Bible

John 9 - BBE (Telugu)

1 And when he went on his way, he saw a man blind from birth.ఆయన మార్గమున పోవుచుండగా పుట్టు గ్రుడ్డియైన యొక మనుష్యుడు కనబడెను.

2 And his disciples put a question to him, saying, Master, was it because of this man's sin, or the sin of his father and mother, that he has been blind from birth?ఆయన శిష్యులు బోధకుడా, వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా, వీని కన్నవారా? అని ఆయనను అడుగగా

3 Jesus said in answer, It was not because of his sin, or because of his father's or mother's; it was so that the works of God might be seen openly in him.యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని, దేవుని క్రియలు వీనియందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను.

4 While it is day we have to do the works of him who sent me: the night comes when no work may be done.పగలున్నంతవరకు నన్ను పంపినవాని క్రియలు మనము చేయుచుండవలెను; రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడును పనిచేయలేడు.

5 As long as I am in the world, I am the light of the world.నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పెను.

6 Having said these words, he put earth, mixed with water from his mouth, on the man's eyes,ఆయన ఇట్లు చెప్పి నేలమీద ఉమి్మవేసి, ఉమి్మతో బురదచేసి, వాని కన్నులమీద ఆ బురద పూసి

7 And said to him, Go and make yourself clean in the bath of Siloam (the sense of the name is, Sent). So he went away and, after washing, came back able to see.నీవు సిలోయము కోనేటికి వెళ్లి అందులో కడుగు కొనుమని చెప్పెను. సిలోయమను మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్లి కడుగుకొని చూపు గలవాడై వచ్చెను.

8 Then the neighbours and others who had seen him before in the street, with his hand out for money, said, Is not this the man who got money from people?కాబట్టి పొరుగువారును, వాడు భిక్షకుడని అంతకుముందు చూచినవారునువీడు కూర్చుండి భిక్ష మెత్తుకొనువాడు కాడా అనిరి.

9 Some said, It is he: others said, No, but he is like him. He said, I am he.వీడే అని కొందరును, వీడుకాడు, వీని పోలియున్న యొకడని మరికొందరును అనిరి; వాడైతేనేనే యనెను.

10 So they said to him, How then were your eyes made open?వారు నీ కన్నులేలాగు తెరవబడెనని వాని నడుగగా

11 His answer was: The man who is named Jesus put earth mixed with water on my eyes, and said to me, Go and make yourself clean in Siloam: so I went away and, after washing, am now able to see.వాడుయేసు అను నొక మనుష్యుడు బురద చేసి నా కన్నులమీద పూసి నీవు సిలోయమను కోనేటికి వెళ్లి కడుగుకొనుమని నాతో చెప్పెను; నేను వెళ్లి కడుగుకొని చూపు పొందితిననెను.

12 And they said to him, Where is he? His answer was: I have no knowledge.వారు, ఆయన ఎక్కడనని అడుగగా వాడు, నేనెరుగననెను.

13 They took him before the Pharisees--this man who had been blind.అంతకుముందు గ్రుడ్డియై యుండినవానిని వారు పరిసయ్యులయొద్దకు తీసికొనిపోయిరి.

14 Now the day on which the earth was mixed by Jesus and the man's eyes were made open was the Sabbath.యేసు బురదచేసి వాని కన్నులు తెరచిన దినము విశ్రాంతిదినము

15 So the Pharisees put more questions to him about how his eyes had been made open. And he said to them, He put earth on my eyes, and I had a wash and am able to see.వాడేలాగు చూపుపొందెనో దానినిగూర్చి పరిసయ్యులు కూడ వానిని మరల అడుగగా వాడు నా కన్నులమీద ఆయన బురద ఉంచగా నేను కడుగు కొని చూపు పొందితినని వారితో చెప్పెను.

