Ai; for I will give it into your hand. Joshua stretched out the javelin that was in his hand toward the city.అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెనునీవు చేతపట్టు కొనిన యీటెను హాయి వైపుగా చాపుము, పట్టణమును నీ చేతి కప్పగింతును, అంతట యెహోషువ తన చేతనున్న యీటెను ఆ పట్టణమువైపు చాపెను.

19 The ambush arose quickly out of their place, and they ran as soon as he had stretched out his hand, and entered into the city, and took it; and they hurried and set the city on fire.అతడు తన చెయ్యి చాపగా పొంచియున్నవారు మాటులోనుండి త్వరగా లేచి పరుగెత్తి పట్టణములో చొచ్చి దాని పట్టుకొని అప్పుడే తగులబెట్టిరి.

20 When the men of Ai looked behind them, they saw, and, behold, the smoke of the city ascended up to heaven, and they had no power to flee this way or that way: and the people who fled to the wilderness turned back on the pursuers.హాయివారు వెనుక వైపు తిరిగి చూచినప్పుడు ఆ పట్టణముయొక్క పొగ ఆకాశమున కెక్కుచుండెను. అప్పుడు అరణ్యమునకు పారిపోయిన జనులు తిరిగి తమ్మును తరుముచున్న వారి మీద పడుచుండిరి గనుక ఈ తట్టయినను ఆ తట్టయినను పారిపోవుటకు వారికి వీలులేక పోయెను.

21 When Joshua and all Israel saw that the ambush had taken the city, and that the smoke of the city ascended, then they turned again, and killed the men of Ai.పొంచియున్నవారు పట్టణమును పట్టుకొనియుండుటయు పట్టణపు పొగ యెక్కుచుండు టయు యెహోషువయు ఇశ్రాయేలీయులందరును చూచి నప్పుడు వారు తిరిగి హాయివారిని హతము చేసిరి.

22 The others came forth out of the city against them; so they were in the midst of Israel, some on this side, and some on that side: and they struck them, so that they let none of them remain or escape.తక్కిన వారును పట్టణములోనుండి బయలుదేరి వారికి ఎదురుగా వచ్చిరి. అట్లు ఈ తట్టు కొందరు ఆ తట్టు కొందరు ఉండగా హాయివారు ఇశ్రాయేలీయుల నడుమ చిక్కుబడిరి గనుక ఇశ్రాయేలీయులు వారిని హతముచేసిరి. వారిలో ఒకడును మిగులలేదు; ఒకడును తప్పించుకొనలేదు.

23 The king of Ai they took alive, and brought him to Joshua.వారు హాయి రాజును ప్రాణముతో పట్టుకొని యెహోషువయొద్దకు తీసికొనివచ్చిరి.

24 It happened, when Israel had made an end of killing all the inhabitants of Ai in the field, in the wilderness in which they pursued them, and they were all fallen by the edge of the sword, until they were consumed, that all Israel returned to Ai, and struck it with the edge of the sword.బీటిలోను పొలములోను హాయి నివాసులను తరిమిన ఇశ్రాయేలీయులు వారిని చంపుట చాలింపగా, కత్తివాత కూలక మిగిలినవాడొకడును లేకపోయినప్పుడు ఇశ్రా యేలీయులందరు హాయియొద్దకు తిరిగివచ్చి దానిని కత్తి వాతను నిర్మూలము చేసిరి.

25 All that fell that day, both of men and women, were twelve thousand, even all the men of Ai.ఆ దినమున పడిన స్త్రీ పురుషు లందరు పండ్రెండు వేలమంది.

26 For Joshua didn't draw back his hand, with which he stretched out the javelin, until he had utterly destroyed all the inhabitants of Ai.యెహోషువ హాయి నివాసులనందరిని నిర్మూలము చేయువరకు ఈటెను పట్టు కొని చాచిన తన చేతిని తిరిగి ముడుచుకొనలేదు.

27 Only the cattle and the spoil of that city Israel took for prey to themselves, according to the word of Yahweh which he commanded Joshua.యెహోవా యెహోషువకు ఆజ్ఞాపించిన మాటచొప్పున ఇశ్రాయేలీయులు ఆ పట్టణములోని పశువులను సొమ్మును తమకొరకు కొల్లగా దోచుకొనిరి.