16 Then some of the Pharisees said, That man has not come from God, for he does not keep the Sabbath. Others said, How is it possible for a sinner to do such signs? So there was a division among them.కాగా పరిసయ్యులలో కొందరు ఈ మనుష్యుడు విశ్రాంతిదినము ఆచరించుటలేదు గనుక దేవుని యొద్దనుండి వచ్చినవాడు కాడనిరి. మరికొందరు పాపియైన మనుష్యుడు ఈలాటి సూచకక్రియ లేలాగు చేయగలడనిరి; ఇట్లు వారిలో భేదము పుట్టెను.

17 Again they said to the blind man, What have you to say about him for opening your eyes? And he said, He is a prophet.కాబట్టి వారు మరల ఆ గ్రుడ్డివానితో అతడు నీ కన్నులు తెరచినందుకు నీవతనిగూర్చి యేమను కొనుచున్నావని యడుగగా వాడు ఆయన ఒక ప్రవక్త అనెను.

18 Now the Jews had no belief in the statement that he had been blind and was now able to see, till they sent for the father and mother of the man whose eyes had been made open,వాడు గ్రుడ్డి వాడైయుండి చూపు పొందెనని యూదులు నమ్మక, చూపు పొందినవాని తలిదండ్రులను పిలిపించి,

19 And put the question to them, saying, Is this your son, of whom you say that he was blind at birth? how is it then that he is now able to see?గ్రుడ్డివాడై పుట్టెనని మీరు చెప్పు మీ కుమారుడు వీడేనా? ఆలాగైతే ఇప్పుడు వీడేలాగు చూచు చున్నాడని వారిని అడిగిరి.

20 In answer his father and mother said, We are certain that this is our son and that he was blind at birth:అందుకు వాని తలిదండ్రులువీడు మా కుమారుడనియు వీడు గ్రుడ్డివాడుగా పుట్టెననియు మేమెరుగుదుము.

21 But how it is he is now able to see, or who made his eyes open, we are not able to say: put the question to him; he is old enough to give an answer for himself.ఇప్పుడు వీడేలాగు చూచుచున్నాడో యెరుగము; ఎవడు వీని కన్నులు తెరచెనో అదియు మేమెరుగము; వీడు వయస్సు వచ్చినవాడు, వీనినే అడుగుడి; తన సంగతి తానే చెప్పుకొనగలడని వారితో అనిరి.

22 They said this because of their fear of the Jews: for the Jews had come to an agreement that if any man said that Jesus was the Christ he would be put out of the Synagogue.వాని తలిదండ్రులు యూదులకు భయపడి ఆలాగు చెప్పిరి; ఎందుకనిన ఆయన క్రీస్తు అని యెవరైనను ఒప్పుకొనినయెడల వానిని సమాజమందిరములోనుండి వెలి వేతుమని యూదులు అంతకుమునుపు నిర్ణయించుకొని యుండిరి.

23 That was the reason why they said, He is old enough; put the question to him.కావున వాని తలిదండ్రులువాడు వయస్సు వచ్చినవాడు; వానిని అడుగుడనిరి.

24 So they sent a second time for the man who had been blind and they said to him, Give glory to God: it is clear to us that this man is a sinner.కాబట్టి వారు గ్రుడ్డివాడైయుండిన మనుష్యుని రెండవ మారు పిలిపించి దేవుని మహిమపరచుము; ఈ మనుష్యుడు పాపియని మేమెరుగుదుమని వానితో చెప్పగా

25 He said in answer, I have no knowledge if he is a sinner or not, but one thing I am certain about; I was blind, and now I see.వాడు ఆయన పాపియో కాడో నేనెరుగను; ఒకటి మాత్రము నేనెరుగు దును; నేను గ్రుడ్డివాడనైయుండి ఇప్పుడు చూచుచున్నా ననెను.