28 So Joshua burnt Ai, and made it a heap forever, even a desolation, to this day.అట్లు యెహోషువ హాయినిత్యము పాడైపోవలెనని దాని కాల్చివేసెను; నేటి వరకు అది అట్లే యున్నది.

29 The king of Ai he hanged on a tree until the evening: and at the going down of the sun Joshua commanded, and they took his body down from the tree, and cast it at the entrance of the gate of the city, and raised thereon a great heap of stones, to this day.యెహోషువ హాయిరాజును సాయంకాలమువరకు మ్రానుమీద వ్రేలాడ దీసెను. ప్రొద్దు గ్రుంకు చున్నప్పుడు సెలవియ్యగా జనులు వాని శవమును మ్రానుమీదనుండి దించి ఆ పురద్వారము నెదుట దాని పడవేసి దానిమీద పెద్ద రాళ్లకుప్ప వేసిరి. అది నేటివరకు ఉన్నది.

30 Then Joshua built an altar to Yahweh, the God of Israel, in Mount Ebal,మోషే ధర్మశాస్త్రగ్రంథములో వ్రాయబడిన ప్రకా రము

31 as Moses the servant of Yahweh commanded the children of Israel, as it is written in the book of the law of Moses, an altar of uncut stones, on which no man had lifted up any iron: and they offered thereon burnt offerings to Yahweh, and sacrificed peace-offerings.యెహోవా సేవకుడైన మోషే ఇశ్రాయేలీయుల కాజ్ఞాపించినట్లు యెహోషువ ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామమున బలిపీఠమును ఇనుప పనిముట్లు తగిలింపని కారు రాళ్లతో ఏబాలు కొండమీద కట్టించెను. దానిమీద వారు యెహోవాకు దహనబలులను సమాధాన బలులను అర్పించిరి.

32 He wrote there on the stones a copy of the law of Moses, which he wrote, in the presence of the children of Israel.మోషే ఇశ్రాయేలీయులకు వ్రాసి యిచ్చిన ధర్మశాస్త్రగ్రంథమును ఒక ప్రతిని అతడు అక్కడ ఆ రాళ్లమీద వ్రాయించెను.

33 All Israel, and their elders and officers, and their judges, stood on this side of the ark and on that side before the priests the Levites, who bore the ark of the covenant of Yahweh, as well the foreigner as the native; half of them in front of Mount Gerizim, and half of them in front of Mount Ebal; as Moses the servant of Yahweh had commanded at the first, that they should bless the people of Israel.అప్పుడు ఇశ్రా యేలీయులను దీవించుటకు యెహోవా సేవకుడైన మోషే పూర్వము ఆజ్ఞాపించినది జరుగవలెనని, పరదేశులేమి వారిలో పుట్టినవారేమి ఇశ్రా యేలీయులందరును వారి పెద్దలును వారి నాయకులును వారి న్యాయాధిపతులును యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులైన లేవీయుల ముందర ఆ మందసమునకు ఈ వైపున ఆ వైపున నిలిచిరి. వారిలో సగముమంది గెరిజీము కొండయెదుటను సగము మంది ఏబాలు కొండయెదుటను నిలువగా యెహోషువ

34 Afterward he read all the words of the law, the blessing and the curse, according to all that is written in the book of the law.ఆ ధర్మశాస్త్రగ్రంథములో వ్రాయబడిన వాటన్నిటిని బట్టి ఆ ధర్మశాస్త్ర వాక్యములనన్నిటిని, అనగా దాని దీవెన వచనమును దాని శాప వచనమును చదివి వినిపించెను. స్త్రీలును పిల్ల లును వారి మధ్యనుండు పరదేశులును విను చుండగా

35 There was not a word of all that Moses commanded, which Joshua didn't read before all the assembly of Israel, and the women, and the little ones, and the foreigners who were among them.​యెహోషువ సర్వసమాజము నెదుట మోషే ఆజ్ఞాపించిన వాటన్నిటిలో చదువక విడిచిన మాటయొక్క టియు లేదు.

Telugu Bible