26 Then they said to him, What did he do to you? how did he give you the use of your eyes?అందుకు వారు ఆయన నీకేమి చేసెను? నీ కన్నులు ఏలాగు తెరచెనని మరల వానిని అడుగగా

27 His answer was: I have said it before, but your ears were shut: why would you have me say it again? is it your desire to become his disciples?వాడు ఇందాక మీతో చెప్పితిని గాని మీరు వినకపోతిరి; మీరెందుకు మరల వినగోరుచున్నారు? మీరును ఆయన శిష్యులగుటకు కోరుచున్నారా యేమి అని వారితో అనెను.

28 And they were angry with him and said, You are his disciple, but we are disciples of Moses.అందుకు వారు నీవే వాని శిష్యుడవు, మేము మోషే శిష్యులము;

29 We are certain that God gave his word to Moses: but as for this man, we have no knowledge where he comes from.దేవుడు మోషేతో మాటలాడెనని యెరుగుదుము గాని వీడెక్కడనుండి వచ్చెనో యెరుగమని చెప్పి వానిని దూషించిరి.

30 The man said in answer, Why, here is a strange thing! You have no knowledge where he comes from though he gave me the use of my eyes.అందుకు ఆ మనుష్యుడు ఆయన ఎక్కడనుండి వచ్చెనో మీరెరుగకపోవుట ఆశ్చర్యమే; అయినను ఆయన నా కన్నులు తెరచెను.

31 We have knowledge that God does not give ear to sinners, but if any man is a worshipper of God and does his pleasure, to him God's ears are open.దేవుడు పాపుల మనవి ఆలకింపడని యెరుగుదుము; ఎవడైనను దేవభక్తుడై యుండి ఆయన చిత్తముచొప్పున జరిగించినయెడల ఆయన వాని మనవి ఆలకించును.

32 In all the years nobody has ever before seen the eyes of a man blind from birth made open.పుట్టు గ్రుడ్డివాని కన్నులెవరైన తెరచినట్టు లోకము పుట్టినప్పటినుండి వినబడలేదు.

33 If this man did not come from God he would be unable to do anything.ఈయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కానియెడల ఏమియు చేయనేరడని వారితో చెప్పెను.

34 Their answer was: You came to birth through sin; do you make yourself our teacher? And they put him out of the Synagogue.అందుకు వారు నీవు కేవలము పాపివై పుట్టినవాడవు, నీవు మాకు బోధింప వచ్చితివా అని వానితో చెప్పి వాని వెలివేసిరి.

35 It came to the ears of Jesus that they had put him out, and meeting him he said, Have you faith in the Son of man?పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని నీవు దేవుని కుమారునియందు విశ్వాసముంచు చున్నావా అని అడిగెను.

36 He said in answer, And who is he, Lord? Say, so that I may have faith in him.అందుకు వాడు ప్రభువా, నేను ఆయనయందు విశ్వాసముంచుటకు ఆయన ఎవడని అడుగగా

37 Jesus said to him, You have seen him; it is he who is talking to you.యేసు నీవాయనను చూచుచున్నావు; నీతో మాటలాడుచున్నవాడు ఆయనే అనెను.

38 And he said, Lord, I have faith. And he gave him worship.అంతట వాడుప్రభువా, నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను.

39 And Jesus said, I came into this world to be a judge, so that those who do not see may see, and those who see may become blind.అప్పుడు యేసుచూడనివారు చూడవలెను, చూచువారు గ్రుడ్డివారు కావలెను, అను తీర్పు నిమిత్తము నేనీలోకమునకు వచ్చితినని చెప్పెను.

40 These words came to the ears of the Pharisees who were with him and they said to him, Are we, then, blind?ఆయన యొద్దనున్న పరిసయ్యులలో కొందరు ఈ మాట వినిమేమును గ్రుడ్డివారమా అని అడిగిరి.

41 Jesus said to them, If you were blind you would have no sin: but now that you say, We see; your sin is there still.అందుకు యేసు మీరు గ్రుడ్డివారైతే మీకు పాపము లేక పోవును గాని చూచుచున్నామని మీరిప్పుడు చెప్పు కొనుచున్నారు గనుక మీ పాపము నిలిచియున్నదని చెప్పెను.

Telugu Bible